Pini Village Tradition: ప్రపంచం ఎంత టెక్నాలజీ వైపు దూసుకుపోతున్నా.. భారతదేశంలోని కొన్ని మారుమూల గ్రామాల్లో ఇప్పటికీ కొన్ని వింతైన, ఆశ్చర్యకరమైన ఆచారాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న విషయం.. వినడానికి కాస్త విడ్డూరంగా అనిపించినా, నేటికీ అక్కడ ఓ వింతైన ఆచారాన్ని పాటిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కులు జిల్లాలో ఉన్న ‘పిని’ అనే గ్రామంలో వందల ఏళ్లుగా ఒక వింత సంప్రదాయం అమలవుతోంది.
ప్రతిఏటా శ్రావణ మాసంలో వరుసగా 5 రోజుల పాటు ఈ గ్రామ మహిళలు ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా(నగ్నంగా) ఉంటారు. ఈ ఐదు రోజులు వారు అత్యంత కఠినమైన నియమాలను పాటిస్తారు. అయితే, బట్టలు లేకుండా ఉండే ఆ ఐదు రోజులు స్త్రీలు బయటి ప్రపంచానికి కనిపించరు. పూర్తిగా తమ ఇళ్లకే పరిమితం అవుతారు.
Also Read: రోజూ నిద్రలేవగానే తల గిర్రుమంటోందా.. వర్టిగో గురించి తెలుసుకోవాల్సిన సమయమిదే!
ఏడాదికోసారి పిని గ్రామ స్త్రీలు పాటించే ఈ కఠినమైన దీక్షలో వారు నవ్వకూడదు, గట్టిగా మాట్లాడకూడదు. ఇంట్లో కనీసం సంగీతం కూడా వినకూడదు.
అలాగే ఈ ఐదు రోజులు పురుషులు కూడా కొన్ని నియమాలు పాటించాలి. వారు మద్యం సేవించకూడదు, మాంసం తినకూడదు. ఈ దీక్ష సమయంలో పిని గ్రామంలో ఎలాంటి శుభకార్యాలు కూడా జరగవు.
పిని ఊరి ప్రజల కథనం ప్రకారం.. పూర్వం ఆ గ్రామంలో రాక్షసుల ఆగడాలు ఎక్కువగా ఉండేవట. అప్పుడు ‘లాహువా ఘోండ్’ అనే దేవుడు ఆ రాక్షసులను సంహరించి గ్రామాన్ని కాపాడారు. రాక్షసులను చంపే సమయంలో ఆ దేవుడు గ్రామ స్త్రీలకు ఓ వింతైన పరీక్ష పెట్టారని, ఒకవేళ మహిళలు ఆ 5 రోజులు దుస్తులు ధరిస్తే వారికి లేదా వారి కుటుంబాలకు కీడు జరుగుతుందని గ్రామస్థులు నమ్ముతారు. ఒకవేళ బట్టలు ధరించాల్సి వస్తే.. కేవలం ఒక పల్చటి ఉన్ని వస్త్రాన్ని మాత్రమే వాడుతుంటారు.
కాలం మారుతున్న కొద్దీ సంప్రదాయాల్లో కూడా స్వల్ప మార్పులు వస్తుంటాయి. ప్రస్తుత తరానికి చెందిన కొందరు స్త్రీలు పూర్తిగా నగ్నంగా ఉండటానికి బదులు, బాగా పల్చగా ఉన్న వస్త్రాన్ని ధరిస్తున్నారు. అయితే, ఆ 5 రోజులు మాత్రం బయటి వ్యక్తులు ఎవరూ గ్రామంలోకి రాకుండా.. ఊరిలో వాళ్లు బయటకు వెళ్లకుండా అత్యంత నిష్ఠగా ఈ వేడుకను జరుపుకుంటారు.
పిని గ్రామ ప్రజల నమ్మకం ప్రకారం.. ఈ సంప్రదాయాన్ని పాటించకపోతే గ్రామానికి కీడు జరుగుతుందని, దేవతలకు కోపం వస్తే.. అనారోగ్యం లేదా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయని గ్రామస్థులు బలంగా నమ్ముతారు. అయితే, ఈ ఆచారాన్ని ఓ వింతగా చూడకుండా.. వారు తమ గ్రామ దేవతపై చూపే అపారమైన నమ్మకంగా భావించాలి. అందుకే ఇప్పటికీ ఈ గ్రామం బయటి ప్రపంచానికి ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఎన్నో వందల ఏళ్లకు ముందు ప్రారంభించిన సంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగించడం అనేది నిజంగా ఆ గ్రామ ప్రజల గొప్పతనంగానే చెప్పాలి.
Also Read: క్రాక్స్ ఎందుకంత ఫేమస్?.. దీని వెనుకున్న ముగ్గురి స్నేహితుల కథేంటి?