ఈ మధ్యకాలంలో ఎక్కువగా సెలబ్రిటీల పైన కేసులు నమోదవడం అభిమానులను కలవరపాటుకు గురిచేస్తోంది. ఇప్పటికే కొంతమంది సెలబ్రిటీల పైన లైంగిక వేధింపుల కింద కేసు నమోదు అవ్వగా మరికొంతమందిపై హత్యా నేరం కేసు నమోదవడం గమనార్హం. ఇదిలా ఉండగా మొన్నటికి మొన్న టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ (Raj Tarun) పై లైంగిక వేధింపుల కేసు నమోదువగా.. ఈ ఘటన మరువకముందే ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Jani Master) పై లైంగిక వేధింపుల కేసులో కేసు ఫైల్ అయ్యింది. అయితే కొన్ని రోజులు జైలు జీవితం గడిపి, ఇటీవలే బెయిల్ మీద బయటకు వచ్చిన విషయం తెలిసిందే.
హీరో శ్రీతేజ్ పై కేస్ ఫైల్..
అయితే ఈ ఘటన మరువకముందే ఇప్పుడు మరో సినీ హీరో పై కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయినట్లు తెలిసింది. ఆయన ఎవరో కాదు యంగ్ హీరో శ్రీ తేజ్ (Sri Tej) . పెళ్లి చేసుకుంటానని నమ్మించి, మోసం చేశాడని బాధిత యువతి కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినట్లు సమాచారం. ఇకపోతే పెళ్లయిన వివాహితతో ఈయన అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు సమాచారం.. ఇక ఆమె ప్రైవేట్ బ్యాంక్ సీనియర్ ఎంప్లాయ్ భార్యతో శ్రీ తేజ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు వీరిద్దరి అక్రమ సంబంధం తెలుసుకున్న ఆ ఎంప్లాయ్ గుండెపోటుతో మరణించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ ఘటనలో కూడా శ్రీ తేజ్ పై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేస్ నమోదు కావడం గమనార్హం. ఇక ఇలా ఒకవైపు లైంగిక వేధింపులతో పాటు హత్యా నేరం కింద కేసు నమోదవడంతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇదిలా ఉండగా నేరారోపణల కారణంగా ఈయనపై బి.ఎన్.ఎస్ 69, 115(2),318(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ఇకపోతే ప్రస్తుతం శ్రీ తేజ్ ఒక బడా సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం.