Kannappa Controversy : మంచు విష్ణు (Manchu Vishnu) తన డ్రీం ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ (Kannappa) ను ఏ ముహూర్తాన మొదలు పెట్టారో తెలియదు కానీ, ఈ మూవీ రోజుకో వివాదంలో చిక్కుకుంటుంది. గత కొన్ని రోజులుగా ‘కన్నప్ప’ మూవీ కారణంగా తనికెళ్ల భరణి (Thanikella Bharani), మంచు విష్ణు మధ్య నెలకొన్న వివాదంపై తాజాగా క్లారిటీ వచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు విష్ణు అసలు ‘కన్నప్ప’ విషయంలో తామిద్దరి మధ్య ఏం జరిగింది? అనే విషయాన్ని క్లియర్ గా చెప్పుకొచ్చారు.
అసలు ‘కన్నప్ప’ కాంట్రవర్సీ ఏంటి?
మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో ‘కన్నప్ప’ (Kannappa) అనే మూవీని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్ లాంటి బడా స్టార్స్ కూడా కనిపించబోతున్నారు. శర వేగంగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తవుతోంది. మరోవైపు వివాదాలు కూడా అదే రేంజ్ లో చుట్టుపడుతున్నాయి. ఇక ‘కన్నప్ప’ విషయంలో అందరిని ఆకట్టుకున్న వివాదం తనికెళ్ల భరణి చేసిన కామెంట్స్. స్టోరీ మంచు విష్ణుదే, కానీ కథ నేనే రాసుకున్నాను అని తనికెళ్ల భరణి క్లైమ్ చేసుకోవడం కొత్త వివాదానికి దారి తీసింది. తాజా ఇంటర్వ్యూలో విష్ణు ఈ విషయంపై వివరణ ఇచ్చారు.
అసలేం జరిగిందంటే?
మంచు విష్ణు (Manchu Vishnu) తనికెళ్ల భరణి (Thanikella Bharani)తో వివాదం గురించి మాట్లాడుతూ “తనికెళ్ల భరణి గారే నాకు ఈ ఐడియా ఇచ్చింది. అప్పుడే స్టోరీ బోర్డింగ్ అంతా చేయడం స్టార్ట్ చేసాము. లార్డ్ ఆఫ్ ది రింగ్స్ అనే హాలీవుడ్ సినిమా, నావెల్స్ కూడా ఉన్నాయి. నేను వాటికి చాలా పెద్ద అభిమానిని. కన్నప్ప విషయంలో నా వర్షన్ ప్రకారం లార్డ్ ఆఫ్ ది రింగ్స్ రేంజ్ లో రెడీ చేస్తున్నాను. ఒకరోజు స్టోరీ డిస్కషన్స్ లో తనికెళ్ల భరణి గారు వచ్చి, విష్ణు నువ్వు అనుకునే ఈ యుద్ధాలు, ఫైట్లు అయ్యే పని కాదు. నేను ఇలాంటివి చేయలేను. ఇలాంటి దర్శకుడుని కాదు నేను. నేను దీన్ని ఆర్ట్ ఫిలిం లాగా తీయగలను. రెండు మూడు కోట్లలో అయితే సినిమాను చేస్తాను. అంతకంటే ఎక్కువ ప్రెజర్ ని నేను తీసుకోను. కానీ కథను నీకు ఇచ్చేస్తాను విష్ణు. నువ్వు చేసుకో అని అన్నారు. దీంతో నా మనసు బాగా విరిగిపోయింది. అప్పటి నుంచి నాకు ఈ సినిమా చేయడానికి శివుడి అనుగ్రహం లేదు అని మనసులో అనుకుని, నెమ్మదిగా నేను మూవీ టెక్నికల్ టీం, నటీనటులను సెలెక్ట్ చేసుకోవడం మొదలుపెట్టాను. నాన్నగారు సడన్ గా ఇప్పుడు చెప్పడంతో అనుకున్న విధంగా స్టార్ట్ చేశాను. పైగా ఎప్పటి నుంచో దీనిపై వర్క్ చేయడం వల్ల అనుకోగానే ప్రాజెక్ట్ ను పట్టాలు ఎక్కించగలిగాము” అంటూ వివరణ ఇచ్చారు.