SKY on Abhishek sharma : ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా నిన్న రాత్రి సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో తొలుత సన్ రైజర్స్ జట్టు బ్యాటింగ్ చేసింది. బ్యాటింగ్ లో పేలవ ప్రదర్శన చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు. కేవలం 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అయితే క్లాసెన్, అభినవ్ మనోహర్ కీలక ఇన్నింగ్స్ ఆడటంతో 143 పరుగులు చేయగలిగింది SRH. ఈ నేపథ్యంలోనే మరో ఆసక్తికర ఘటన చోటు చేసుకోవడం విశేషం. ప్రాక్టీస్ సమయంలో ముంబై ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ సన్ రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ జేబులను మరోసారి తనిఖీ చేసి అందరినీ ఆశ్యర్యపరిచాడు.
Also Read : IPL 2025 : SRH కు బిగ్ షాక్.. ఐపీఎల్ 2025 టోర్నమెంట్ నుంచి ఔట్?
ఇటీవలే ముంబై లో మ్యాచ్ జరిగిన సమయంలో సూర్యకుమార్ అభిషేక్ శర్మ జేబు చెక్ చేసిన విషయం విధితమే. తాజాగా మరోసారి అభిషేక్ జేబులు చెక్ చేయడం గమనార్హం. అభిషేక్ శర్మ జేబులో ఎలాంటి పేపర్ ముక్క లేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగిన సమయంలో అభిషేక్ శర్మ 55 బంతుల్లో 141 పరుగులు చేశాడు. అయితే ఆ సమయంలో సెంచరీ చేయగానే తన జేబులో ఉన్నటువంటి ఓ పేపర్ ముక్కను తీసి అభిమానులకు చూపించాడు. సెంచరీ తరువాత హైదరాబాద్ ఫ్యాన్స్ కి అంకితం అంటూ పేపర్ పై రాసుకొచ్చాడు. ఇప్పటికీ అభిషేక్ శర్మ చూపించిన పేపర్ సోషల్ మీడియాలో వైరల్ కావడం విశేషం. నిన్న జరిగిన మ్యాచ్ లో కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు అభిషేక్ శర్మ.
ఇక ఈ మ్యాచ్ ని పరిశీలించినట్టయితే.. సన్ రైజర్స్ ఆటగాళ్లు ట్రావిస్ హెడ్ 0, అభిషేక్ శర్మ 8, ఇషాన్ కిషన్ 2, నితీశ్ రెడ్డి 3, క్లాసెన్ 71, అభినవ్ మనోహర్ 43 పరుగులు చేశారు. టాప్ ఆర్డర్ బ్యాటర్లు అంతా కుప్పకూలగా.. క్లాసెన్, అభినవ్ కీలక ఇన్నింగ్స్ ఆడారు. దీంతో హైదరాబాద్ జట్టు 143 పరుగులు చేయగలిగింది. ఆ తరువాత 144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు 15.4 ఓవర్లలోనే ఛేజింగ్ చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ 70 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వరుసగా రెండు మ్యాచ్ ల్లో కూడా రోహిత్ అద్భుతమైన బ్యాటింగ్ చేయడం విశేషం. ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పటి వరకు 8 మ్యాచ్ లు ఆడగా.. వాటిలో కేవలం రెండింటిలో మాత్రమే విజయం సాధించింది. ఆరు మ్యాచ్ లలో ఓడిపోయింది. పాయింట్ల పట్టిక లో 9 వ స్థానం లో కొనసాగుతోంది. గత సీజన్ లో ఆర్సీబీ జట్టును ఇన్ స్పిరేషన్ గా తీసుకొని ఈ మ్యాచ్ లో ముందుకు పోవాలని హెడ్ కోచ్ వెటోరీ తెలిపారు.
Surya bhai searching for slips in Abhishek’s pockets #srh #mumbai #mumbaiindians #sunrisers #surya #suryabhai #srh #SunrisersHyderabad #abhisheksharma #SRHvsMI pic.twitter.com/7nikPcYc0p
— Srikanth avasarala (@SrikanthAvasar2) April 23, 2025