E-Paper
Advertisement

Viral Video: పార్సిల్ డెలివరీకి.. బైక్ బుక్ చేసిన మహిళ.. బాక్స్‌లోది చూసి అవాక్కైన రైడర్!

Viral Video: పార్సిల్ డెలివరీకి.. బైక్ బుక్ చేసిన మహిళ.. బాక్స్‌లోది చూసి అవాక్కైన రైడర్!
Advertisement

Viral Video: ఉత్తర్ ప్రదేశ్ లోని లక్నోలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ ఇంట్లో చెత్తను పారేయడానికి పోర్టర్ సర్వీసును ఉపయోగించుకోవడం ఆందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. డెలివరీ ఫ్లాట్ ఫామ్ లను ఈ స్థాయిలో దుర్వినియోగం చేస్తారా? అన్న విమర్శలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా.. నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే?

లక్నోకు చెందిన పోర్టర్ రైడర్ కరణ్ నిషాద్.. తనకు ఎదురైన విచిత్ర అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. రోజువారీగానే కరణ్ నిషాద్ కు పోర్టర్ యాప్ నుంచి ఒక బుకింగ్ వచ్చింది. ఎప్పటిలాగే పికప్ పాయింట్ వద్దకు వెళ్లగా.. ఓ మహిళ వచ్చి పార్సిల్ ఇచ్చింది. డ్రాపింగ్ లొకేషన్ లో దానిని ఇచ్చేయమని ఆమె చెప్పడంతో.. మ్యాప్ ఆధారంగా కరణ్ బయలుదేరాడు. అయితే డ్రాపింగ్ లోకేషన్ కు చేరుకున్న తర్వాత అతడు ఒక్కసారిగా విస్మయానికి గురయ్యాడు. ఆ ప్రదేశం నిర్జనంగా ఉండటంతో పాటు.. అదొక డంపింగ్ యార్డ్ ను తలపిస్తోంది.

పార్సిల్ చూసి షాకైన రైడర్

Advertisement

దీంతో కన్ఫ్యూజన్ అయిన రైడర్ కరణ్.. పార్సిల్ ఇచ్చిన మహిళకు వెంటనే ఫోన్ చేశాడు. అప్పుడు ఆమె చెప్పిన సమాధానం విని.. రైడర్ ఒక్కసారిగా ఖంగు తిన్నాడు. ‘మీరు దానిని ఎవరికీ డెలివరీ చేయాల్సిన పనిలేదు. పార్సిల్ ను అక్కడే పడేయండి’ అని లేడీ కస్టమర్ చెప్పడాన్ని రైడర్ కరణ్ షేర్ చేసిన వీడియోలో చూడవచ్చు. ఇంతకీ లోపల ఏముందా అని కరణ్ తెరిచి చూడగా.. అందులో చెత్త తప్ప మరేమి కనిపించలేదు. డెలివరీ బాయ్స్ ను ఆఖరికి చెత్తపారేయడానికి కూడా వినియోగిస్తున్నారా? అంటూ కరణ్ వీడియోలో అసహనం వ్యక్తం చేశాడు.

Advertisement

Also Read: Telangana Municipal Elections: జనసేన మద్దతుపై బీజేపీ పునరాలోచన? ఈనెల ఆ తేదీల్లో పవన్ ప్రచారం!

నెటిజన్ల రియాక్షన్

చెత్త కోసం రైడ్ బుక్ చేసిన వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అయ్యింది. 24 గంటల్లోనే 8.1 మిలియన్ వ్యూస్, 2.5 లక్షల లైక్స్, 2,200 కామెంట్స్ వచ్చాయి. కస్టమర్ సర్వీసులను ఈ విధంగా దుర్వినియోగం చేయడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డెలివరీ బాయ్స్ స్థాయిని దిగజార్చి.. ఇలా వ్యవహరించడం సరైంది కాదని మహిళకు సూచిస్తున్నారు. మరోవైపు మహిళ ఇచ్చిన చెత్తను రోడ్డు పక్కనే పడేయడం తప్పని రైడర్ కు సూచిస్తున్నారు.

Also Read: Royal enfield Hunter 350 vs Yamaha XSR 155: రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 vs యమహా XSR 155, వీటిలో ఏది తోప్ అంటే?

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×