E-Paper
Advertisement

ఇక్కడ నెల సంపాదన.. అక్కడ ఒక్క రోజులో.. డ్రైవర్ వీడియో వైరల్!

ఇక్కడ నెల సంపాదన.. అక్కడ ఒక్క రోజులో.. డ్రైవర్ వీడియో వైరల్!
Advertisement

Australia Driver Video: ఎక్కువ సంపాదన కోసం చాలా మంది భారత్ నుంచి విదేశాలకు వెళ్తుంటారు. భారత్ తో పోలిస్తే.. ఇతర దేశాల్లో ఉద్యోగాలు మెరుగైన జీతాలు అందిస్తాయని చాలా మంది నమ్ముతారు. ఆస్ట్రేలియాలో ఉన్న ఓ భారతీయ వ్యక్తి తాను ఒక రోజులో ఎంత సంపాదిస్తాడో పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. భారత్, ఆస్ట్రేలియాలో జీతాలను పోలుస్తూ పెట్టిన వీడియోపై చర్చ మొదలైంది.

వీడియో వైరల్

ఆస్ట్రేలియాలో డ్రైవర్ గా పనిచేస్తున్న రవీందర్ ఇన్ స్టా గ్రామ్ లో ఓ వీడియో పెట్టారు. “ఆస్ట్రేలియా అంటే ఏదో గొప్ప విషయం కాదు, ఇక్కడికి రావద్దు. భారత్ లో ఇంట్లో కూర్చొని హాయిగా భోజనం చేయండి” అని వ్యంగ్యంగా మాట్లాడాడు. “బ్రో, నేను ఉదయం 7:00 గంటలకు పని మొదలుపెట్టాను. పని పూర్తయ్యే సరికి రాత్రి 12:00 అయింది. అయినా, ఒంట్లో ఏ మాత్రం అలసట లేదు” అన్నాడు. రవీందర్ తన ఆదాయం గురించి మాట్లాడుతూ.. “మరి నేను ఎంత సంపాదించాను? రోజుకు 650 నుంచి 700 డాలర్లు. అంటే భారతీయ రూపాయలలో రూ.35 నుంచి రూ. 40 వేలు. భారత్ ఇది నా నెల మొత్తం జీతం” అన్నాడు. భారతదేశంలో ఒక నెల మొత్తం పనిచేస్తే వచ్చే ఆదాయం ఆస్ట్రేలియాలో కేవలం ఒక్క రోజులోనే సంపాదిస్తున్నానని రవీందర్ చెప్పుకొచ్చాడు.

ఖర్చులు ఎక్కువే

Advertisement

రవీందర్ తన జీవనశైలి గురించి మాట్లాడుతూ.. ఈ ఒక్క రోజు జీతంతో, తాను తన ఇంటికి నెల మొత్తానికి సరిపడా సరుకులు కొలగలనన్నారు. భారత్ బయట ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆయన ఇతరులను సూచించాడు. “కాబట్టి, నేను చెప్పేదల్లా ఒక్కటే, ఇళ్ల నుండి బయటకు రండి, ఏదైనా ఇతర దేశానికి వెళ్లి, కష్టపడి పనిచేయండి, మనం పుట్టిన ఈ పేదరికాన్ని వదిలించుకోండి” అని అన్నారు. తాను ఇవాళ ఇప్పుడు తన తల్లిదండ్రుల కంటే ఎక్కువ సంపాదించడం మొదలుపెట్టానని రవీందర్ అన్నారు. కానీ నేను ఇప్పటికీ వాళ్లంత కష్టపడలేకపోతున్నానని అన్నారు.

Also Read: ప్రియుడి కోసం భర్త, కొడుకుని వదిలేసింది.. ఆ తర్వాత కారులో ప్రియుడితో మూడుముళ్లు

నెట్టింట చర్చ

Advertisement

ఆ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు రవీందర్ వ్యాఖ్యలను స్ఫూర్తిదాయకంగా చూస్తే, మరికొందరు విదేశాల్లో ఎదురయ్యే సవాళ్లను ఎత్తిచూపుతున్నారు. ఆస్ట్రేలియాలు జీతాలు ఎక్కువే, అలాగే ఖర్చులు, పన్నులు ఎక్కువే ఉంటుందని కామెంట్ చేశారు.

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×