BigTV English

Kalki Shambala: కల్కిలో చూపించిన శంభాలా ఎక్కడుంది? విష్ణుమూర్తి పదో అవతారం అక్కడేనా?

Kalki Shambala: కల్కిలో చూపించిన శంభాలా ఎక్కడుంది? విష్ణుమూర్తి పదో అవతారం అక్కడేనా?

Kalki Shambala: తెలుగు సినిమా అభిమానులకు కల్కి 2898 ఏడీ ఒక అద్భుత అనుభవం! డైరెక్టర్ నాగ్ అశ్విన్ తీసిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ, హిందూ పురాణాలను మిక్స్ చేసి ప్రపంచవ్యాప్తంగా సందడి చేసింది. ఈ సినిమాలో అందరినీ ఆకట్టుకున్న ఒక అంశం..శంభాలా. సినిమాలో దీన్ని రహస్యమైన, పవిత్రమైన ప్రదేశంగా చూపించారు. ఇక్కడే విష్ణుమూర్తి పదో అవతారం అయిన కల్కి జన్మిస్తాడని, కలియుగంలో చెడును అంతం చేస్తాడని చెప్పారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ విషయం ఇప్పుడు ఫ్యాన్స్ మధ్య హాట్ టాపిక్‌గా మారింది. ఈ శంభాలా నిజంగా ఉందా? లేక సినిమా కోసం కల్పించిన కథనా? అనే డౌట్ చాలా మందికే వచ్చింది.


సినిమాలో శంభాలా ఏంటి?
కల్కి 2898 ఏడీలో శంభాలాని ఒక దాచిపెట్టిన లోకంగా చూపించారు. అద్భుతమైన విజువల్స్, గ్రిప్పింగ్ స్టోరీతో ఈ ప్లేస్ అందరి దృష్టినీ ఆకర్షించింది. సినిమా ప్రకారం, ఇక్కడే కల్కి పుట్టి అరాచకాన్ని సమాప్తం చేస్తాడు. ఈ ఐడియా హిందూ పురాణాల నుంచి తీసుకున్నారు. విష్ణు పురాణం, శ్రీమద్ భాగవతం వంటి గ్రంథాల్లో శంభాలాని కల్కి జన్మస్థలంగా చెప్పారు. అలాగే, తిబెత్ బౌద్ధమతంలోని కాలచక్ర తంత్రంలో కూడా శంభాలా ఒక దివ్య రాజ్యంగా పేర్కొనబడింది. అక్కడ ఒక గొప్ప యోధుడు చెడుని నాశనం చేస్తాడని చెప్పారు. ఈ గ్రంథాల్లో శంభాలా దైవిక శక్తులచే రక్షించబడిన, స్వర్గంలాంటి ప్రదేశంగా వర్ణించారు.

శంభాలా అంటే ఏమిటి?
‘శంభాలా’ అనే పేరు సంస్కృతం నుంచి వచ్చింది. శాంతి స్థలం” లేదా నిశ్శబ్ద స్థలం అని దీని అర్థం. పురాణాల ప్రకారం, ఇది హిమాలయాల్లో ఎక్కడో, బహుశా ఇండో-తిబెత్ సరిహద్దు దగ్గర ఉంటుందని అంటారు. కానీ, ఖచ్చితమైన లొకేషన్ ఎవరూ చెప్పలేదు. దీనివల్ల శంభాలా మరింత మిస్టీరియస్‌గా మారింది. కొన్ని కథల్లో దీన్ని ఒక నిజమైన ప్రదేశంగా, దూరంగా ఉన్న లోయలో లేదా పర్వతాల్లో దాగి ఉన్న స్థలంగా చెబుతారు. అక్కడికి పవిత్ర హృదయం ఉన్నవాళ్లు మాత్రమే చేరుకోగలరట. మరికొందరు దీన్ని ఆధ్యాత్మిక లోకంగా, భౌతిక ప్రపంచానికి అతీతంగా ఉన్న స్థలంగా చెబుతారు. అక్కడ జ్ఞానం, శాంతి నెలకొని ఉంటాయి. ఈ అస్పష్టత వందల సంవత్సరాలుగా చర్చలకు, ఊహాగానాలకు దారితీసింది.


శంభాలా పాపులర్ కల్చర్‌లో
శంభాలా గురించి కల్కి 2898 ఏడీ ఒక్కటే చెప్పలేదు. 1933లో జేమ్స్ హిల్టన్ రాసిన లాస్ట్ హొరైజన్ నవలలో షాంగ్రీ-లా అనే కల్పిత స్వర్గధామాన్ని పరిచయం చేశారు, ఇది శంభాలా నుంచి స్ఫూర్తి పొందినదే. ఈ ఐడియా పాశ్చాత్య ప్రపంచంలో సూపర్ హిట్ అయ్యింది, శంభాలాని ఒక యుటోపియాగా చూపించింది. అన్వేషకులు, ఆధ్యాత్మిక జిజ్ఞాసులు శంభాలా కోసం హిమాలయాల్లో, సెంట్రల్ ఆసియాలోని అల్తాయ్ పర్వతాల్లో, భారత్‌లోని ధౌలాధర్ శ్రేణిలో వెతికారు. కానీ, శంభాలా ఉందని ఎలాంటి ఆధారాలూ దొరకలేదు.

శంభాలా నిజమేనా?
విద్వాంసులు, పరిశోధకులు దీనిపై విభిన్న అభిప్రాయాలు చెబుతారు. శంభాలా బహుశా ఆధ్యాత్మిక జ్ఞానానికి సంకేతం. అది నిజమైన స్థలం కాకపోవచ్చు. పురాణాలు దీన్ని మంచి భవిష్యత్తు మీద ఆశ కలిగించడానికి ఉపయోగించాయని హిందూ పురాణాల నిపుణులు చెబుతారు. శంభాలా హిమాలయాల్లో కనుమరుగైన పాత నగరాలతో సంబంధం కలిగి ఉండొచ్చని కొందరు పురావస్తు శాస్త్రవేత్తలు అంటారు. లడఖ్, తిబెత్‌లో జరిగిన తవ్వకాల్లో పాత బౌద్ధ స్థలాలు బయటపడ్డాయి. కానీ శంభాలాతో లింక్‌కి ఆధారాలు లేవు.

ఫ్యాన్స్ టాక్
సోషల్ మీడియాలో చూస్తే, శంభాలా మీద ఆసక్తి ఇంకా ఫుల్ జోష్‌లో ఉంది. కొందరు విష్ణు పురాణంలో శంభాలా గురించి చెప్పిన విషయాన్ని షేర్ చేస్తూ, దాని లొకేషన్ గురించి ఊహాగానాలు చేస్తున్నారు. కొంతమంది దీన్ని ఉత్తరప్రదేశ్‌లోని సంభల్ అనే టౌన్‌తో లింక్ చేస్తున్నారు, అక్కడ 2024లో ప్రధానమంత్రి మోదీ శ్రీ కల్కి ధామ్ ఆలయానికి శంకుస్థాపన చేశారు. కానీ, ఇవి కేవలం ఊహాగానాలే, చారిత్రక ఆధారాలు లేవు.

ALSO READ: అనంత పద్మనాభుని ఆరో గది పరిస్థితి ఏంటి?

సినిమా ఎఫెక్ట్
కల్కి 2898 ఏడీ ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. దీంతో శంభాలా మీద ఆసక్తి మరింత పెరిగింది. కానీ, ఈ సినిమా భారత పురాణాలను సెలబ్రేట్ చేయడానికి, ఫ్యూచర్ నేపథ్యంలో కథ చెప్పడానికి తీసాం. శంభాలా నిజమని నిరూపించడం మా లక్ష్యం కాదని సినిమా నిర్మాత అశ్వినీ దత్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

అసలు శంభాలా ఉందా?
చరిత్రకారులకు ఇది పురాణాల్లోని ఆసక్తికరమైన కథ, కానీ ఆధారాలు లేవు. కల్కి 2898 ఏడీ ఫ్యాన్స్‌కి ఇది పురాణాన్ని సినిమాటిక్‌గా చూపించిన అద్భుతం! కానీ అందులోని శంభాలా గురింటే చర్చలు కొనసాగుతున్నాయి, కానీ శంభాలా ఇప్పటికీ రహస్యమే. హిమాలయాల్లో దాగి ఉన్న శాంతి స్థలంగానా, లేక మన ఊహల్లో మాత్రమే ఉందా? అనేది వీడని మిస్టరీగానే మిగిలిపోయింది. ఇక విష్ణుమూర్తి పదో అవతారంగా ఇక్కడే జన్మిస్తాడా అనే ప్రశ్నకు కూడా ఇంకా సమాధానం దొరకలేదు.

Related News

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Big Stories

×