Ghee For Weight Gain: నెయ్యి (Ghee) భారతీయ వంటగదిలో ఒక ముఖ్యమైన భాగం. నెయ్యిలో అనేక ఔషధాలు ఉంటాయి. నెయ్యి తినడం వల్ల బరువు (Weight) పెరుగుతుందని భావించి చాలా మంది నెయ్యి తినకుండా ఉంటారు . ఇందులో ఎంత నిజం ఉంది ? నెయ్యి తినడం వల్ల నిజంగానే బరువు పెరుగుతారా ? ప్రతి రోజు నెయ్యి తింటే ఏం జరుగుతుందనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
నెయ్యి తినడం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు:
శరీర శక్తిని పెంచుతుంది: నెయ్యిలో ట్రైగ్లిజరైడ్స్ (MCTలు) ఉండటం వల్ల ఇది తక్షణ శక్తికి మూలంగా చెబుతారు. నెయ్యి తినడం వల్ల కష్టపడి పనిచేసేవారికి, అథ్లెట్లకు, పిల్లలకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మీ శరీరానికి తక్షణ శక్తిని కూడా ఇస్తుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: నెయ్యిలో బ్యూట్రిక్ ఆమ్లం ఉంటుంది. ఇది పేగు పొరను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతే కాకుండా జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. ఆయుర్వేదంలో ఇది జీర్ణశక్తిను పెంచుతుందని భావిస్తారు.
చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది: నెయ్యిలో ఉండే విటమిన్ ఎ, డి, ఇ, కె చర్మానికి తేమను అందిస్తాయి. అంతే కాకుండా జుట్టును బలంగా ,మెరిసేలా చేస్తాయి.
మెదడు ఆరోగ్యాన్ని పెంచుతుంది: ఆయుర్వేదం ప్రకారం నెయ్యి తినడం వల్ల మెదడు పనితీరును మెరుగుపడుతుంది. అంతే కాకుండా జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. ఇది మానసిక ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది: నెయ్యిలో యాంటీఆక్సిడెంట్లు , ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
ఎముకల బలాన్ని పెంచుతుంది: నెయ్యి కీళ్ల సరళతకు సహాయపడుతుంది. అంతే కాకుండా ఎముకలను కూడా బలంగా చేస్తుంది.
నెయ్యి తినడం వల్ల కలిగే నష్టాలు:
నెయ్యిలో అధిక కేలరీలు, కొవ్వు ఉండటం వల్ల ఎక్కువగా తిన్నా కూడా బరువు పెరగడం జరుగుతుంది.
నెయ్యిలో సంతృప్త కొవ్వు ఉంటుంది. అధికంగా తీసుకుంటే అది చెడు కొలెస్ట్రాల్ (LDL) ను పెంచుతుంది. అంతే కాకుండా గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
గుండె సమస్యలు ఉన్న వారు నెయ్యి అధికంగా తీసుకోవడం వల్ల సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
నెయ్యిని అధికంగా తీసుకోవడం వల్ల కొంతమందిలో అజీర్ణం, కడుపు నొప్పి లేదా విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి.
Also Read: కొబ్బరి నూనె ఇలా వాడితే.. మచ్చలేని చర్మం
ఎంత నెయ్యి తినాలి ?
ఆరోగ్యకరమైన వ్యక్తి రోజుకు 1-2 టీస్పూన్ల నెయ్యి సరిపోతుంది. శారీరకంగా చురుకుగా ఉండే వ్యక్తులకు లేదా వ్యాయామం చేసే వారికి ఈ పరిమాణం కొంచెం ఎక్కువగా తీసుకున్నా కూడా ప్రమాదం లేదు. పోషకాహారం తీసుకుంటే నెయ్యి తింటే ప్రమాదం ఏమీ ఉండదు.
నెయ్యి వల్ల బరువు పెరగడం (Weight Gain)లేదా తగ్గడం అనేది పూర్తిగా తినే పరిమాణం, శారీరక శ్రమలపై ఆధారపడి ఉంటుంది. నెయ్యిని తగిన పరిమాణంలో తీసుకున్నప్పుడే దాని ప్రయోజనాలు లభిస్తాయి. ఇది జీర్ణక్రియ, చర్మం, జుట్టు, మెదడు, రోగనిరోధక వ్యవస్థకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. నెయ్యిని అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే పరిమిత పరిమాణంలో , సమతుల్య పద్ధతిలో మీ ఆహారంలో చేర్చుకోండి.