‘స్పైడర్ మ్యాన్’ ఈ సినిమా గురించి ప్రపంచ వ్యాప్తంగా తెలియని వారుండరు. చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు ఈ సినిమాలో స్పైడర్ మ్యాన్ చేసే అద్భుతాలు కళ్లముందు కదలాడుతాయి. సినిమాల్లో ఓకే. నిజ జీవితంలో స్పైడర్ మ్యాన్ లాంటి జీవులు ఉన్నాయా? అంటే.. అవును అనే సమాధానం వినిపిస్తుంది. స్పైడర్ మ్యాన్ లాంటి జీవులు తూర్పు ఆఫ్రికాలో కనిపిస్తాయి. ఇవి రాళ్ల నడుమ తమ జీవితాన్ని గడుపుతాయి. ఇంతకీ, వీటి ప్రత్యేకత ఏంటంటే..
తూర్పు ఆఫ్రికాలోని రాళ్లపై నిజ జీవిత స్పైడర్ మ్యాన్లు ఆయా ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఇవి సూపర్ హీరో స్పైడర్ మ్యాన్ మాదిరిగానే ఉంటాయి. వీటిని మ్వాన్జా ఫ్లాట్ హెడెడ్ రాక్ అగామా అని పిలుస్తారు. ఇవి చూడ్డానికి తొండల మాదిరిగా ఉంటాయి. కానీ, అచ్చం స్పైడర్ మ్యాన్ లాంటి రంగులతో ఆకట్టుకుంటాయి. నిజం చెప్పాలంటే మన దగ్గర కనిపించే తొండల మాదిరిగానే ఉన్నా, రంగులు మాత్రం స్పైడర్ మ్యాన్ లా ఉంటాయి. ఇవి టాంజానియాలోని మ్వాన్జా ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి సాధారణంగా రాళ్ల మీద కనిపిస్తాయి. రాళ్ల సందుల్లో జీవిస్తాయి. దాని రంగులు, ఆకారం స్పైడర్ మ్యాన్ కాస్ట్యూమ్ ను గుర్తు చేస్తాయి. వీటిని స్పైడర్ మ్యాన్ అగామా అని కూడా పిలుస్తారు.
⦿ రంగులు, డిజైన్: ఈ స్పైడర్ మ్యాన్ అగామా ఎరుపు, నీలం రంగులను కలిగి ఉంటుంది. ఇది స్పైడర్ మ్యాన్‌కు ఉన్న బ్లాక్ రెడ్ బ్లూ కాస్ట్యూమ్ ను పోలి ఉంటుంది. ఇది 2010లో వైరల్ అయిన ఫోటో వల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.
⦿ రాళ్లపై జీవనం: తూర్పు ఆఫ్రికాలోని రాకీ భూభాగాల్లో ముఖ్యంగా టాంజానియా, రొబెర్ట్ ఫాల్స్ ప్రదేశాల్లో ఈ జాతి రాళ్లపైనే జీవిస్తుంది. అవి చాలా వేగంగా రాళ్ల మీద ఎక్కి, దాక్కొని, పరిగెత్తి, అచ్చం స్పైడర్ మ్యాన్ లాగా వాల్ క్లైమ్బింగ్ చేస్తాయి. ప్రిడేటర్ల నుంచి తప్పించుకోవడానికి కాంఫ్లాజ్ చేస్తాయి.
Read Also: మరణం తర్వాత మీరు చెట్టుగా మారిపోవచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!
⦿ ఇవి 20 నుంచి 30 సెం.మీ వరకు పెరుగుతాయి. చిన్నగా ఉన్నా రాళ్లపై గట్టిగా పట్టుకుని ఉంటాయి.
⦿ వీటిని తొలుత మ్వాన్జా లేక్ చుట్టూ కనుగొన్నారు. కానీ, తూర్పు ఆఫ్రికాలోని ఇతర రాకీ ప్రాంతాల్లో కూడా ఉన్నాయి.
⦿ ఈ అగామాలు రాళ్లపై సూర్యరశ్మికి వెచ్చదనాన్ని గ్రహిస్తూ, కీటకాలు తిని జీవిస్తాయి. ఎక్కువగా ఎరుపు, నీలం రంగుల్లో ఉంటాయి కనిపిస్తాయి. మగ జీవులు 5 రంగుల్లోకి మారుతాయి. ఒత్తడికి గురైన సమయంలో రంగులు మార్చుకుంటాయి. ఆగ జీవులు గ్రే రంగులో ఉంటాయి.
Read Also: మరణానికి కొన్ని సెకన్ల ముందు.. ఇలా కనిపిస్తుందట.. పరిశోధనలో అబ్బురపరిచే విషయాలు వెల్లడి!