E-Paper
Advertisement

Thabitha Sukumar: డైరెక్టర్ సుకుమార్ భార్యను చూశారా.. హీరోయిన్ కి ఏ మాత్రం తీసిపోకుండా బీచ్ ఒడ్డున ?

Thabitha Sukumar: డైరెక్టర్ సుకుమార్ భార్యను చూశారా.. హీరోయిన్ కి ఏ మాత్రం తీసిపోకుండా బీచ్ ఒడ్డున ?
Advertisement

Thabitha Sukumar: ఒకప్పుడు స్టార్ హీరోల భార్యలు కానీ, డైరెక్టర్స్ భార్యలు కానీ కనిపించాలంటే ఏదైనా ఈవెంట్ కో, లేక ఫంక్షన్ కో వస్తే తప్ప కనిపించేవారు కాదు. ఇప్పటికీ చాలామంది డైరెక్టర్ భార్యలు ఎలా ఉంటారు అనేది కూడా చాలామందికి తెలియదు. ఎప్పుడో ఈవెంట్స్ కు వచ్చినప్పుడు ఆమె. ఆ డైరెక్టర్ భార్య అని చెప్తే తప్ప ఎవరికీ తెలియడం లేదు. కానీ,  కాలం మారుతుంది. ఇప్పుడు స్టార్ హీరోల భార్యలు కానీ, డైరెక్టర్స్ భార్యలు కానీ.. ఇంట్లో ఖాళీగా కూర్చోవాలనుకోవడం లేదు. తమ కాళ్ల మీద తాము నిలబడాలని చూస్తున్నారు. భర్తల సపోర్ట్ తో పైకి ఎదగాలనుకుంటున్నారు. సొంతంగా బిజినెస్ లు స్టార్ట్ చేసి తమ భర్తల కంటే ఎక్కువగా సంపాదిస్తున్నారు.

 

Advertisement

టాలీవుడ్ స్టార్ వైవ్స్ చాలామంది తమకు నచ్చిన బిజినెస్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. అలా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న ఒక స్టార్ వైఫ్ తబితా సుకుమార్. అవును ఇప్పటికే ఆమె ఎవరి భార్యనో తెలిసిపోయి ఉంటుంది కదా. డైరెక్టర్ సుకుమార్ భార్య తబితా. ఒకప్పుడు ఆమె ఎప్పుడో ఈవెంట్స్ లో తప్ప కనిపించేది కాదు. కానీ, ఇప్పుడు ఆమెకు సోషల్ మీడియాలో సపరేట్ ఫ్యాన్ బేస్ నే ఉంది. స్టార్ డైరెక్టర్ గా పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్న సుకుమార్ భార్య తబితా కూడా ఒక బిజినెస్ విమెన్. సుకుమార్ రైటింగ్స్ మరియు గోపీటాకీస్ సంస్థలతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన చిత్రాలలో ఆమె సమర్పకురాలిగా ఉంటూనే.. ఇంకోపక్క తన సొంత బిజినెస్ ను చూసుకుంటుంది.

Actress Sneha: ఆ హీరో అంటే నాకు చాలా ఇష్టం

Advertisement

 

ఇక ఈ మధ్యనే తబితా లాండ్రీ కార్ట్ అనే సంస్థను స్థాపించింది. సమంత ఈ లాండ్రీ కార్ట్ యాప్ ను ఓపెన్ చేసిన విషయం తెల్సిందే.  ఈ సంస్థలో ఆమెతో పాటు అలేఖ్య, గిరిజ, శరత్ లు కూడా భాగస్వాములు. లాండ్రీ కార్ట్ ఒక మొబైల్ యాప్ ద్వారా లాండ్రీ సేవలను అందిస్తుంది. ఈ లాండ్రీ కార్ట్ బిజినెస్ ను ఆమె దగ్గరుండి చూసుకుంటుంది. ఇంకోపక్క ఇండస్ట్రీలో కూడా నిర్మాతగా మంచి మంచి సినిమాలను నిర్మించింది.

 

ఇక గతంలో ఎప్పుడు లేనంతగా తబితా సోషల్ మీడియాలో అభిమానులను పెంచుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ గా కనిపించని తబితా ఈ మధ్య బాగా. యాక్టివ్ గా ఉంటుందని. తాజాగా ఆమె తన వెకేషన్ ఫోటోలను అభిమానులతో పంచుకుంది. బాలిలో బీచ్ ఒడ్డున తబితా నడుస్తున్న ఫోటోలను షేర్ చేసింది. బీచ్ ఒడ్డున వైట్ కలర్ డిజైనర్ డ్రెస్ లో హీరోయిన్ లా ఫోజులు ఇస్తూ కనిపించింది. సడెన్ గా ఎవరైనా చూస్తే ఎవరీ హీరోయిన్ అని అడగకుండా ఉండలేరు అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఏంటి ఈమె సుకుమార్ భార్యనా.. మేము ఇంకా ఏ కోలీవుడ్ హీరోయినో అనుకుంటున్నామే అంతో నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. 

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×