BigTV English

Viral Video : పని మనిషి కాదు ఇంటి మనిషి.. ఈ వీడ్కోలు వీడియో చూస్తే కన్నీళ్లు వస్తాయ్!

Viral Video : పని మనిషి కాదు ఇంటి మనిషి.. ఈ వీడ్కోలు వీడియో చూస్తే కన్నీళ్లు వస్తాయ్!

Viral Video : ఈ రోజుల్లో అంతా కమర్షియల్. బంధాలు, బంధుత్వాలు, ప్రేమ, ఆప్యాయతలు తగ్గిపోతున్నాయి. కుటుంబ సభ్యులే కొట్లాడుకునే పరిస్థితులు ఉన్నాయి. మనుషుల్లో అహంకారం విపరీతంగా పెరిగిపోతోంది. ఇగోతో ఇచ్చిపడేస్తున్నారు అంతా. ఇలాంటి కాలంలో ఓ కుటుంబం చేసిన పనికి అంతా ఫిదా అవుతున్నారు. ఫ్యామిలీ అంటే అది. మంచి మనుషులంటే వాళ్లు అంటూ శెభాష్ అంటున్నారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చూసిన వాళ్లతో కన్నీళ్లు పెట్టిస్తోంది.


వీడియోలో ఏముందంటే…

సోఫాలో ఓ అమ్మాయి కూర్చొని ఉంది. ఆమెకు ఓ మహిళ బొట్టు పెట్టింది. నోరు తీపి చేసింది. చేతిలో చీరలు, జాకెట్లు, డ్రెస్సులు పెట్టింది. డబ్బులు కూడా ఇచ్చారు. ఆ ఇంట్లోని వాళ్లంతా ఆమె చుట్టూ చేరారు. ఆ యువతిని గుండెలకు హత్తుకున్నారు. ముద్దులు పెట్టారు. ఓ చిన్న పిల్లాడిని ఆ యువతి ఎత్తుకుని ముద్దు చేస్తోంది. ఆ పిల్లాడు ఏడుస్తుంటే ఆడిస్తోంది. ఏడుపు ఆపుకోలేక ఆ యువతి కన్నీళ్లు పెట్టుకుంది. ఇదీ ఆ వీడియోలు ఉంది. ఆ యువతి ఎవరో తెలిస్తే.. మనకూ కన్నీళ్లు ఆగకపోవచ్చు. ఎందుకంటే ఆమె ఆ ఇంటి పని మనిషి. ఆమెకు చీర, సారె పెట్టి.. పుట్టింటివాళ్ల వలె ఆదరించింది ఆ ఇంటి కుటుంబం. అది నిజంగా అద్భుతం.


పనిమనిషి కాదు సొంతమనిషి..

పని మనిషి అంటే చాలా చీప్‌గా చూస్తుంటారు చాలామంది. డబ్బులిస్తున్నాం.. పని చేస్తుంది.. ఇంకేంటి అంటూ ఎలాంటి ఎమోషన్స్ చూపించరు. ఓనర్స్‌కు పనిమనిషికి మధ్య అంతగా అటాచ్‌మెంట్ ఉండదు. కానీ, ఆ కుటుంబం అలా కాదు. పని పిల్ల ముస్కాన్‌ను సొంత ఇంటి మనిషిలానే చూసుకున్నారు వాళ్లు. చాలా కాలంగా ఆ ఇంట్లో పని చేస్తోంది. ఇంటి మనిషిలా కలిసిపోయింది. ఓనర్స్‌కు చిన్న పిల్లాడు కూడా ఉన్నాడు. ఆ బాబును లాలించి, ఆడించడం కూడా చేసేది. పనిమనిషిలా కాకుండా.. సొంత బిడ్డలా ఆ ఫ్యామిలీతో మింగిల్ అయిపోయింది. కానీ….

Also Read : పెళ్లికొడుకు తలపై కొబ్బరి బొండాం పగలగొట్టి.. ఇదేం ఆచారంరా అయ్యా..

ఎమోషనల్ వీడియో..

ఆ యువతికి ఈ మధ్యే పెళ్లి సెటిల్ అయింది. అబ్బాయిది వేరే ఏరియా. పెళ్లి తర్వాత ఇక్కడి నుంచి అత్తారింటికి షిఫ్ట్ అయిపోవాలి. ఆ సమయం రానే వచ్చింది. ముస్కాన్‌కు ఆ ఇంట్లో అదే ఆఖరి రోజు. మర్నాటి నుంచి పనికి రాలేదు. భవిష్యత్తులో కలుస్తుందో లేదో కూడా తెలీదు. లాస్ట్ డే ఆ ఇల్లు గంభీరంగా మారింది. ఇన్నాళ్లు పని మనిషిగా, ఇంటి మనిషిగా ఉన్న ముస్కాన్‌ను ఘనంగా వీడ్కోలు పలికింది ఆ కుటుంబం. బిడ్డను అత్తారింటికి పంపించినట్టే.. బొట్టు పెట్టి, బట్టలు పెట్టి, డబ్బులు ఇచ్చి.. తమ అనుబంధాన్ని, ఆప్యాయతను చాటుకున్నారు. ఆ ఇంటి యజమానుల ప్రేమకు.. పని మనిషి కంట ఆనంద భాష్పాలు రాలాయి. ఆ వీడ్కోలు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే.. లక్షల్లో లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి. ఆ ఇంటి యజమానులను అభినందిస్తున్నారు నెటిజన్స్. తమ ఇంటి పని మనుషులతో తమకున్న రిలేషన్‌ను పంచుకుంటున్నారు మరికొందరు. ఆ వీడియో హార్ట్ టచ్చింగ్‌గా ఉంది. ఆ ఎమోషనల్ మూమెంట్‌ను చూసి తీరాల్సిందే..

?utm_source=ig_embed

Related News

Python Video: అమ్మ బాబోయ్..! భారీ కడుపుతో కొండచిలువ.. కాసేపటికే కక్కేసింది.. వీడియో చూస్తే..?

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Big Stories

×