BigTV English

UP News: చనిపోయిన యువతితో పెళ్లి.. ఆ తర్వాతే కాటికి , ఏం జరిగింది?

UP News: చనిపోయిన యువతితో పెళ్లి.. ఆ తర్వాతే కాటికి , ఏం జరిగింది?

UP News: వారిద్దరు ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకోవాలని భావించారు. తమ కుటుంబాల్లో పెద్దలను ఒప్పించారు. ప్రేమ జంట మధ్య చిన్న గొడవ జరిగింది. తట్టుకోలేని ఆ యువతి ఆత్మహత్య పాల్పడింది. ఈ విషయం తెలిసి కన్నీరు మున్నీరయ్యాడు ప్రియుడు. చనిపోయిన యువతిని పెళ్లి చేసుకున్నాడు.  అన్నీ తానై అంత్యక్రియలు నిర్వహించాడు. సంచలనం రేపిన ఈ ఘటన యూపీలో వెలుగుచూసింది.


ఉత్తర‌ప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లాకు చెందిన ప్రియాంక- సన్నీమదేశియా మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. ప్రియాంకకు 23 ఏళ్ల కాగా, కన్నీకి 29 ఏళ్లు. తమ ప్రేమ విషయాన్ని ఇరువురు పెద్దల ముందు పెట్టారు. మెల్లగా వారిని ఒప్పించారు. వీరిద్దరి పెళ్లికి ఇరుకుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. పెళ్లికి ముహూర్తాలు పెట్టేసుకున్నారు.

నవంబర్ 29న వీరి వివాహానికి జరగనుంది. కొన్నిరోజుల్లో ఒక్కటి కానున్నారు. వీరిద్దరు గాల్లో తేలుతున్నారు. అయితే ఇద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్థలు తలెత్తాయి. ఒకరినొకరు మాటా మాటా అనుకున్నారు. ప్రియుడు అన్నమాటలకు నొచ్చుకుంది ప్రియాంక. ప్రియుడితో చిన్న గొడవను జీర్ణించుకోలేకపోయింది.


చివరకు ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు గుండె పగిలేలా కన్నీరుమున్నీరు అయ్యారు. కొన్ని రోజుల్లో పెళ్లి ఉండగా కూతురు చనిపోవడాన్ని తట్టుకోలేకపోయారు. కాబోయే అల్లుడికి ఫోన్ చేసి అసలు విషయం చెప్పారు.

ALSO READ: మహిళా ఉద్యోగి ఇంట్లో ఎవరూ లేనప్పుడు దొంగచాటుగా ప్రవేశించిన బాసు,  ఆ తర్వాత

వెంటనే సన్నీ అక్కడకు వచ్చి ప్రియురాలిని చూసి రోదించాడు. నన్నెందుకు విడిచిపెట్టావంటూ గుండెలు బాదుకుంటూ ఏడ్చాడు.  ప్రియాంక ఆత్మకు శాంతి కలగాలంటే తాను పెళ్లి చేసుకున్న తర్వాతే అంత్యక్రియలు చేయాలని మెలిక పెట్టాడు. అల్లుడి మాట కాదన లేక ప్రియాంక డెడ్‌బాడీకి స్నానం చేయించి పాడెపై పెట్టారు.

ఊరేగింపుగా శ్మశానికి తీసుకెళ్లారు. అక్కడే ఆమె నదుటిన సింధూరం పెట్టి ఏడు అడుగులు వేస్తున్నట్లు భావించి చుట్టూ తిరిగాడు. ఆ వ్యవహారం ముగిసిన తర్వాత తన భార్యకు తానే అంత్యక్రియలు నిర్వహించాడు. దగ్గరుండి మరీ ప్రియురాలి చితికి నిప్పంటించాడు. ఆ సన్నివేశం స్థానికులను కంటతడి పెట్టించింది. రెండు కుటుంబాల సమ్మతితో వివాహం జరిగిందని స్థానిక పోలీసులు చెబుతున్నారు. మరణంలో విడదీయలేని ప్రేమకు ఇదొక నిదర్శనం.

 

Related News

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Rules In Village: ఇదేం దిక్కుమాలిన నియమాలు.. వ్యక్తిని తాకితే రూ.5000 జరిమానా! ఎక్కడో తెలుసా?

Big Stories

×