BigTV English

Trafficking Survivor Rejected: 15 ఏళ్ల క్రితం తప్పిపోయిన బాలిక.. కష్టాలుపడి ఇంటికి తిరిగివస్తే షాకింగ్ దృశ్యం

Trafficking Survivor Rejected: 15 ఏళ్ల క్రితం తప్పిపోయిన బాలిక.. కష్టాలుపడి ఇంటికి తిరిగివస్తే షాకింగ్ దృశ్యం

Trafficking Survivor Rejected| ఈ ప్రపంచంలో న్యాయం కంటే అన్యాయమైన జీవితగాధలే ఎక్కువ. ఎవరో చేసిన తప్పుకు, అమాయకుల జీవితాలు బలిఅవుతాయి. తాజాగా సోషల్ మీడియాలో ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ సమాజంలో సామాన్యులు, నిరుపేదలు పడే కష్టాల గురించి వీడియోలు చేస్తుంటాడు. ఈ క్రమంలో అనుకోకుండా సినిమాన తలపించే ఒక కథ అతని వీడియోలో రికార్డ్ అయింది.


వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ భారత దేశంలోని ఒక రాష్ట్రానికి చెందిన ఓ 16 ఏళ్ల అమ్మాయి రాక్సీ (పేరు మార్చబడినది) 2009లో తన కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండేది. ఆమెకు చిన్నప్పటి నుంచి తన చిన్నాన్న (తండ్రి తమ్ముడు) అంతే ఎంతో ఇష్టం. దీంతో ఎక్కువగా అతని ఇంటికి వెళ్లేది. అయితే ఆమె కటుంబంలో తండ్రికి అనారోగ్యంగా ఉండడంతో ఆమె చిన్నచితకా పనులు చేసేది. ఈ క్రమంలో ఆమె చిన్నాన్న నగరంలో మంచి ఉద్యోగం లభిస్తుందని చెప్పాడు. అతని మాటలు నమ్మిన రాక్సీ ఇంట్లో ఆర్థిక కష్టాలు తీర్చేందుకు 16 ఏళ్ల వయసులోనే చిన్నాన్నతో కలిసి సిటీకి వెళ్లింది. అయితే అక్కడ ఆమెకు మోసం జరిగింది. సొంతం చిన్నాన్ననే ఆమెను మోసం చేశాడు. వ్యభిచార గృహానికి తీసుకెళ్లి ఆమెను భారీ మొత్తానికి విక్రయించేశాడు. ఇంటికి తిరిగి వచ్చి ఆమె నగరంలో తప్పిపోయిందని చెప్పాడు.

అప్పటి నుంచి వ్యభిచార కూపంలోకి రాక్సీ జీవితం చిక్కుకుపోయింది. అక్కడి నుంచి తప్పించుకోవాలని ఆమె ఎంతో ప్రయత్నించింది. కానీ అలా జరగలేదు. తన తల్లిదండ్రులను, చెల్లి, తమ్ముడిని కలవాలని ఆమె ఎంతో ఏడ్చింది. కానీ దుర్మార్గుల చేతిలో ఖైదీగా మిగిలిపోయింది. అలా 15 ఏళ్ల పాటు ఆమె వ్యభిచారం చేస్తూ ఒక బానిస జీవితం గడిపింది. కానీ ఎంతకాలం గడిచినా ఆమె తన కుటుంబంతో కలిసి జీవించాలని బలంగా కోరుకుంది. అనుకోకుండా ఒక రోజు ఆమె కోరిక నెరవేరింది.


అదృష్టవశాత్తు ఆ వ్యభిచార గృహం నుంచి తప్పించుకొని పారిపోయింది. తన ఇంటికి చేరుకోవాలని ఆమె బయలుదేరింది. అయితే దారిలో ఆమెకు ఒక యువకుడు కలిశాడు. అతనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, కంటెంట్ క్రియేటర్ అనీశ్ భగత్. ఇతను తన ఛానెల్ కోసం సమాజంలో అనాథులు, నిరుపేదల గురించి వీడియోలు తీసి వారి కథలను తన ఛానెల్ ద్వారా అందరికీ తెలియజేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ప్రయాణంలో ఉన్న అతనికి అనుకోకుండా రాక్సీ పరిచయం అయింది.

Also Read: విహార యాత్రకు వెళ్లిన ఫ్యామిలీకి ప్రమాదం.. ఆంబులెన్స్‌కు రూ.70 లక్షలు ఖర్చు.. ఎలా జరిగిందంటే?.

రాక్సీతో పరిచయం చేసుకొని ఆమె గురించి, ఆమె కథ గురించి తెలుసుకున్నాడు. ఆమె కథ విని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అందుకే ఆమెను తన కుటుంబంతో కలుపుతానని మాటిచ్చాడు. ఫలితంగా ఆమెను సురక్షితంగా ఆమె స్వగ్రామానికి తీసుకెళ్లాడు. అక్కడికి చేరుకోగానే ఆమె సంతోషానికి హద్దులు లేవు. అదే తన గ్రామమని ఇకపై తన గతం గురించి మరిచిపోయి పరువుగా జీవిస్తానని అనీష్ తో చెప్పింది. అలా వెళుతూ ఆమె తన ఇంటికి చేరుకుంది. అయితే అనీష్ మాత్రం ఆమె ఇంట్లోకి వెళ్లలేదు. తాను బయటే ఉంటానని ఆమెను లోపలికి వెళ్లమని చెప్పాడు. రాక్సీ ఎంతో సంతోషంతో ఆ ఇంట్లో అడుగుపెట్టింది. అక్కడ అమ్మ, నాన్నతో కలిసి కంటతడి పెట్టింది. వారు ఆమెను గుర్తించలేకపోయారు.

అప్పుడు తాను 15 ఏళ్ల క్రితం తప్పిపోయిన రాక్సీ అంటూ చెప్పుకొచ్చింది. ముందుగా ఆమె కుటుంబ సభ్యులు ఆమెను చేరదీసి.. జరిగినదంతా తెలుసుకున్నారు. ఆ తరువాత రాక్సీ తల్లిదండ్రుల ముఖకవళికలు మారిపోయాయి. వ్యభిచారం చేసే ఒక యువతిని తమ కూతురిగా తాము అంగీకరించలేము అని తేల్చి చెప్పారు. ఆమెను ఇంటి నుంచి బయటికి వెళ్లమని గెంటేశారు. బయట ఉన్న అనీష్ ఇదంతా విని చాలా బాధపడ్డాడు. రాక్సీ బయటికి రాగానే ఆమెతో గ్రామం నుంచి బయటికి వచ్చేశాడు. కానీ రాక్సీ మాత్రం ధైర్యం కోల్పోలేదు.

తనని అందరూ హీనంగా చూడడం అలవాటుగా మారిందని.. చెప్పి కంటతడి పెట్టుకుంది. అయితే ఇప్పుడు ఆమె ఏం చేయబోతోంది? ఎక్కడికి వెళుతుంది? అని అనీష్ ప్రశ్నించాడు. అందుకు ఆమె అదే గ్రామంలో ఉంటూ తన కుటుంబంతో కలిసి ఉండేందుకు తిరిగి ప్రయత్నిస్తానని చెప్పింది. అంతటితో అనీష్ ఆమె ధైర్యానికి మెచ్చుకొని ఆమెకు వీడ్కోలు చెప్పి తన ప్రయాణంలో ముందుకు కొనసాగాడు.

Related News

Street Food: నూనె ప్యాకెట్ కట్ చేయకుండా నేరుగా.. ఇక్కడ బజ్జీలు తింటే పాడెక్కడం ఖాయం!

Karachi Airport: ఓరి ‘పాకి’స్టోడా.. వాడేసిన కండోమ్ బాక్సులతో ప్లేట్లా?

Viral Video: ఫాస్ట్‌‌ఫుడ్ సెంటర్ ముందు ఫైటింగ్.. చెల్లి-ఆమె ప్రియుడిపై సోదరుడు దాడి, వైరల్ వీడియో

Viral Video: మెట్రో లైన్‌లో జారిపడ్డ ఇనుప రాడ్డు.. నేరుగా ఆటో ప్రయాణికుడి శరీరంలోకి..

Cinnamon Throwing Tradition: 25 ఏళ్లు దాటినా పెళ్లి కాలేదా? ఆ దేశంలో చెట్టుకు కట్టేసి.. ఆ పొడి చల్లేస్తారు, ఎందుకంటే?

Bacha Bazi Tradition: బచ్చా బాజీ.. పాక్‌ లొ పాపిష్టి ఆచారం.. అబ్బాయిలకు అమ్మాయిల వేషం వేసి అలా చేస్తారట!

Big Stories

×