ఈ రోజుల్లో చాలా మంది యువత క్రియేటివ్ గా ఆలోచించి సరికొత్త వీడియోలను రూపొందిస్తున్నారు. కొంత మంది ఫ్రాంక్ వీడియోలు ట్రై చేస్తుంటే.. మరికొంత మంది ఫన్నీ వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. వాటిని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి లక్షల వ్యూస్ సాధిస్తున్నారు. మరికొంత మంది ఓవర్ నైట్ స్టార్లుగా మారిపోతున్నారు. తాజాగా ఓ యువకుడు తన తల్లితో చెప్పి ముచ్చట, ఆ విషయం విని తను ఇచ్చిన రియాక్షన్ నెట్టింట వైరల్ అవుతోంది.
సినిమాలో అవకాశం వచ్చిందన్న అశ్విన్
అశ్విన్ ఉన్ని అనే క్రియేటర్ తన రూమ్ లో కూర్చొని తల్లి రమ్మని పిలుస్తాడు. ఆమె వచ్చిన తర్వాత, కుర్చీలో కూర్చోబెట్టి, తను ఆమె వెనుకే నిలబడి ఉంటాడు. ఆ తర్వాత ఆమెకు ఓ విషయం చెప్తాడు. తనకు ఓ సినిమాలో నటించే అవకాశం వచ్చిందటాడు. అతడు చెప్పిన మాట విని ఫుల్ హ్యాపీగా ఫీలవుతుంది. ఆ తర్వాత నిజంగానే ఆఫర్ వచ్చిందా? అని అడుగుతుంది. నిజంగానే వచ్చిందని చెప్తాడు. రెమ్యునరేషన్ రూ. 3 లక్షలు ఇస్తామని చెప్పారంటాడు. ఆమె కొడుకును దగ్గరికి తీసుకుని ముద్దుపెడుతుంది.
అసలు విషయం తెలిసి అవాక్కైన అశ్విన్ మదర్
తనకు సినిమాలో అవకాశం వచ్చిన మాట వాస్తవం అని, అయితే అది నీలిచిత్రం అని చెప్తాడు అశ్విన్. అతడు చెప్పిన మాట విని ఆమె షాక్ అవుతుంది. ఆమె ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ నెటిజన్లను బాగా ఆకట్టుకున్నాయి. వెంటనే అతడిపై చిరాకు పడుతూ “ఇలాంటి విషయాలు ఎవరైనా పేరెంట్స్ కు చెప్తారా?” అంటూ సీరియస్ అవుతుంది. “తాను నటించడం లేదని, జస్ట్ ఆఫర్ వచ్చిన విషయాన్ని చెప్తున్నాను” అనడంతో ఆమె అక్కడి నుంచి చిరాకు పడుతూ వెళ్లిపోతుంది. ఆ తర్వాత తనకు అడల్ట్ మూవీలో నటించాలంటూ వచ్చిన ఆఫర్ మెసేజ్ ను చూపిస్తాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే?
అశ్విన్ షేర్ చేసిన వీడియోకు పెద్ద సంఖ్యలో లైకులు, షేర్లు వస్తున్నాయి. అదే సమయంలో కొంత మంది నెగెటివ్ గా కామెంట్స్ చేస్తుంటే, మరికొంత మంది ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. “తల్లితో ఎవరైనా ఇలాంటి విషయాలు చెప్తారా?” అంటూ ఓ నెటిజన్ కోప్పడగా, “నిజంగానే ఆఫర్ వచ్చిందా?” అంటూ మరో వ్యక్తి క్యూరియాసిటీతో అడిగేశాడు. “అశ్విన్ మదర్ నిజమైన ఇండియన్ మదర్ లా వ్యవహరించింది” అంటూ ఇంకో వ్యక్తి కామెంట్ చేశాడు. “ఆఫర్ రిజెక్ట్ చేసిన మంచి పని చేశావు” అని వ్యక్తి కామెంట్ పెట్టగా, “ఆఫర్ రాగానే నువ్ ఎలా ఫీలయ్యావు?” అంటూ మరో నెటిజన్ అడిగాడు. ప్రస్తుతం ఈ వీడియోకు నెటిజన్ల నుంచి రకరకాల కామెంట్స్ వస్తున్నాయి.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">
Read Also: ‘డిజిటల్ కండోమ్’.. భయం లేని ఏకాంతం కోసం సరికొత్త యాప్!