ఫుడ్ సేఫ్టీ అధికారులు నిత్యం తనిఖీలు నిర్వహిస్తూ శుభ్రత పాటించని హోటళ్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నా.. తీరు మారడం లేదు. గల్లీ రెస్టారెంట్ల నుంచి మొదలుకొని ఫేమస్ హోటళ్ల వరకు ఇదే పరిస్థితి. చాలా హోటళ్లు బేసిక్ నీట్ నెస్ పాటించడం లేదు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూనే ఉన్నారు. నాసిరకం వంట నూనెలతో పాటు వంటసామాన్లు ఉపయోగిస్తున్నారు. కల్తీ పదార్థాలే ప్రాణాలకు ముప్పు అనుకుంటే, ఏకంగా తినే ఫుడ్ లో పురుగులు, బొద్దింకలు దర్శనం ఇస్తున్నాయి.
సాంబార్ రైస్ లో బొద్దింక
హైదరాబాద్ లో బయట ఫుడ్ తినాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. సాధారణ హోటళ్ల నుంచి స్టార్ హోటళ్ల వరకు కనీసం శుభ్రత పాటించడం లేదు. ఫుడ్ సేఫ్టీ అధికారులు నిత్యం దాడులు నిర్వహిస్తున్నప్పటికీ, హోటల్స్ యాజమాన్యాల తీరు ఏమాత్రం మారడం లేదు. ఇప్పటికే పలు సందర్భాల్లో కర్రీస్, సాంబారులో బొద్దింకలు, పురుగులు వచ్చిన సంఘటనలు చూశాం. తాజాగా హైదరాబాద్ లోని మరో ఫేమస్ హోటల్లో సాంబార్ రైస్ ఆర్డర్ చేసిన కస్టమర్లు షాక్ అయ్యారు. వెంటనే హోటల్ సిబ్బందిని నిలదీయడంతో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. హోటల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
బేగంపేట టూరింజం ప్లాజాలోని హోటల్లో దారుణం
హైదరాబాద్ బేగంపేటలోని టూరిజం ప్లాజాలో ఉన్న మినర్వా హోటల్ కు రాణా, సురేష్ అనే ఇద్దరు కస్టమర్లు వెళ్లారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో సాంబార్ రైస్ ఆర్డర్ చేశారు. కాసేపటికి హోటల్ సిబ్బంది వేడి వేడి ఫుడ్ తీసుకొచ్చారు. ఆకలితో ఉన్న కస్టమర్లు తినడం మొదలు పెట్టారు. కొంచెం తినగా షాక్ అయ్యారు. సాంబార్ రైస్ లో పెద్ద బొద్దింక కనిపించింది. కస్టమర్లకు ఓ రేంజ్ లో కోపం వచ్చింది. హోటల్ సిబ్బందిని నిలదీశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతారా? అంటూ నిలదీశారు. అయినప్పటికీ, సైలెంట్ గా ఉండిపోయారు.
Read Also: ఇదెక్కడి దొంగతనం రా బాబూ.. రైల్వే స్టేషన్ లో యువకుడికి ఊహించని షాక్!
ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసిన కస్టమర్లు
అటు ఈ ఘటనపై కస్టమర్లు సురేష్, రాణా ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. శుభ్రత పాటించని హోటల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరారు. హోటల్ ను పూర్తి స్థాయిలో తనిఖీ నిర్వహించి, భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే హైదరాబాద్ లోని పలు హోటల్స్ పై చర్యలు తీసుకుంటున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు, మినర్వా హోటల్ పైనా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి హోటల్స్ మీద చర్యలు తీసుకుంటేనే, మిగతా హోటల్స్ భయపడే అవకాశం ఉంటుందంటున్నారు. బాధితులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు మినర్వాపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
Read Also: ఇదెక్కడి దొంగతనం రా బాబూ.. రైల్వే స్టేషన్ లో యువకుడికి ఊహించని షాక్!