Air India Express: విమాన ప్రయాణయంలో కామన్ గా ప్రయాణీకులకు మద్యం అందిస్తారు. తాగాలని ఇష్టం ఉన్న వాళ్లు రెండు మూడు పెగ్గులు తీసుకుంటారు. ఒకరిద్దరు కాస్త ఎక్కువగా తాగినా విమాన సిబ్బంది ఏం అనరు. కానీ, తాజాగా ఓ విమాన ప్రయాణీకుల కరువు చూసి సిబ్బంది అవాక్కయ్యారు. కేవలం 4 గంటల వ్యవధిలో విమానంలోని మద్యం అంతా ఖాళీ చేసేశారు. సూరత్ నుంచి బ్యాంకాక్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానంలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సూరత్-బ్యాంకాక్ తొలి సర్వీస్ ప్రారంభం
తాజాగా ఎయిర్ ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ గుజరాత్ లోని సూరత్ నుంచి థాయ్ లాండ్ లోని బ్యాంకాక్ కు తొలి విమానాన్ని ప్రారంభించింది. ఈ విమానం ప్రకటించిన కొద్ది సేపట్లోనే టికెట్లు అన్నీ బుక్ అయ్యాయి. శుక్రవారం (డిసెంబర్ 21) నాడు ఈ విమానం సూరత్ నుంచి బ్యాంకాక్ వెళ్లింది. ఇందులో స్పెషాలిటీ ఏం ఉంది అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం. ఈ విమానంలో ప్రయాణించిన వాళ్లు మద్యం కోసం కరువుల్లో ఉన్నట్లు వ్యవహరించారు. ఫ్లైట్ లోని సుమారు 15 లీటర్ల కాస్ట్లీ మద్యాన్ని ఖాళీ చేశారు. అదీ కేవలం 4 గంటల వ్యవధిలో. ఈ మద్యం విలువ సుమారు 1.8 లక్షలు ఉంటుందని విమానయాన వర్గాలు వెల్లడించాయి. ఇప్పటి వరకు ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ చరిత్రలో ప్రయాణీకులు ఎప్పుడూ ఈ స్థాయిలో మద్యం తాగలేదని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అంతేకాదు, బ్యాంకాక్ చేరుకోక ముందే విమానంలో మద్యం అయిపోయిందని సిబ్బంది అనౌన్స్ చేయడం విశేషం.
દારૂ અને ખમણનું કોમ્બિનેશન,વાઇરલ થયા સુરતીઓ! ,એર ઈન્ડિયા સુરતથી બેંગકોકની પહેલી ફ્લાઇટના પહેલા જ દિવસે 98% પેસેન્જર્સ મળ્યા, પેસેન્જરોએ વિસ્કી અને બીયરનો સ્ટોકજ પતાવી દીધો, 300 પેસેન્જરે 4 કલાકની મુસાફરીમાં 1.80 લાખથી વધારેનો 15 લિટર દારૂ પીધો#SURAT #bangkok #AirIndia #gujju pic.twitter.com/bhQH66vjGH
— Kunj Patel (@patelkunj4444) December 21, 2024
ఫుడ్ కూడా ఖతం!
ఇక ఈ విమాన ప్రయాణంలో ప్యాసెంజర్ల కోసం విమానయాన సంస్థ ప్రముఖ గుజరాతీ వంటకాలను ఏర్పాటు చేసింది. థెప్లా, ఖమన్ తో పాటు పిజ్జా సహా ఇతర ఫుడ్ అందుబాటులో ఉంచింది. విచిత్రం ఏంటంటే. మద్యంతో పాటు ఫుడ్ కూడా ముక్కలేకుండా నాకేశారు. కేవలం 4 గంటల్లో విమానాన్ని బార్ అండ్ రెస్టారెంట్ గా మార్చేశారు సూరత్ ప్రయాణీకులు. ఇక ఈ ఘటనకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై సోషల్ మీడియాలో ఫుడ్ ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. కరువుకు బ్రాండ్ అంబాసిడర్లు అంటూ ట్రోల్ చేస్తున్నారు.
గుజరాత్ లో మద్యపాన నిషేధం
ఇక ఈ విమానంలో ప్రయాణీకులు పెద్ద మొత్తంలో మద్యం తాగడం పట్ల సోషల్ మీడియాలో కొత్త చర్చకు తెరలేచింది. “ఈ ఘటన గుజరాత్ వాసులలో మద్యం పట్ల ఉన్న ఆసక్తిని తెలియజేస్తుంది. ఇప్పటికైనా, ఆ రాష్ట్ర ప్రభుత్వం మద్యపాన నిషేధం మీద పునరాలోచించుకోవడం మంచిది. ప్రభుత్వ నియంత్రణలో మద్యం అమ్మి ఆదాయం పొందే అవకాశం ఉంది” అంటున్నారు నెటిజన్లు. వాస్తవానికి గుజరాత్ తో మద్యపాన నిషేధం ఉన్నా, అక్రమంగా మద్యం వ్యాపారం జోరుగా సాగుతుందనే విమర్శలు ఉన్నాయి. వీటన్నింటి కంటే ప్రభుత్వం నేరుగా మద్యం అమ్మడం మంచిదని పలువురు సూచిస్తున్నారు.
Read Also: తోటి ఉద్యోగులకు చనుబాలు ఇస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్, ఛీ.. ఇలా తయారేంట్రా!