Pawan Kalyan : టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న కూడా అభిమానుల కోరిక మేరకు సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా తీరిక లేని షెడ్యూల్ మధ్యే తాను ఒప్పుకున్న సినిమాలను పూర్తిచేసేందుకు శాయశక్తులా కష్టపడుతున్నారు. ఇటీవలే ‘హరిహర వీరమల్లు’ షూటింగ్‌ని పూర్తి చేయడంతో మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు.. జూన్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. అలాగే మరో సినిమా కూడా పూర్తిచేసి త్వరలోనే విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.. దీని తర్వాత మరో రెండు సినిమాలు చెయ్యాల్సి ఉంది. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ సినిమాలు విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుపుతుంది.. ఆ నిర్ణయంతో టాలీవుడ్ నిర్మాతలు ఫుల్ ఖుషి అవుతున్నారని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. ఆ నిర్ణయం ఏంటో ఒకసారి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
పవన్ కళ్యాణ్ షాకింగ్ నిర్ణయం..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో బిజీ అవ్వకముందు వరుసగా సినిమాలను అనౌన్స్ చేశారు. అయితే ఎన్నికల్లో భారీ మెజారిటితో గెలుపొందారు. అలాగే డిప్యూటీ సీఎం గా ఏపీ బాధ్యతలను చేపట్టారు. ఇలా ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అయితే తాను గతంలో కమిటీ అయినా సినిమాలను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగానే తనకు సమయం దొరికినప్పుడే షూటింగ్లకు వెళుతూ ఒక సినిమాని పూర్తి చేశాడు. ఇప్పటికే చాలా సమయం అవడంతో ఆ సినిమా కోసం ఫాన్స్ కూడా ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ తాజాగా ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు అంటూ ఓ వార్త అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే పవన్ కళ్యాణ్ ఇకమీదట సినిమాలకు రెమ్యూనరేషన్ తీసుకోవడట అంటూ ఇండస్ట్రీలో టాక్..
Also Read : ఓటీటీలోకి ‘సింగిల్ ‘ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..?
పవన్ కళ్యాణ్ నిర్ణయం వెనుక కారణం..?
గతంలో సైన్ చేసిన సినిమాలు పవన్ కారణంగా ఈ సినిమాల షూటింగ్ ఆలస్యం కావడంతో నిర్మాతలపై ఆర్థిక భారం పడుతోంది. ఫైనాన్షియర్ల దగ్గర తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగి వాళ్లు సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. ఆ విషయాన్ని తెలుసుకున్న ఆయన నిర్మాతలను పిలిచి మరీ ఇక రెమ్యూనరేషన్ నాకొద్దు అని చెప్పాడట. నావల్లే సినిమా విడుదల ఆలస్యమైంది కాబట్టి నాకు ఇక మీదట మీరు ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పినట్లు తెలుస్తుంది. వీరమల్లు కోసం పవన్ రూ.20కోట్ల రెమ్యునరేషన్ తీసుకోవాల్సి ఉండగా.. అందులో కొంత భాగం అడ్వాన్స్‌గా తీసుకున్నారట. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కోసం రెండేళ్ల క్రితమే రూ.15కోట్లు అడ్వాన్స్ రూపంలో తీసుకున్నారట… ఈ సినిమాలను పూర్తి చేస్తాను కానీ నాకు మాత్రం డబ్బులు వద్దు అని చెప్పారట.. పవన్ కళ్యాణ్ నిర్ణయంతో నిర్మాతలు ఫుల్ ఖుషి అవుతున్నారు.