BigTV English

Viral Video: ఇంత పెద్ద వంకాయను ఎప్పుడైనా చూశారా.. గిన్నిస్ రికార్డులోకి ఎక్కేసింది తెలుసా

Viral Video: ఇంత పెద్ద వంకాయను ఎప్పుడైనా చూశారా.. గిన్నిస్ రికార్డులోకి ఎక్కేసింది తెలుసా

Viral Video: కూరగాయల్లో వంకాయను రారాజు అని పిలుస్తారు. ఇది పరిమాణంలో చిన్నదిగా ఉన్నా కూడా రుచిలో అద్భుతంగా ఉంటుంది. వంకాయలో చాలా రకాలు ఉంటాయి. పొడవాటి వంకాయ, చిన్న వంకాయ. నల్ల వంకాయ, తెల్ల వంకాయ ఇలా రకరకాలుగా ఉంటాయి. అయితే వంకాయను ఎక్కువగా గుత్తి వంకాయ కూర చేసుకుని తినేందుకు ఇష్టపడుతుంటారు. సాధారణంగా వంకాయ అంటే చిన్న పరిమాణంలో మాత్రమే చూసి ఉంటారు. మహా అయితే 200 నుంచి 300 గ్రాముల బరువుతో కొంచెం పెద్దగా ఉండే వంకాయలు ఇక పెద్దవి అని అనుకుంటారు. కానీ ఓ వంకాయ ఏకంగా 3 కిలోల బరువు కలిగి ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వంకాయగా పేరు సాధించి గిన్నిస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పేరు సాధించింది.


గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో తరచూ ఏదో ఒక ఆసక్తికర వస్తువు లేదా, సాహసాలు చేసే మనుషులు దర్శనమిస్తుంటారు. ప్రపంచంలో జనాభాతో పాటు ప్రపంచ రికార్డులు సాధించే వారి సంఖ్య కూడా అంతకు అంత పెరుగుతూనే ఉంది. కేవలం మనుషులే కాదు ప్రస్తుతం ఉన్న కాలంలో ప్రకృతిలో లభించేవి కూడా ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అయితే తాజాగా గిన్నిస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఆశ్చర్యపోయే ఘటన వెలుగుచూసింది. కూరగాయల్లో రారాజైన వంకాయ ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. ఈ మేరకు గిన్నిస్ వరల్డ్ రికార్డు ఓ పోస్ట్ చేసింది.

డేవ్ బెన్నెట్ అనే ఓ వ్యక్తి తాను పండించిన ఓ వంకాయ గురించి ప్రపంచానికి తెలియజేశాడు. ఏకంగా 3.77 కిలో గ్రాముల బరువున్న ఓ వంకాయను పండించాడు. దీనికి సంబంధించిన విషయాన్ని ఇన్ స్టాగ్రాంలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. అగ్రరాజ్యం అమెరికాలో నివసించే డేవ్ ఏప్రిల్ నెలలో వంకాయను పండించాడు. ఈ క్రమంలో తాను నాటిని ఓ మొక్కకు 3 కిలోల బరువు గల వంకాయ కాయడంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. ఈ వంకాయ బ్లూమ్ ఫీల్డ్ లో పండింది. దీనిని జూలై 31వ తేదీన పంట వేయగా ఏప్రిల్ లో పెద్ద వంకాయ కాసింది. దీని బరువు 3.778 kg (8 lb 5.3 oz) ఉందని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఓ వీడియో షేర్ చేసింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ అసలు ఇంత పెద్ద వంకాయను ఎలా పండించారు అని ఆశ్చర్యపోతున్నారు.


 

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by Guinness World Records (@guinnessworldrecords)

Related News

Kerala: చోరీకి గురైన బంగారం దొరికింది.. కానీ, 22 ఏళ్ల తర్వాత, అదెలా? కేరళలో అరుదైన ఘటన!

Treatment to Snake: పాముకు వైద్యం చేసిన డాక్టర్, ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు!

Shocking News: షాకింగ్.. కుక్క గోరు గుచ్చుకుని యువకుడు మృతి!

Viral Video: స్కూల్ బస్సు ఆగకుండా వెళ్లిపోయిందని చిన్నారి ఏడుపు.. అది తెలిసి డ్రైవర్ ఏం చేశాడంటే?

Viral Video: పాముతో బెదిరించి డబ్బులు డిమాండ్.. రైల్లో బిచ్చగాడి అరాచకం, రైల్వే స్పందన ఇదే!

Dowry harassment: రూ.5 లక్షలు తీసుకురావాలని కోడలిని రూంలో బంధించి.. పామును వదిలి.. చివరకు స్నేక్..?

Cat Vs Snake: పిల్లికి చెలగాటం.. పాముకు ప్రాణ సంకటం.. గెలిచింది ఎవరు?

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Big Stories

×