BigTV English

Atthammaa’s Kitchen Prices: అలేఖ్య చిట్టి పికెల్స్ వివాదం.. మెగా ఫ్యామిలీకి చుట్టుకుందా.. అసలేమైందంటే..?

Atthammaa’s Kitchen Prices: అలేఖ్య చిట్టి పికెల్స్ వివాదం.. మెగా ఫ్యామిలీకి చుట్టుకుందా.. అసలేమైందంటే..?

 Atthammaa’s Kitchen Prices..సోషల్ మీడియాలో అలేఖ్య చిట్టి పికెల్స్ వివాదం ఎంత వైరల్ గా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఒక కస్టమర్ తో.. ఈ అలేఖ్య చిట్టి పికెల్స్ సిస్టర్స్ లో ఒకరు మాట్లాడిన తీరుకి అసహనం వ్యక్తం చేసిన సదరు కష్టమర్.. ఏకంగా ఆ ఆడియోని సోషల్ మీడియాలో పెట్టడంతో, ఇది సంచలనం సృష్టిస్తోంది. ఈ ప్రభావం కారణంగా.. ఇప్పుడు ఏకంగా బిజినెస్ ని క్లోజ్ చేసుకునే పరిస్థితికి వచ్చిందని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ అక్క చెల్లళ్లు ముగ్గురు కూడా ఒకరి తరువాత ఒకరు క్షమాపణలు కూడా చెప్పారు. ఆఖరికి కస్టమర్ ను దుర్భాషలాడిన అలేఖ్య కూడా ఏకంగా ఏడుస్తూ ఒక వీడియోని కూడా రిలీజ్ చేసింది. ఇక దీన్ని బట్టి చూస్తే సోషల్ మీడియా ప్రభావం ఎంతలా ఉంటుందో అర్థం చేసుకోవాలి. వ్యాపారస్తులు ఎవరైనా సరే కస్టమర్ తో మాట్లాడాలంటే కాస్త ఆచితూచి అడుగులు వేయాలనే ఆలోచనకు వస్తారు అని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా వ్యాపారం చేస్తూ జీవితాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా మార్చుకున్న ఈ అక్కాచెల్లెళ్లకు ఇప్పుడు భారీగా నష్టం వాటిల్లుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి.


అలేఖ్య చిట్టి పికెల్స్ వివాదం.. అత్తమ్మాస్ కిచెన్ పై ప్రభావం..

ఇదిలా ఉండగా..ఈ అలేఖ్య చిట్టి పికెల్స్ వివాదం ఇప్పుడు మెగా ఫ్యామిలీకి చుట్టుకోబోతోందేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదేంటి అలేఖ్య చిట్టి పికెల్స్ కి, మెగా ఫ్యామిలీకి సంబంధం ఏంటి? అనే సందేహం అందరిలో మొదలవుతుంది . అయితే అసలు విషయం ఇక్కడే ఉంది.. మెగా కోడలు ఉపాసన(Upasana ) తన అత్తయ్య సురేఖ కొణిదెల (Surekha Konidela) తో కలిసి ‘అత్తమ్మాస్ కిచెన్’ అనే బిజినెస్ మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ముఖ్యంగా తమ వంటింటి రుచులను.. అందరికీ రుచి చూపించాలని ఇలా ఫుడ్ బిజినెస్ ను ఉపాసన గత ఏడాది మొదలుపెట్టారు. ముఖ్యంగా ఇంటి భోజనం మిస్ అవుతున్నామనే ఫీలింగ్ రానివ్వకుండా ఈ బిజినెస్ మొదలుపెట్టినట్లు మెగా కోడలు ఇప్పటికే ఎన్నోసార్లు తెలిపారు. ఇక వ్యాపారంలో భాగంగా పొంగల్ మిక్స్, ఉప్మా మిక్స్, పులిహోర పేస్టు తో పాటు రసం పౌడర్ వంటి రెసిపీలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే ఇక్కడ ఒక్కొక్కటి కాకుండా నాలుగు పాకెట్స్ ఒక్కొక్కటి చొప్పున కాంబోలో తీసుకుంటే.. 1000 రూపాయలకు పైగా ధర పలుకుతోంది.


వైరల్ గా మారిన అత్తమ్మాస్ కిచెన్ ప్రొడక్ట్స్ ధరలు..

ప్రస్తుతం మనం అత్తమ్మాస్ కిచెన్ వెబ్ సైట్ ను ఓపెన్ చేస్తే అక్కడ ఉండే ధరలు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. పులిహోర పేస్ట్ ప్యాకెట్లు మూడు కలిపి రూ.1,170, రసం ప్యాకెట్లు 5 కలిపి రూ.1,185, 5 ఉప్మా మిక్స్ ప్యాకెట్స్ రూ.1,175, 5 పొంగల్ మిక్స్ ప్యాకెట్లు 1,185 రూపాయలకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా రెస్పాండ్ అవుతూ ఉండడం గమనార్హం.ఏది ఏమైనా అలేఖ్య చిట్టి పికెల్స్ వివాదం ఇప్పుడు అత్తమ్మాస్ కిచెన్ ధరలపైన కూడా ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి దీనిపై నెటిజన్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Related News

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Big Stories

×