OTT Movie : ఇప్పుడు హర్రర్ మిస్టరీ మూవీస్ ట్రెండ్ నడుస్తోంది. ఈ సినిమాలు థియేటర్లలో ప్రేక్షకులను భయపెట్టి, ఓటిటి ప్లాట్ ఫామ్ లో కూడా గూస్బమ్స్ తెప్పిస్తున్నాయి. హర్రర్ కాన్సెప్ట్ తో వచ్చే సినిమాలన్నీ చాలా వరకు సక్సెస్ అందుకుంటున్నాయి. ఓటిటి ప్లాట్ ఫామ్ లో టెన్షన్ పెట్టించే ఒక హారర్ మిస్టరీ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? వివరాల్లోకి వెళితే…
నెట్ఫ్లిక్స్ (Netflix)
ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ పేరు ‘ది హిడెన్ ఫేస్‘ (The hidden face). హీరోకి తన ప్రియురాలు బ్రేకప్ చెప్పడంతో, మరొక అమ్మాయి తో రిలేషన్ లో ఉంటాడు. చివరికి ఆమె బ్రేకప్ ఎందుకు చెప్పిందో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకివెళితే
ఆండ్రియన్ కు తన గర్ల్ ఫ్రెండ్ క్లారా బ్రేకప్ చెప్పి ఒక వీడియోని పోస్ట్ చేస్తుంది. ఆండ్రియన్ ఈ బాధలో ఒక బార్ కు వచ్చి మందు తాగుతూ ఉంటాడు. ఆ బార్ లో ఫ్యాబిన అనే అమ్మాయి పనిచేస్తూ ఉంటుంది. మద్యం ఎక్కువైతే ఇతన్ని ఆమె ఇంటికి తీసుకు వెళుతుంది. వీళ్ళిద్దరూ ఆ రాత్రి బాగా ఎంజాయ్ చేస్తారు. అలా వీళ్లు బాగా దగ్గర అయిపోతారు. ఆండ్రియన్ ఇంటికి ఫ్యాబిన వచ్చేస్తుంది. అలా వీళ్ళ లైఫ్ కొనసాగుతూ ఉంటుంది. అయితే వీళ్ళు ఉంటున్న ఇంటిలో కొన్ని శబ్దాలు వస్తూ ఉంటాయి. వాటిని ఫ్యాబిన గమనిస్తూ ఈ ఇంట్లో ఎవరో ఉన్నారని అనుకుంటుంది. ఆండ్రియన్ మాజీ ప్రియురాలు క్లారా ఇతనికి నిజంగానే బ్రేకప్ చెప్పి ఉండదు. ఆంజియన్ ఇదివరకే ఒక అమ్మాయి తో క్లోజ్ గా ఉంటాడు. అది చూసి క్లారా బాగా బాధపడుతుంది. తను కొద్దిరోజులు కనపడకుండా ఉంటే ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటుంది క్లారా. ఈ క్రమంలోనే ఆ ఇంట్లో ఒక సీక్రెట్ గదిలో కీస్ మర్చిపోయి దాక్కుంటుంది.
ఇంటికి వచ్చిన ఆండ్రి యన్, క్లారా బ్రేకప్ చెప్పిందని బాధపడుతూ ఉంటాడు. తనని నిజంగా ప్రేమిస్తున్నాడని తెలుసుకొని ఆ గదిలో నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తుంది క్లారా. అయితే కీ మర్చిపోవడంతో క్లారా అక్కడే ఉండి పోవాల్సి వస్తుంది. ఆగది లో కొద్దిరోజుల వరకు బ్రతకగలిగే ఫెసిలిటీ ఉంటుంది. ఫ్యాబిన, ఆండ్రియన్ తో రొమాన్స్ చేసే సీన్స్ చూసి తట్టుకోలేక పోతుంది క్లారా. ఈ క్రమంలో ఫ్యాబిన ఆ గదిలో క్లారా ఉందని గ్రహిస్తుంది. ఆమెను బయటకు తెస్తే ఆండ్రియా న్ దూరమవుతాడని ఆమెను గదిలోనే ఉండేటట్టే చేస్తుంది. చివరికి తన తప్పు తెలుసుకుని ఆ గది తలుపు తీస్తుంది. చివరికి క్లారా ఆ గదిలో బతికే ఉంటుందా? ఆండ్రియన్ కి ఆ గదిలో క్లారా ఉందని తెలుస్తుందా? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని తప్పకుండా చూడండి.