E-Paper
Advertisement

OTT Movie : భర్తను చంపడానికి స్టూడెంట్ తో రొమాన్స్ చేసే టీచర్…

OTT Movie : భర్తను చంపడానికి స్టూడెంట్ తో రొమాన్స్ చేసే టీచర్…
Advertisement

OTT Movie : రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ అంటే చెవి కోసుకునే అభిమానులు చాలామంది ఉంటారు. ఈ సినిమాలలో అమ్మాయిలు తమ అందచందాలతో యువకులను రెచ్చగొడుతూ ఉంటారు. కొంతమంది మోసం చేయడానికి, మరి కొంతమంది ప్రేమించడానికి అటువంటి పనులు చేస్తారు. ఈమె పద్యంలో వచ్చిన ఒక మూవీ ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియో

Advertisement

ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ పేరు ‘ఎక్స్ ట్రా క్రెడిట్‘ (Xtra credit). ఈ మూవీలో టీచర్ స్టూడెంట్ ల మధ్య రొమాన్స్ హద్దులు దాటి పోతుంది. టీచర్ వేసిన వలలో స్టూడెంట్ ఎలా చిక్కుకున్నాడనే స్టోరీ చుట్టూ మూవీ నడుస్తుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.

స్టోరీ లోకి వెళితే

Advertisement

వెల్లర్ ఒక కాలేజీలో క్లాస్ చెప్తూ ఉంటుంది. అందులో పోల్ అనే స్టూడెంట్ టీచర్ కి అట్రాక్ట్ అవుతాడు. ఒకరోజు పోల్ తను రాసిన ఎగ్జామ్ ని కాపీ కొట్టడంతో వెల్లెర్ అతన్ని ఫైల్ చేస్తానని చెప్తుంది. టీచర్ అలా చెప్పడంతో ఆమెను బతిమాలుకుంటాడు పోల్. ఈ క్రమంలో ఒక ముసుగు వ్యక్తి టీచర్ని ఆటకాయిస్తాడు. ఆ వ్యక్తిని పోల్ ఎదుర్కోవడంతో, టీచర్ పోల్ పై ఇంప్రెస్ అవుతుంది. ఇలా వీరిద్దరూ స్కూల్లోనే ఎక్కడపడితే అక్కడ ఏకాంతంగా గడుపుతూ ఉంటారు. మరోవైపు పోల్ కి ఇదివరకే ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. ఆమెను కూడా పోల్ బాగా ఇష్టపడుతుంటాడు. టీచర్ మోజులో పడి తనని కాస్త దూరం పెడతాడు. ఒకరోజు టీచర్ కంటికి గాయంతో కనిపిస్తుంది. పోల్ అది చూసి టీచర్ని ఏమైందని అడుగుతాడు. అందుకు టీచర్ ఇదంతా తన భర్త వల్లే అని, తనని రోజు టార్చర్ చేస్తాడని చెప్తుంది. అతనితో ఉండకుండా బయటికి వచ్చేయమంటాడు పోల్. ఫైనాన్సియల్ గా ఇబ్బంది అవుతుందని అతనితో చెప్తుంది.

అతనితో ఇంకో విషయం కూడా చెప్తూ, తన ఇంట్లో ఉండే ఒక లాకర్లో చాలా డబ్బు ఉందని, దానిని నువ్వు తేగలిగితే ఇద్దరం కలిసి విదేశాలకు వెళ్ళిపోదామని చెప్తుంది. ఇదివరకే ఒక చిన్న దొంగతనం కేసులో ఇరుక్కున్న పోల్, టీచర్ కోసం ఈ దొంగతనం చేయాలనుకుంటాడు. రాత్రి ఇంటికి వెళ్లిన అతనికి ఆ ఇంట్లో ఆమె చెప్పిన ప్రదేశంలో లాకర్ కనిపించదు. కంగారుపడి అక్కడ నుంచి మళ్లీ బయటికి వచ్చేస్తాడు. మరుసటి రోజు టీవీ న్యూస్ లో టీచర్ భర్త చనిపోయినట్టు వార్త వస్తుంది. అప్పటికి పోల్ కి టీచర్ ప్లాన్ ప్రకారం ఇరికించిందని అర్థమవుతుంది. చివరికి పోల్ ఈ కేసు నుంచి బయటపడగలుగుతాడా? టీచర్ ఈ మర్డర్ చేసిందని పోల్ నిరూపిస్తాడా? తన ప్రియురాలతో హ్యాపీగా లైఫ్ని కొనసాగిస్తాడా? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ మీడియాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని చూడాల్సిందే.

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×