MI VS RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఇప్పటివరకు 19 మ్యాచులు సక్సెస్ఫుల్గా పూర్తయ్యాయి. ఇవాళ 20వ మ్యాచ్ లో భాగంగా ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య బీకర ఫైట్ జరగనుంది. ఈ రెండు జట్లకు ఈ మ్యాచ్ కీలకం కావడంతో… గెలిచేందుకు రెండు జట్లు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. ముంబైలోని… వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ జరగనుంది.
మ్యాచ్ టైమింగ్స్, ఉచితంగా ఎలా చూడాలి ?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ చాలెంజెస్ బెంగళూరు జరిగే మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. సాయంత్రం ఏడు గంటల సమయంలో టాస్ ప్రక్రియ ఉంటుంది. ఇక ఈ మ్యాచ్ ఉచితంగా చూడాలంటే జియో హాట్ స్టార్ కు వెళ్లాల్సి ఉంటుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన మ్యాచ్ లు అన్నీ కూడా జియో హాట్ స్టార్ లో ఉచితంగానే అందిస్తున్నారు. స్టార్ స్పోర్ట్స్ లో కూడా ఈ మ్యాచ్లు మనం తిలకించవచ్చు.
ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గత రికార్డులు
ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఇప్పటివరకు 33 మ్యాచ్ లు జరిగాయి. ఈ 33 మ్యాచ్లలో ముంబై ఇండియన్స్ ఏకంగా 19 మ్యాచ్ లలో విజయం సాధించింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కేవలం పద్నాలుగు మ్యాచ్లో విజయం సాధించింది. ఈ రెండు జట్ల మధ్య లోయెస్ట్ స్కోర్ 111 కాగా… హైయెస్ట్ స్కోర్ 25 గా ఉంది. ఇక ఈ రెండు జట్ల మధ్య 2024 టోర్నమెంట్ సమయంలో మ్యాచ్ జరిగింది. అప్పుడు 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ముంబైలో మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో హార్దిక్ పాండ్యా సేనకు అడ్వాంటేజ్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది.
బుమ్రా, రోహిత్ వచ్చేస్తున్నారు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుపై గెలిచేందుకు ముంబై ఇండియన్స్ భారీ ప్లాన్ చేసింది. ఇవాల్టి మ్యాచ్లో రోహిత్ శర్మ అలాగే బుమ్రా ఇద్దరినీ బరిలోకి దించేందుకు రంగం సిద్ధం చేసిందట ముంబై ఇండియన్స్. ఇద్దరూ గాయాల నుంచి కోల్కొని రీఎంట్రీ ఇవ్వబోతున్నారని సమాచారం. వాళ్ళిద్దరూ జట్టులో చేరితే ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ కు మంచి బూస్ట్ వస్తుంది.
Teams
ముంబై ఇండియన్స్ ప్రాబబుల్ XII: రోహిత్ శర్మ, విల్ జాక్స్, ర్యాన్ రికెల్టన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (సి), నమన్ ధీర్, రాజ్ బావా, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, విఘ్నేష్ పుతుర్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రాబబుల్ XII: ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (సి), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (wk), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్, యశ్ దయాల్, సుయాష్ శర్మ