BigTV English

Viral News : లవ్ బ్రేకప్.. విమానం నుంచి దూకేసిన యువతి, చివరికి..

Viral News : లవ్ బ్రేకప్.. విమానం నుంచి దూకేసిన యువతి, చివరికి..

Viral News : ఆమె ఓ స్కైడైవర్. విమానంలో ఆకాశం అంచుల వరకు వెళ్లడం.. అక్కడి నుంచి దూకేయడం. గాల్లో ఎగిరిపోతుంటే ఆ ఆనందమే వేరే లెవెల్. బాడీలో హార్మోన్స్ రిలీజ్ అయి ఫుల్ కిక్ ఇస్తుంది ఆ స్కైడైవ్. భూమికి సమీపంలోకి రాగానే.. పారాచ్యూట్ ఓపెన్ చేసి సేఫ్‌గా ల్యాండ్ అవుతారు. మనదేశంలో ఇలాంటి స్కైడైవ్ తక్కువే కానీ.. విదేశాల్లో చాలామంది అది ఇష్టపడతారు. అలాంటి ఓ ఫేమస్ స్కైడైవర్.. 10వేల అడుగుల ఎత్తు నుంచి దూకేసి.. కిందపడి.. తలపగిలి చనిపోయింది. అయితే, ఆమె ప్రమాదవ శాత్తు చనిపోలేదని.. సూసైడ్ చేసుకుందని అంటున్నారు.


లవ్ బ్రేకప్‌తో…

యూకేకు చెందిన 32 ఏళ్ల జాడే డమారెల్ ఉదంతం ఇది. ఆమె ఇప్పటి వరకు 400లకు పైగా స్కై జంప్స్ చేశారు. ఈ ఏడాదిలోనే 80కి పైగా స్కైడైవ్స్ కంప్లీట్ చేశారు. 6 నెలల క్రితం 26 ఏళ్ల గుడ్ ఫెలోతో ఆమె లవ్‌లో పడ్డారు. అతను కూడా స్కైడైవరే. ఆ హ్యాబీనే వాళ్లిద్దరినీ కలిపింది. కలిసి ఉండేలా ఏకం చేసింది. స్కైడైవ్ చేసే ఎయిర్‌ఫీల్డ్‌కు దగ్గరలోనే ఇల్లు తీసుకుని ఉంటున్నారు. కలిసి స్కైడైవ్ చేసే వాళ్లు. అలా అలా ఆర్నెళ్లు ఫుల్ హ్యాపీస్. ఆ తర్వాత స్టార్టెడ్ ప్రాబ్లమ్స్. ఇటీవల వాళ్ల మధ్య గొడవలు జరుగుతున్నాయి. జాడే చనిపోవడానికి ముందు రోజు నైట్.. ఆమెతో బ్రేకప్ చేసుకున్నాడు గుడ్ ఫెలో. ప్రేమ విఫలంతో ఆ యువతి జీవితంపై విరక్తి పెంచుకుంది. అతని లేనిదే తాను బతికి ఉండలేనని డిసైడ్ అయింది. ఆ రాత్రి గుడ్ ఫెలో తన దారి తాను చూసుకుని వెళ్లిపోయాడు. జాడే మాత్రం రాత్రంతా ఏడుస్తూనే ఉంది. కట్ చేస్తే…


Also Read : పనిమనిషికి వీడ్కోలు వీడియో.. చూస్తే కన్నీళ్లు వస్తాయ్..

10వేల అడుగుల పైనుంచి దూకేసి..

ఆ మర్నాడు ఎప్పటిలానే స్కైడైవ్ చేసేందుకు ఫీల్డ్‌కు వచ్చింది. విమానంలో ఆకాశంలో 10,000 అడుగుల ఎత్తుకు చేరింది. ఎప్పటిలానే అక్కడి నుంచి దూసేసింది. కానీ, ఈసారి తెరుచుకోవాల్సిన పారాచ్యూట్ తెరుచుకోలేదే. అంత పైనుంచి దూసుకొచ్చి.. నేలను ఢీకొట్టి.. చనిపోయింది జాడే డమారెల్. మొదట ప్రమాదం అనుకున్నారు పోలీసులు. పారాచ్యూట్ తెరుచుకోలేదేమో అనుకున్నారు. చెక్ చేస్తే అందులో ఏం ప్రాబ్లమ్ లేదని తేలింది. ఆమె కావాలనే.. చనిపోవాలనే.. పారాచ్యూట్ ఓపెన్ చేయలేదని భావిస్తున్నారు. జాడే దగ్గర ఓ సూసైడ్ నోట్ కూడా దొరికింది. అందులో తన లవ్ బ్రేకప్ గురించి రాసుకొచ్చింది. అది ప్రమాదం కాదు, ఆత్మహత్య అని పోలీసులు దాదాపు నిర్థారణకు వచ్చారు. లవ్ ఫెయిల్యూర్‌తో, 10 వేల అడుగుల పైనుంచి దూకి చనిపోవడం అంటే.. ఎంత దారుణమైన మరణమో ఆమెది.

Related News

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Rules In Village: ఇదేం దిక్కుమాలిన నియమాలు.. వ్యక్తిని తాకితే రూ.5000 జరిమానా! ఎక్కడో తెలుసా?

Big Stories

×