E-Paper
Advertisement

Viral News: పక్క సీట్లో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ఆర్యా స్టార్క్.. పట్టించుకోని భారతీయ యువకుడు, దాని ఫలితం ఇది!

Viral News: పక్క సీట్లో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ఆర్యా స్టార్క్.. పట్టించుకోని భారతీయ యువకుడు, దాని ఫలితం ఇది!
Advertisement

కొన్ని విషయాలు చెప్తుంటే అచ్చం సినిమా స్టోరీని తలపిస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీ కూడా సినిమా కథకు ఏమాత్రం తీసిపోదు. జర్మన్ మెట్రోలో ఒక భారతీయ యువకుడు ప్రయాణం చేస్తున్నాడు. అతడిలో ఏదో తెలియని టెన్షన్ కనిపిస్తోంది. ఇబ్బందిగా కూర్చున్నాడు. ఇంతలోగా ఓ స్టేషన్ లో మెట్రో ఆగింది. ఒక అందమైన అమ్మాయి లోపలికి వచ్చింది. అతడి పక్కనే కూర్చుంది. ఆ అమ్మాయి.. అతడు తనను గుర్తు పడతాడని అనుకుంటుంది. కానీ, ఆమె వైపు కనీసం కన్నెత్తి చూడడు. సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు ఆ ఇండియన్ కుర్రాడి లైఫ్ పూర్తిగా మారిపోయింది.

ఇంతకీ అసలు ఏం జరిగిదంటే?

మెట్రోలో ప్రయాణించే భారతీయ యువకుడి పక్కన కూర్చున్న ఆ అమ్మాయి మరెవరో కాదు. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్‌’లో ఆర్య స్టార్క్ పాత్రలో నటించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి మైసీ విలియమ్స్. విచారంగా కనిపించే భారతీయ యువకుడు, ప్రపంచ ప్రఖ్యాత నటి కలిసి కూర్చున్న ఫోటో జర్మనీ అంతటా వైరల్ అయింది. ఇంతకీ ఆ ఇండియన్ కుర్రాడు ఎవరు? అని సోషల్ మీడియా అంతా మార్మోగిపోయింది. ఆ యువకుడి కోసం ఆరా తీయడం మొదలయ్యింది.

ఆ కుర్రాడు ఎవరో గుర్తించిన జర్మన్ మ్యాగజైన్!

Advertisement

ప్రసిద్ధ జర్మన్ మ్యాగజైన్ డెర్ స్పీగెల్ ఆ ఇండియన్ కుర్రాడి గురించి వెతకడం ప్రారంభించింది. చాలా రోజుల గాలింపు తర్వాత అతడిని మ్యూనిచ్‌ లో గుర్తించింది. ఆ సమయంలో సదరు యువకుడి గురించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ యువకుడు జర్మనీలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్నాడు. నివాస అనుమతి లేదు. డబ్బు లేదు. టికెట్ లేకుండా ప్రతిరోజూ మెట్రోలో అక్రమంగా ప్రయాణించేవాడు.

జర్నలిస్ట్ ప్రశ్నకు ఊహించని సమాధానం  

ఆ కుర్రాడిని గుర్తించిన తర్వాత డెర్ స్పీగెల్ జర్నలిస్టు ఓ ప్రశ్న అడిగాడు. “నీ పక్కన కూర్చున్న అమ్మాయి మైసీ విలియమ్స్ అని నీకు తెలుసా? ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ లోని ఆర్య స్టార్క్ పాత్ర పోషించిందని తెలుసా? లక్షలాది మంది ఆమెతో ఫోటో దిగాలని కలలు కంటారు.  కానీ నువ్వు అస్సలు స్పందించలేదు ఎందుకు?” అన్నాడు. ఆ యువకుడు చెప్పిన సమాధానం విని సదరు జర్నలిస్టు షాకయ్యాడు. “నీ జేబులో ఒక్క యూరో కూడా లేనప్పుడు, నివాస అనుమతి లేనప్పుడు, నువ్వు ప్రతి రోజూ టికెట్ లేకుండా మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు, నీ పక్కన ఎవరు కూర్చున్నారనేది ముఖ్యం కాదు” అని చెప్పుకొచ్చాడు.

ఆ కుర్రాడి జీవితాన్ని మార్చిన ఘటన

Advertisement

ఆ భారతీయుడి నిజాయితీ నచ్చి.. డెర్ స్పీగెల్ మ్యాగజైన్ అతడికి 800 యూరోల సాలరీతో పోస్ట్‌ మ్యాన్‌ గా జాబ్ ఇచ్చింది. ఈ ఉద్యోగ ఒప్పందం అతని జీవితాన్ని కీలక మలుపు తిప్పింది. ఆ తర్వాత అతడికి సాధారణ నివాస అనుమతి లభించింది. ఈ మొత్తం సంఘటన ఓ అనామక కుర్రాడి జీవితాన్ని మార్చేసింది. ఎవరి జీవితం ఎలా మలుపుతిప్పుతుందో చెప్పడం కష్టం అనే విషయాన్ని నటి మైసీ విలియమ్స్ మెట్రో జర్నీ నిరూపించింది.

Read Also: కష్టపడ్డ.. రూ. 65 లక్షల కూపర్ కొన్న.. వైరల్ అవుతున్న టెక్కీ ఇన్ స్టా పోస్ట్!

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×