Rahul Sankrityan : ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ ప్రొడక్షన్ హౌసెస్ లో మైత్రి మూవీ మేకర్స్ ఒకటి. శ్రీమంతుడు సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సినిమాలు నిర్మించడం మొదలుపెట్టిన ఈ సంస్థ నేడు అద్భుతమైన హిట్ సినిమాలను నిర్మిస్తూ విజయవంతంగా కొనసాగుతుంది. కేవలం సినిమాలను నిర్మించడమే కాకుండా డిస్ట్రిబ్యూషన్ కూడా మొదలు పెట్టింది ఈ సంస్థ. ప్రస్తుతం ఈ సంస్థలో అద్భుతమైన ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. ఇటీవలే ఈ బ్యానర్ నుంచి వచ్చిన పుష్ప సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి పేరును సంపాదించడం మాత్రమే కాకుండా అద్భుతమైన కలెక్షన్స్ కూడా తీసుకొని వచ్చింది.
మైత్రి లో తెరకెక్కుతున్న సినిమాలు
మైత్రి మూవీ మేకర్స్ లో తెరకెక్కుతున్న సినిమాలలో అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఈ కాంబినేషన్ అంటేనే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కి కొద్దిరోజులు మాత్రమే టైం ఇచ్చిన కూడా అందరూ ఆశ్చర్యపడిన ఔట్పుట్ లాగాడు. ఈ సినిమాకి సంబంధించి రెండు వీడియోలు కూడా రిలీజ్ చేశాడు ఈ రెండు వీడియోలు సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ ని వేరే రేంజ్ లో పెంచేసాయని చెప్పొచ్చు. అయితే ఈ ప్రాజెక్టు తో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ చేయబోయే సినిమా కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.
విజయ్ దేవరకొండ షూటింగ్ మొదలయ్యేది అప్పుడే
మైత్రి మూవీ మేకర్స్ ఇదివరకే విజయ్ దేవరకొండ తో డియర్ కామ్రేడ్ అనే సినిమాను నిర్మించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని సాధించలేదు. కానీ ఈ సినిమాకి ఇప్పటికీ ఒక సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారని చెప్పొచ్చు. ఈ సినిమాను అంత బాగా డీల్ చేసాడు భరత్ కమ్మ. అయితే ఇదే బ్యానర్ లో విజయ్ తో మరో సినిమాను అనౌన్స్ చేశారు. ఈ సినిమాకి టాక్సీవాలా డైరెక్టర్ రాహుల్ దర్శకత్వం వహిస్తున్నాడు. విజయ్ కెరియర్ లో వస్తున్న 14వ సినిమా ఇది. ఈ సినిమాపై కూడా అందరికీ మంచి అంచనాలు ఏర్పడ్డాయి.ఈ సినిమాలో విజయ్ రాయలసీమ యాసను మాట్లాడుతున్నాడు అంటూ కథనాలు వినిపించాయి. అయితే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ మే ఎండ్ మొదలుకానున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ అప్పుడు కాకపోతే జూన్ మొదటి వారంలో మొదలయ్యే అవకాశం ఉంది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్డమ్ అనే సినిమాను చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ప్రొడ్యూసర్ నాగ వంశీ కూడా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది అంటూ పలు ఇంటర్వ్యూస్ లో తెలిపాడు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : Tollywood Movies : ఓకే రోజు డజన్ సినిమాలు విడుదల