E-Paper
Advertisement

Netflix’s Moments Feature : దిమ్మతిరిగే ఫీచర్ తీసుకొచ్చిన నెట్​ఫ్లిక్స్ – ఇకపై వాటి షేరింగ్ డబుల్ ఈజీ

Netflix’s Moments Feature : దిమ్మతిరిగే ఫీచర్ తీసుకొచ్చిన నెట్​ఫ్లిక్స్ – ఇకపై వాటి షేరింగ్ డబుల్ ఈజీ
Advertisement

Netflix’s Moments Feature : సోషల్ మీడియా ప్లాట్​ఫామ్స్​ ఇన్​స్టా గ్రామ్, స్నాప్ చాట్​, ఫేస్​బుక్​, వాట్సాప్, యూట్యూబ్ షార్ట్స్​ లేదా ఇతర ఏదైనా మెసేజింగ్​ అప్లికేషన్స్​ లేదా మ్యూజిక్ వీడియో ప్లాట్​ఫామ్​లో మనకు నచ్చిన కంటెంట్​ లేదా రీల్​, క్లిప్​ను షేర్​ చేసుకుంటుంటాం. ఇతర ఫ్లాట్​ఫామ్స్​ను ఉపయోగించుకుని వాటిని డౌన్​లేడ్​ లేదా సేవ్ చేసుకుని వాటిని మన ఫ్రెండ్స్ లేదా ప్యామిలీకి షేర్ చేస్తుంటాం. ఇప్పుడు అలా సేవ్ చేసుకుని షేర్ చేసుకునే అవకాశాన్ని యూజర్స్​కు కల్పిస్తోంది నెట్​ఫ్లిక్స్​. ఇందుకోసం ఓ కొత్త ఫీచర్​ను ఇంట్రడ్యూస్ చేసింది.

ఇంతకీ ఏంటా ఫీచర్​ –

Advertisement

నెట్​ఫ్లిక్స్​ గురించి మూవీ లవర్స్​కు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓటీటీ లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో పాపులర్ సంస్థ ఇది. అయితే ఇప్పుడీ నెట్​ఫ్లిక్స్.. న్యూ​ మూమెంట్స్​ అనే పేరుతో ఓ ఫీచర్​ తీసుకొచ్చింది. ఇది కేవలం నెట్​ఫ్లిక్స్​ మొబైల్​ యాప్​లో మాత్రమే అందుబాటులో ఉంది. అది కూడా ఈ స్ట్రీమింగ్ సర్వీస్​ను ఉపయోగిస్తున్న ఐఓఎస్​ యూజర్స్​కు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఇకపై ఆండ్రాయిడ్ యాప్​ ఉన్న వాళ్లకు కూడా ఈ మూమెంట్స్ ఫీచర్ రానున్నట్లు కన్ఫామ్ చేసింది నెట్​ఫ్లిక్స్​.

నెట్​ఫ్లిక్స్​ మూమెంట్స్​ అంటే ఏంటి? –

Advertisement

నెట్​ఫ్లిక్స్​లో ఎన్నో టెలివిజన్​ షోస్​, సినిమా, సిరీస్​లు స్ట్రీమింగ్ అవుతుంటాయి. అయితే అందులో యూజర్స్​కు ఎన్నో ఐకానిక్ సీన్స్​ లేదా ఇతర సన్నివేశాలు ఫేవరెట్​గా మారిపోతుంటాయి. అలాంటి వాటిని ఇకపై అప్పటికప్పుడే బుక్​మార్క్​ చేసుకొని సేవ్ చేసుకునే వెసులుబాటును ఈ మూమెంట్స్ ఫీచర్స్​ ద్వారా అందిస్తోంది నెట్​ఫ్లిక్స్​. తద్వారా వీటిని ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీకి ఇతర సోషల్ మీడియాలో యాప్స్​ ద్వారా షేర్ చేసుకునేలా వీలు కల్పిస్తోంది.

“నెట్‌ఫ్లిక్స్‌లో ఏదైనా అద్భుతమైన, పవర్​ఫుల్​ కంటెంట్​ వచ్చినప్పుడు, దాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారు. దాన్ని చూసి వారు అక్కడితో వదిలేయరు. దాని గురించి మాట్లాడకుండా ఉండలేరు. ఇప్పుడీ కొత్త ఫీచర్​ ద్వారా ఆ అభిరుచి మరింత పెరుగుతుంది. ఈ మూమెంట్​ ఫీచర్​ను ఇలా ఇంట్రడ్యూస్ చేసి వదిలేయం. దీనికి మరిన్ని ఫీచర్స్​ను జత చేస్తాం. యూజర్స్​కు మరింత సులభతరం అయ్యేలా, తమ ఫేవరెట్​ కంటెంట్​ను షేర్ చేసేలా కొత్త ఫీచర్స్​ను జోడిస్తాం” అని నెట్​ఫ్లిక్స్​ పేర్కొంది.

ఇది ఎలా పని చేస్తుంది? –

యూజర్​ కంటెంట్​ను మొబైల్​ యాప్​లో కంటెంట్​ను చూస్తున్నప్పుడు అక్కడ మూమెంట్స్​ అనే ఆప్షన్ కనపడుతుంది. ఇది ఇతర మీడియా ఆప్షన్స్​ ప్లే బ్యాక్​, ప్లే బ్యాక్ స్పీడ్​, ఎపిసోడ్స్, ఆడియో, సబ్​టైటిల్స్​ తరహాలోనే కనిపిస్తుంది. కాబట్టి యూజర్​ సింపుల్​గా నెట్​ఫ్లిక్స్​లో కంటెంట్​ చూస్తున్నప్పుడు స్క్రీన్​ బాటమ్​లో స్వైప్​ చేసి మూమెంట్స్ ఆప్షన్​ను క్లిక్​ చేస్తే చాలు ఈజీగా మీ కావాల్సిన క్లిప్​ సేవ్ అయిపోతుంది. మీ మొబైల్​లో కూడా సేప్ అయిపోతుంది. ఆ తర్వాత దాన్ని మీ ఫ్రెండ్స్​ తో పాటు ఫ్యామిలీ మెంబర్స్​కు ఇన్​స్టా గ్రామ్​, మెసెంజర్​, వాట్సప్​, స్నాప్ చాట్​ ద్వారా ఎంచక్కా షేర్ చేసుకుని ఆస్వాదించవచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఓ సారి ట్రై చేసేయండి.

Related News

ఆఫీస్ నుంచే ఇల్లు క్లీన్ చేయొచ్చా? ఫోన్‌తో ఆపరేట్ అయ్యే రోబో వాక్యూమ్స్

ఫోటో, వీడియో ఎడిటింగ్ సరికొత్తగా! మీ బడ్జెట్‌లో టాప్ 5 డిస్‌ప్లే మానిటర్స్

మీ టీవీకి పర్‌ఫెక్ట్ జోడీ!హోమ్ థియేటర్ ఫీల్ ఇచ్చే.. టాప్ సౌండ్‌బార్స్

తాగునీరు విషయంలో కాంప్రమైజ్ వద్దు ! వీటితో హెల్దీ అండ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్

అమ్మో..ఈ మిక్సర్ గ్రైండర్స్ ఇంత స్మార్టా? మీ టైమ్, మనీ ఆదా చేసే టాప్ 5 మిక్సర్లు ఇవే!

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

Big Stories

Advertisement
×