భారతీయ రైల్వేలో అప్పుడప్పుడు వింత వింత ఘటనలు జరుగుతుంటాయి. కొంత మంది కుర్రాళ్లు కావాలని ఎమర్జెన్సీ చైన్ లాగిన సందర్భాలున్నాయి. కొంత మంది లోకో పైలెట్లు ఏకంగా చేపలు కొనేందుకు రైలు ఆపిన సందర్భాలూ చూశాం. పశువుల ప్రాణాలు కాపాడేందుకు రైళ్లు స్లో చేయాడాన్నీ చూశాం. ఇంకొంత మంది యువకులు సెల్ఫీల కోసం స్టంట్లు చేస్తూ ప్రాణాలు కోల్పోయారు కూడా. తరచుగా ఏదో ఒక వైరల్ న్యూస్ తో ఇండియన్ రైల్వేస్ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.
తాళ్లు కట్టి పట్టాలు లాగేసిన యువకులు
తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతున్నది. ఇంతకీ అసలు మ్యాటర్ ఏటంటే.. ఇద్దరు యువకులు క్రియేట్ చేసిన వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది. మరీ ఇలా ఉన్నారేంట్రా? అనే కామెంట్స్ పెట్టేలా చేస్తోంది. ఈ వీడియోలో ఇద్దరు యువకులు రైలు ఆపాలి అనుకుంటారు. ఎలా ఆపాలా ? అని ఆలోచించి.. రైలు పట్టాలు దూరం జరపాలనుకుంటారు. అలా చేస్తే కచ్చితంగా రైలు ఆగుతుందని భావిస్తారు. అనుకున్నదే ఆలస్యంగా.. చెరో పట్టాకు తాళ్లు కట్టి దూరం లాగుతారు. అదే రూట్లో రైలు వస్తుంది. పట్టాలు దూరం జరగడం చూసి రైలు ఆపుతాడు. దూరం నుంచి చెట్టు చాటున దాక్కొని చూస్తున్న యువకులు రైలు ఆగడంతో ఫుల్ ఖుషీ అవుతారు. ఈ వీడియోను పూర్తిగా గ్రాఫిక్స్ తో క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">
ఇండియాలో ఇలాంటి చేస్తే కఠిన చర్యలు
ఈ వైరల్ వీడియోను క్రియేట్ చేసింది పాకిస్తాన్ యువకులు. భారత్ లో ఇలాంటి తింగరి వీడియోలు చేస్తే అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారు. గత కొంత కాలంగా దేశవ్యాప్తంగా దుండగులు రైలు ప్రమాదాలకు కారణం అవుతున్నారు. పట్టాలను లూజ్ చేయడం, పట్టాల మీద ఇనుప వస్తువులు ఉంచడం లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. రైలు పట్టాలు తప్పి ప్రమాదానికి గురయ్యే దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి పనులు చేసే వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. రైలు ప్రయాణీకులు భద్రతకు ముప్పువాటిల్లే పనులు చేసిన ఎవరికైనా సీరియస్ పనిష్మెంట్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది. సో.. భారత్ లో రైల్వే విషయాల్లో ఎలాంటి ఫన్నీ, ఫేక్ వీడియోలు చేసినా నేరంగా పరిగణిస్తారు. ఇలాంటి వీడియోలు చూసి నిజంగానే ప్రయత్నించే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు, రైల్వే అధికారులు సైతం రైల్వే భద్రతకు ముప్పు కలిగే పనులు చేయకూడదంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. పిచ్చి పనులు చేసి, జీవితాన్ని నాశనం చేసుకోవద్దని హితవు పలుకుతున్నారు. చూడ్డానికి ఫన్నీగా ఉన్న ఈ పాక్ వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలుస్తున్నది.
Read Also: టికెట్ లేకుండానే ఈ రైల్లో హాయిగా వెళ్లొచ్చు! ఈ స్పెషల్ ట్రైన్ మన దేశంలోనే ఉంది తెలుసా?