Girlfriend Shocks Boyfriend: అసలే లవర్స్ డే.. ప్రియుడు, ప్రియురాలు తప్పక కలిసే రోజు ఇది. ఒకరికి ఒకరు ఎంత ప్రాణమో మనసువిప్పి మాట్లాడుకొనే రోజుగా ప్రాచుర్యం పొందింది. అయితే ఓ ప్రియురాలు వాలంటైన్స్ డే రోజు ఇచ్చిన షాక్ కు ఆ ప్రియుడికి దిమ్మతిరిగింది. ఇంతకు ఆ ప్రియురాలు ఏం చేసిందో మీరు తెలుసుకుంటే.. ఔరా.. ఎంత ఘాటు ప్రేమయో అనేస్తారు. ఈ ఘటన ఏపీలో వాలంటైన్స్ డే రోజు జరిగింది.
ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే జరుపుకుంటారు. అదేనండీ ప్రేమికుల రోజుగా పిలువబడుతోంది. కొందరు పెద్దలను ఎదిరించలేక మూగ ప్రేమతో శుభాకాంక్షలు తెలుపుకుంటుంటారు. మరికొందరు ఏకాంతంగా కలిసి తమ మనసులోని ప్రేమను బయటికి వ్యక్తం చేస్తారు. అంతేకాదు గిఫ్ట్ లు, పూలు ఇలా ఒకటేమిటి ఆ కానుకల తీరే వేరయా అని చెప్పవచ్చు. అయితే ప్రియుడు, ప్రియురాలికి ఈ రోజు ఎంతో ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు. ఎంత ఘాటు ప్రేమ ఉన్నా, ఈరోజు ప్రేమికులు కలవకపోతే, ఆ ప్రేమకే అర్థం ఉండదని అంటారు లవర్స్.
అందుకే వాలంటైన్స్ డేను పురస్కరించుకొని శుక్రవారం నెట్ వర్క్ లు కూడ జామ్ అయ్యే రీతిలో కాల్స్ సాగాయని టాక్. పెద్దల అంగీకారం ఉన్న ప్రేమలకు ఏ ఇబ్బందులు ఉండవు. అదే సైలెంట్ ప్రేమలకే ఇప్పుడు అసలు చిక్కు. ఇలా ఓ ప్రియుడు తన ఇంట్లో ఉండి, ఫోన్ లిఫ్ట్ చేయలేదేమో కానీ, ఓ ప్రియురాలు మాత్రం ఫోన్ల మీద ఫోన్లు చేసింది. చివరికి తన లవర్ ఫోన్ నెంబర్ బ్లాక్ చేస్తే, ఆ ప్రియురాలు చేసిన పనికి లవర్ తో పాటు పోలీసులు కూడ షాక్ కు గురయ్యారు. ఈ ఘటన అనంతపురం జిల్లా గుత్తి లో జరిగింది.
బాయ్ ఫ్రెండ్ కు కాల్ చేసి లవర్స్ డే శుభాకాంక్షలు చెప్పాలని ఓ యువతి భావించింది. కానీ కాల్స్ చేస్తే బాయ్ ఫ్రెండ్ నుండి ఎటువంటి సమాధానం లేదు. అంతేకాకుండ తన విషయం ఇంట్లో తెలుస్తుందని భావించాడో ఏమో కానీ, బాయ్ ఫ్రెండ్ తన లవర్ నెంబర్ ను బ్లాక్ చేశాడు. ఇక అంతే యువతికి కోపం కట్టలు తెచ్చుకుంది. ఏకంగా ఆ యువతి డయల్ 100 కు ఫోన్ చేసి మరీ, తన బాయ్ ఫ్రెండ్ ఫోన్ బ్లాక్ లిస్ట్ లో పెట్టినట్లు ఫిర్యాదు చేసిందట.
Also Read:చిన్నారి ప్రేమకు జీ హుజూర్.. వాలంటైన్స్ డే రోజు తెగ వైరల్ అవుతోంది
ఇదెక్కడి గోల అనుకున్న పోలీసులు.. ఆ యువతి వద్దకు వెళ్లి అసలు విషయం ఏమిటని ఆరా తీశారు. ఆ యువతి ఎలా గోలా తన బాయ్ ఫ్రెండ్ నెంబర్ అన్ బ్లాక్ చేసేలా చేయాలని ప్రాధేయపడింది. దీనితో పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు సలహా ఇచ్చారట. ఈ విషయం బయటకు పొక్కడంతో.. ఎంత ఘాటు ప్రేమయో అంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు. మొత్తం మీద లవర్స్ డే రోజు ఆ యువతి ఇచ్చిన షాక్ కు బాయ్ ఫ్రెండ్ ఖంగుతిన్నాడు. మరి ఇప్పటికైనా అన్ బ్లాక్ చేశాడో లేదో!