BigTV English

Telangana News : తెలంగాణలో అది జరగాలంటున్న కోదండరాం.. సార్ చెప్తే వినాలి!

Telangana News : తెలంగాణలో అది జరగాలంటున్న కోదండరాం.. సార్ చెప్తే వినాలి!

Telangana News : ప్రొఫెసర్ కోదండరాం. ఉద్యమకాలంలో జేఏసీ ఛైర్మన్. కేసీఆర్ తర్వాత నెంబర్ 2. ప్రత్యేక తెలంగాణ నినాదానికి గొంతుక. యువత, నిరుద్యోగులను పోరుబాట పట్టించిన విద్యావేత్త. రాష్ట్ర ఏర్పాటులో సార్ కృషి ఎనలేనిది. తెలంగాణ రాగానే.. కోదండరాంను కరివేపాకులా తీసి పడేసి.. తొక్కేశారు అప్పటి సీఎం కేసీఆర్. కోదండరాం పేరే వినబడకుండా అణిచివేశారు. ధర్నాచౌక్‌ను ఎత్తేశారు. సార్ ఇంటిపై పోలీసులు దాడి చేసి.. తలుపులు బద్దలుకొట్టి.. ఇంట్లో నుంచి ఎత్తుకెళ్లి అరెస్ట్ చేసిన అరాచక పాలనను చూశాం. కట్ చేస్తే.. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక ఉద్యమ నాయకుడికి సరైన గుర్తింపు ఇచ్చారు. గవర్నర్ కోటాలో కోదండరాం సార్‌ను ఎమ్మెల్సీని చేసి గౌరవించారు.


డీలిమిటేషన్‌పై మరో ఉద్యమం

ఆనాడు తెలంగాణ హక్కుల కోసం ఎలాగైతే ప్రశ్నించారో.. ఇప్పుడు డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాల హక్కుల కోసం అదే తరహాలో గొంతెత్తుతున్నారు ప్రొఫెసర్ కోదండరాం. పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ – దక్షిణ భారత భవిష్యత్ పై నిర్వహించిన సెమినార్‌లో ప్రత్యేక అతిథిగా మాట్లాడారు. డిలిమిటేషన్ వల్ల ఆర్థిక, రాజకీయ అసమానతలు తలెత్తుతాయని అన్నారు. ఒక్క ఉత్తర ప్రదేశ్‌ స్టేట్‌కు ఎన్ని ఎంపీ సీట్లు వస్తాయో.. దక్షిణాది రాష్ట్రాలన్నిటినీ కలిపినా యూపీకి వచ్చినన్ని స్థానాలు రావన్నారు. ఈ విషయాన్ని కేంద్రంలోని బీజేపీ పట్టించుకోకపోతే దక్షిణాది నుంది భారీ ఉద్యమం వస్తుందని హెచ్చరించారు MLC కోదండరాం.


తెలంగాణకు అన్యాయం.. మేం ఒప్పుకోం..

డీలిమిటేషన్‌పై తమిళనాడు మొదటగా పోరాటం ఆరంభించడం శుభపరిణామం అన్నారు. తెలంగాణలో సైతం ఈ అంశంపై విస్తృత చర్చ జరగాల్సి ఉందన్నారు. తెలంగాణకు కేంద్ర నిధుల కేటాయింపులో తీవ్రఅన్యాయం జరుగుతోందని చెప్పారు. యూపీకి రూ.1.30 లక్షల కోట్ల నిధులు అందిస్తే.. తెలంగాణకు కేవలం 30 వేల కోట్లు మాత్రమే వచ్చాయని గుర్తు చేశారు.

డీలిమిటేషన్‌పై సీలింగ్..

ఇందిరా గాంధీ హయాంలో 1971 లెక్కల ప్రకారం డీలిమిటేషన్ జరిగిన అనంతరం సీలింగ్ విధించారని.. ఆ సీలింగ్ 2026 వరకు అమలులో ఉంటుందని కోదండరాం చెప్పారు. ఇప్పుడు అసమతుల్యత జరగకుండా ఉండాలంటే ఆ సీలింగ్ కొనసాగించాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ సీట్లు పెరగకుండా డీలిమిటేషన్ చేస్తే బాగుంటుందనే దానిపై చర్చ జరగాలని పిలుపు ఇచ్చారు. దక్షిణాది రాష్ట్రాలను తక్కువగా అంచాన వేయొద్దని కేంద్రాన్ని హెచ్చరించారు ప్రొఫెసర్ కోదండరాం. ఈ రాష్ట్రాలు ద్రవిడ ఉద్యమానికి కేంద్రం అని.. చారిత్రక వారసత్వం ఉన్న ప్రాంతం అని కేంద్రం తెలుసుకోవాలన్నారు. ఈ సెమినార్ డీలిమిటేషన్‌పై పోరాటానికి ఆరంభం మాత్రమే.. ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళతాం అన్నారు.

Also Read : తెలంగాణలో వీరి ఖాతాల్లోకి రూ.లక్ష జమ

దక్షిణాది సత్తా చూపిస్తాం..

స్టాలిన్‌తో మొదలైన దక్షిణాది ఉద్యమం.. సీఎం రేవంత్‌రెడ్డి ఎంట్రీతో తారాస్థాయికి చేరింది. చెన్నైలో మొదటిదశ చర్యలు జరిగాయి. తెలంగాణ అసెంబ్లీలో డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. నెక్ట్స్ అఖిలపక్ష మీటింగ్ హైదరాబాద్‌లోనే. భారీ బహిరంగా సభ కూడా ఉండనుంది. సీఎం రేవంత్ ఆ పనిని లీడ్ చేస్తున్నారు. సౌత్ ఇండియా సెగ కేంద్రానికి తాకేలా ఉద్యమ కార్యచరణ సిద్ధం చేస్తున్నారు. దక్షిణాది దెబ్బ ఎలా ఉంటుందో మోదీకి తెలిసేలా.. కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ యాక్షన్‌లోకి దిగారు. ఆయనకు ప్రొఫెసర్ కోదండరాం సార్ సపోర్ట్‌గా నిలిచి కదం తొక్కేందుకు రెడీ అయ్యారు.

Related News

Hyderabad floods: హైదరాబాద్‌కు భారీ వర్షాల భయం పోతుందా? సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రణాళిక ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Big Stories

×