BigTV English

Telugu Cinema : ‘నెక్ట్స్ టార్గెట్ నువ్వేరా’… హైపర్ ఆదిపై ఫోకస్ షిప్ట్ అయిందా..?

Telugu Cinema : ‘నెక్ట్స్ టార్గెట్ నువ్వేరా’… హైపర్ ఆదిపై ఫోకస్ షిప్ట్ అయిందా..?

Telugu Cinema : ఇటీవల కాలంలో సినిమా వేదికలపై రాజకీయాల గురించి మాట్లాడడమే ఎక్కువగా వినిపిస్తోంది. సినిమాను సినిమాలా కాకుండా, రాజకీయాల కోసం వాడుకోవడం, రాజకీయాల్లో సినిమాల ప్రస్తావన రావడం అనేది ఎప్పటికప్పుడు వివాదాస్పదం అవుతూనే ఉంది. తాజాగా ‘లైలా’ (Laila Movie) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో 11 మేకల కామెంట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టార్గెట్ అయ్యాడు కమెడియన్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ (Pridhviraj). ఈ నేపథ్యంలోనే తాజాగా మరో కమెడియన్ హైపర్ ఆది (Hyper Aadi) టార్గెట్ అవుతున్నాడు. మరి ఆయనను టార్గెట్ చేయడానికి కారణం ఏంటి? అనే వివరాల్లోకి వెళితే…


నెక్స్ట్ టార్గెట్ నువ్వే… హైపర్ ఆదికి వార్నింగ్

సోషల్ మీడియా వేదికగా “నెక్స్ట్ టార్గెట్ నువ్వే… ఈసారి స్ట్రాంగ్ గా ఇస్తాం నీకు” అంటూ హైపర్ ఆదికి వార్నింగ్ మెసేజ్ లు పోస్ట్ చేస్తున్నారు కొంత మంది. గతంలో హైపర్ ఆది కామెంట్స్ చేసిన వీడియోను ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. ఆ వైరల్ వీడియోలో హైపర్ ఆది కూడా అచ్చం పృథ్వీలాగే 11 మంది అంటూ సెటైర్స్ పేల్చాడు. ‘కమిటీ కుర్రోళ్ళు’ మూవీ ఈవెంట్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.


ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా హైపర్ ఆది మాట్లాడుతూ “నిహారిక వాళ్ళ బాబాయ్ గారిలాగే… ట్రెండ్ ఫాలో అవ్వదు, సెట్ చేస్తుంది. అందుకే ఏకంగా 11 మంది హీరోలని పెట్టి సినిమా తీసింది. రీసెంట్ గా 11 మంది క్రికెటర్లు మన దేశానికి వరల్డ్ కప్ తెచ్చినట్టు, ఈ 11 మంది హీరోలు నిహారికకు మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను. మనకు 11 అంటే చాలా గుర్తొస్తాయి… కానీ ఈ సినిమా తర్వాత మాత్రం ఈ హీరోలే గుర్తుకు వస్తారు. అదైతే నేను నమ్ముతాను” అంటూ హైపర్ ఆది కామెంట్స్ చేసిన వీడియోలు అవుతున్నాయి.

దిగివచ్చిన 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ…

ఇక లైలా మూవీ ఈవెంట్ లో 11 మేకల కామెంట్లతో వివాదంలో చిక్కుకున్నారు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ. ఆయన కామెంట్స్ వల్ల వివాదం చెలరేగడంతో చిత్ర నిర్మాత, హీరో వచ్చి క్షమాపణలు చెప్పారు. అయినప్పటికీ రోజు రోజుకూ వివాదం ముదురుతుండడంతో ఆసుపత్రి పాలైన ఆయన సైబర్ క్రైమ్ కి కంప్లైంట్ ఇచ్చాడు. ఆ తర్వాత తగ్గక తప్పలేదు. ఫిబ్రవరి 13న సాయంత్రం స్పెషల్ వీడియోను రిలీజ్ చేసి అందులో సినిమాను సినిమాగా చూడాలని కోరారు. తను చేసిన కామెంట్ల కారణంగా ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే అందరికీ క్షమాపణలు చెబుతున్నాను అన్నారు. “లైలా’ మూవీని బాయ్ కాట్ చేయొద్దు వెల్కమ్ చేయండి” అని రిక్వెస్ట్ చేశారు. అయినప్పటికీ మూవీ డిజాస్టర్ అయ్యింది.

అయితే ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఇలాంటి బెదిరింపులు ఎక్కువవుతున్నాయి. అసలు సినిమాలతో రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి సోషల్ మీడియాలో ఇలాంటివి తగ్గాలి. అంతేకాకుండా ‘లైలా’ మూవీ డిజాస్టర్ కావడానికి కారణం డైరెక్టర్. సినిమా కథ, కథనం వల్లే డిజాస్టర్ అయ్యాయి. అంతేతప్ప “బాయ్ కాట్ లైలా” ట్రెండ్ ఎఫెక్ట్ అయితే కాదని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×