Sri Reddy : శ్రీరెడ్డి నోరు ఎలాంటిదో తెలుసుగా. ఆమె ఎలాంటి మాటలు మాట్లాడుతుందో గుర్తుందిగా. బూతు పుస్తకాలు కూడా పనికిరావు ఆమె మాటల ముందు. ఆ టైప్ వీడియోలు కూడా తీసికట్టే ఆమె చేష్టల ముందు. అన్నీ డబుల్ మీనింగ్ డైలాగులే. ప్రతీ మాటకూ బీప్ సౌండే. తిట్లలో రీసెర్చ్ చేసినట్టు తిడుతుంది. బూతులకు బ్రాండ్ అంబాసిడర్‌గా నిలుస్తుంది. సెటైర్లు, గిల్లుడు, పంచ్‌లు, ఫసక్‌లు.. అబ్బో ఆమె అదో టైపు.
సెన్సార్ లేని శ్రీరెడ్డి..
వైసీపీ హయాంలో శ్రీరెడ్డి నోటికి, వీడియోలకు సెన్సార్ లేకుండా పోయేది. టీడీపీ, జనసేన, పవన్ కల్యాణ్, లోకేశ్, రఘురామాలతో ఆటాడుకునేది. అన్నీ A సర్టిఫికెట్ మాటలే. జన సైనికులు, తెలుగు తమ్ముళ్లు సైతం గట్టిగా ఇచ్చిపడేసే వాళ్లు. శ్రీరెడ్డి సైతం అంతే రెచ్చిపోయేది. కాసుల కోసమో.. శాడిజమో.. ఇంక దేనికోసమో తెలీదు కానీ.. శ్రీరెడ్డి అప్పట్లో టాక్ ఆఫ్ ది సోషల్ మీడియా.
మహానటిని మించి..
కట్ చేస్తే.. కూటమి ప్రభుత్వం వచ్చింది. రెడ్ బుక్ ఓపెన్ చేశారు. ఇక ఖేల్ ఖతం. దుకాణం బంద్. శ్రీరెడ్డి పత్తా లేకుండా పోయింది. లోకేశ్ అన్నయ్యా.. అనడం మొదలుపెట్టింది. సారీ.. తప్పైంది.. క్షమించండి.. వదిలేయండి.. వెళ్లిపోతా.. అంటూ కాళ్లబేరానికి వచ్చింది. నుదిట నామాలు పెట్టింది. మెడలో జప మాల వేసింది. టోటల్‌లా లుక్కు, గెటప్పు మార్చేసింది. మహానటిలా మారిపోయింది. వీడియోలు గట్రా బంద్. ట్వీట్లు, పోస్టులు ఫసక్. తను మారిపోయినట్టు కవరింగ్ ఇస్తోంది. ఐదేళ్లు అరాచకం చేసి.. ఇప్పుడు లెంపలేసుకుంటే వదిలేస్తారా? అందుకే, ఇటీవల విజయనగరం జిల్లా పూసపాటిరేగ పోలీసులు శ్రీరెడ్డిని విచారణకు పిలిచి.. 41ఏ కింద నోటీసులు ఇచ్చి పంపించేశారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు స్టేషన్‌కు రావాలంటూ హుకూం జారీ చేశారు.
శ్రీరెడ్డికి జైలు టెన్షన్
దెబ్బకు బెదిరిపోయినట్టుంది శ్రీరెడ్డి. ఇంత నటించినా తనను ఎవరూ నమ్మట్లేదని తెలుసుకున్నట్టుంది. రెడ్ బుక్ తనను వెంటాడుతుందని గుర్తించినట్టుంది. చేసిన పాపం వదిలిపెట్టదని గ్రహించినట్టుంది. బోరుగడ్డ, పోసాని, వల్లభనేనిల తరహాలోనే తనను కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారని దిగులుపడుతున్నట్టుంది. అసలే తను సుకుమారి. లగ్జరీ ఫ్లాట్స్‌లో ఉండటం అలవాటు. జైల్లో కరుడుగట్టిన ఖైదీల మధ్య ఉండగలదా? జైలు తిండి తినగలదా? కటికనేలపై పడుకోగలదా? ఆ ఊహే ఆమెకు నిద్రలేకుండా చేస్తున్నట్టుంది. టీడీపీ, జనసేన నాయకులను నోటికొచ్చినట్టు తిట్టిన కేసులో.. ఎవరూ కాపాడలేరనే విషయం అర్థమై.. తనకిక దేవుడే దిక్కు అనుకుంటోంది. కృష్ణా, రామా అంటూ దేవుళ్లను తలుచుకుంటూ లేటెస్ట్‌గా ఓ ట్వీట్ చేసింది శ్రీరెడ్డి.
దేవుడే దిక్కా..?
తనకు ఇంతకన్నా కష్టం ఉండదేమో అని బాధపడుతోంది. పాత పుండు మానకముందే.. అంతకంటే పెద్ద కష్టాన్ని ఇస్తున్నావు గోవిందుడా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. శ్రీరెడ్డి ట్వీట్ సోషల్ మీడియోలో తెగ వైరల్ అవుతోంది. కామెంట్ బాక్సుల్లో స్ట్రాంగ్ కౌంటర్లే పడుతున్నాయి.
కృష్ణాయ వాసుదేవాయ ! జీవితం లో అసలు ఇంతకన్నా కష్టం ఉండదేమో అని తలచి అనుభవిస్తూవున్న ప్రతిసారి,పాత పుండు మానకముందే , అంత కన్నా పెద్ద కష్టాన్ని నాకు వడ్డిస్తున్న గోవిందుడా, ఈ కష్టాలలో పడి ఎక్కడ నీ నామ సంకీర్తన ఎక్కడ మర్చిపోతానేమో అని భయంగా వుంది నా చిన్ని కృష్ణా!అందరు…
— Sri Reddy (@SriReddyTalks) April 24, 2025