E-Paper
Advertisement

Hyderabad Crime: జూబ్లీహిల్స్‌లో రెచ్చిపోయిన దొంగలు.. తాళ్లతో కట్టేసి.. కత్తితో బెదిరించి.. ఆ గ్యాంగ్ పనేనా?

Hyderabad Crime: జూబ్లీహిల్స్‌లో రెచ్చిపోయిన  దొంగలు.. తాళ్లతో కట్టేసి.. కత్తితో బెదిరించి.. ఆ గ్యాంగ్ పనేనా?
Advertisement

Hyderabad Crime: భాగ్యనగరంలో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారా? అపార్టుమెంట్లు, విల్లాలను టార్గెట్ చేస్తున్నారా? నందగిరి హిల్స్‌లో చోరీ వెనుక ఏం జరిగింది? ఈ ఘటన వెనుక నేపాలీ గ్యాంగ్ ప్రమేయముందా? దొంగతనాలతో నగరవాసుల్లో అలజడ మొదలైందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

జూబ్లీహిల్స్‌లో రెచ్చిపోయిన దొంగలు

Advertisement

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. నందగిరి హిల్స్‌లోని ఓ ఇంటిని దొంగలు దోపిడీ చేశారు.  ఇంట్లో విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. తొలుత ఇంటి వద్ద వాచ్‌మెన్‌ గురించి వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత అతడికి మత్తుమందు కలిపిన పదార్ధాలు ఇచ్చారు. అతడు ఆపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత దొంగలు తమ పని కానిచ్చారు.

ఇంట్లోకి చొరబడి లాకర్‌లను బద్దలుకొట్టి బంగారు ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లారు. కొద్దిసేపటి తర్వాత వాచ్‌మేన్‌కి మెలకువ వచ్చేసరికి ఇల్లంతా గులయ్యింది. ఈ ఘటన వెనుక నేపాలీ గ్యాంగ్ ఉన్నట్లు భావిస్తున్నారు పోలీసులు. బాధితుల ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు పోలీసులు.

Advertisement

నందగిరి హిల్స్‌లో భారీ చోరీ,  నేపాలీ గ్యాంగ్ పనేనా?

దొంగల కదలికలను గుర్తించేందుకు పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. దొంగలు సిటీ విడిచి పోకుండా రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌ల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ తరహా నేరాలకు పాల్పడిన పాత నేరస్థుల జాబితాను పరిశీలిస్తున్నారు. ఇటీవల కాలంలో భాగ్యనగరంలో నేపాలీ గ్యాంగ్‌ల సంచారం క్రమంగా పెరుగుతోంది.

చాలా అపార్టుమెంట్లలో వాచ్‌మెన్లగా వారిని నియమించుకుంటున్నారు.  హైదరాబాద్ సిటీలోని దాదాపు 40 శాతం పైగా నేపాలీయులు వాచ్‌మేన్లుగా ఉంటున్నారు.  వారిని నియమించుకునే క్రమంలో నేపాలీ వ్యక్తుల ఆధార్ కార్డులు, వారికి సంబంధించిన వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్‌లో సమర్పించాలని సూచిస్తున్నారు. గతంలో సికింద్రాబాద్‌లోని ఓ అపార్టుమెంట్‌లో దంపతులను చంపేసి బంగారు, నగదు దోచుకెళ్లిన సంగతలి తెల్సిందే.

ALSO READ: ఫ్రెండ్ ఫోన్‌లో సోదరి నగ్న వీడియోలు.. కోపంతో రగిలిపోయిన అన్న

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×