BigTV English

Viral News: మాజీ లవర్ పై రివేంజ్ తీర్చుకున్న యువతి.. వామ్మో, పిజ్జానే ఆయుధం..

Viral News: మాజీ లవర్ పై రివేంజ్ తీర్చుకున్న యువతి.. వామ్మో, పిజ్జానే ఆయుధం..

Viral News: వాలంటైన్స్ డే రోజు చిత్రవిచిత్రాలకు నిలయంగా మారింది. ప్రేమికుల్లో ఈ ప్రేమికులు వేరయా అనే తరహాలో వరుస ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకరు బాయ్ ఫ్రెండ్ ఫోన్ లిఫ్ట్ చేయలేదని పోలీసులకు ఫోన్ చేస్తే, మరొకరు తన మాజీ బాయ్ ఫ్రెండ్ కి భారీ షాకిచ్చారు. ప్రేమికుల రోజు ఏమో కానీ, ప్రేమికుల వేధింపుల రోజుగా మారిందని నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ ను బట్టి ప్రేమికుల రోజును ప్రేమికులు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చెప్పవచ్చు. లవ్ ఫెయిల్యూర్ చెందిన వారి పరిస్థితి చూస్తే మాత్రం ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. మరికొందరు మాజీ బాయ్ ఫ్రెండ్ పై ఉన్న పగను పలు రూపాలలో బయటికి వ్యక్తం చేస్తున్నారు. అలాంటిదే ఓ ఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.


ఓ ప్రియురాలు తన మాజీ బాయ్ ఫ్రెండ్ కు లవర్స్ డే రోజు పెద్ద షాకివ్వాలని నిర్ణయించుకుంది. అలా అనుకున్నదే తడవుగా ఆమె మదిలో ఒక ఆలోచన వచ్చింది. అది కూడ తన మాజీ బాయ్ ఫ్రెండ్ తిక్క కుదర్చాలని అనుకుందో ఏమో కానీ, ఆమె చేసిన నిర్వాకానికి పెద్ద గొడవే జరిగిందట. ఎక్కడ జరిగిందో తెలియదు కానీ, ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వాలంటైన్స్ డే రోజు ఉదయాన్నే తన మాజీ ప్రియుడి ఇంటికి ఏకంగా 100 పిజ్జాలను యువతి ఆర్డర్ చేసింది.

ఆర్డర్ కూడ ఎలా చేసిందంటే.. మొత్తం క్యాష్ ఆన్ డెలివరి ఆప్షన్ తో ఆర్డర్ చేసింది. 100 పిజ్జాలు తీసుకొని డెలివరీ బాయ్, మాజీ ప్రియుడు ఇంటికి వెళ్లాడు. అలా వెళ్లి 100 పిజ్జాలు ముందు ఉంచాడు డెలివరీ బాయ్. షాక్ కు గురైన ప్రియుడు.. తాను ఆర్డర్ చేయలేదని డెలివరీ బాయ్ తో చెప్పాడు. మీ ఇంటి అడ్రస్ కే ఆర్డర్ పెట్టారని, తనకు డబ్బులు చెల్లించాల్సిందేనని డెలివరీ బాయ్ పట్టుబట్టాడు. ఇంతకు ఎవరు ఆర్డర్ చేశారో తెలుసుకున్న మాజీ ప్రియుడు.. అసలు విషయం తెలుసుకొని అవాక్కయ్యాడు.


Also Read: లవర్స్ డే ఎఫెక్ట్.. యువతి నెంబర్ బ్లాక్ చేసిన లవర్.. మైండ్ బ్లాంక్ అయ్యే పని చేసిన యువతి

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండీగా మారింది. ప్రేమికుల రోజు గుర్తుండి పోయేలా ఉండాలని ఆ మాజీ ప్రియురాలు, మాజీ ప్రియుడికి భలే షాకిచ్చిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తం మీద ప్రేమికుల రోజును.. ప్రేమికుల వేధింపుల రోజుగా మార్చారని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ప్రేమికుల రోజు నాడు వరుసగా వెలుగులోకి వస్తుండగా, అంతా ప్రేమ లీలలు అంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. అయితే కొందరు లవర్స్ మాత్రం, గప్ చుప్ సాంబార్ బుడ్డిలా విషెస్ చెప్పుకుంటుండగా మరికొందరు మాత్రం కేకులు కట్ చేస్తూ తమ ప్రేమను చాటి చెబుతున్నారు. ఓ వైపు ప్రేమలు, మరోవైపు ప్రేమ లీలలు అన్నీ కలగలిపి ప్రేమికుల రోజు కొందరికి తియ్యగా ఉంటే, మరికొందరికి చేదుగా ఉందన్న భావన కూడ వినిపిస్తోంది.

Related News

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Rules In Village: ఇదేం దిక్కుమాలిన నియమాలు.. వ్యక్తిని తాకితే రూ.5000 జరిమానా! ఎక్కడో తెలుసా?

Street Food: నూనె ప్యాకెట్ కట్ చేయకుండా నేరుగా.. ఇక్కడ బజ్జీలు తింటే పాడెక్కడం ఖాయం!

Big Stories

×