Man Breaks Train Door Video | రైలు ప్రయాణం చేసే సమయంలో చాలామందికి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అయితే వాటిని సంయమనంతో పరిష్కరించుకోవాలి. కుదరకపోతే సంబంధిత రైల్వే సిబ్బంది లేదా అధికారులకు సమస్య గురించి ఫిర్యాదు చేయాలి. అంతే గాని హింసాత్మకంగా ప్రవర్తించకూడదు. అలా చేస్తే.. ఇతరుల సంగతేమోకానీ.. రివర్స్ లో మీరు చిక్కులో పడతారు. సమస్య పరిష్కారం కాకపోగా.. ఇంకా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. తాజాగా ఇలాంటిదే ఒక ఘటన ఒక రైల్వే స్టేషన్ లో జరిగింది. అక్కడ ఓ యువకుడు ట్రైన్ లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తూ లోపలి నుంచి డోర్ లాక్ చేసి ఉండడంతో దాన్ని పగలగొట్టడానికి ఆవేశంగా ప్రయత్నించాడు. కానీ చివరికి అతడు చిక్కుల్లో పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ఒక సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
ట్విట్టర్ ఎక్స్ లో వైరల్ అవుతున్న ఈ వీడియోకి ఇప్పటికే 2.6 లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోని 6500 మందికి పైగా లైక్స్ కూడా ఉండడం విశేషం. వీడియోలో కనిపిస్తున్న దృశ్యాల ప్రకారం.. కొంతమంది ప్రయాణికులు.. ఒక రైల్వే స్టేషన్లో గుమిగూడి ఉన్నారు. ఒక ట్రైన్ ప్లాట్ ఫామ్ పై బయలుదేరేందుకు రెడీగా ఉంది. ఆ ట్రైన్ లోకి ప్రవేశించేందుకు జనం ప్రయత్నిస్తుండగా లోపల ఉన్న ప్రయాణికులు డోర్ లాక్ చేసి ఉన్నారు.
Also Read: ప్రేక్షకుడి టైమ్ వేస్ట్ చేస్తారా!.. పివిఆర్ మల్లీప్లెక్స్‌కు జరిమానా
రైల్వే స్టేషన్లో జనం భారీ సంఖ్యలో ఉండడంతో అక్కడ ఒక మీడియా ప్రతినిధి కెమెరాకు పోజులిస్తూ.. పరిస్థితి వివరిస్తున్నాడు. ఇంతోలనే ఒక యువకుడు ఆ విలేకరి పక్కనే ఉన్న ట్రైన్ డోర్ ని బద్దలు కొట్టేందుకు ప్రయత్నించాడు. డోర్ ని తన్నాడు. చేత్తో బాదాడు. లాభం లేకపోవడంతో తన చేతిలోని ఇనుప కడియంతో ట్రైన్ డోర్ గ్లాసు భాగంపై గట్టిగా పలుమార్లు కొట్టాడు. పక్కనే ఉన్న మీడియా ప్రతినిధి చేతిలో మైకు పట్టుకొని అతడిని వారిస్తున్నా అతను వినడం లేదు. ఆగ్రహంగా తాము ట్రైన్ లో ఎలా ప్రవేశించాలి? అని వాదించాడు. ఆ తరువాత కూడా ట్రైన్ డోర్ గ్లాస్ ని కొట్టాడు. దీంతో ఆ గ్లాసులో కొద్దిగా చీలికలు కనిపించాయి. ఇంతలోనే అతని తోటి ప్రయాణికులు అతని కోపం చూసి వెనక్కు లాగారు. అతడికి పరిచయం ఉన్న యువతి ఒకరు యువకుడిని సర్ది చెప్పేందుకుక ప్రయత్నించింది. అయినా అతను ఆగ్రహంతో ఊగిపోయాడు. మీడియా వైపు తిరిగి తాము చాలా సమయం నుంచి బయట వేచి చూస్తున్నామని.. ట్రైన్ తలుపులు తెరవట్లేదని చెప్పాడు.
ఇంతలోనే అక్కడికి ఒక రైల్వే పోలీసు అధికారి, ఒక టిటి ఆఫీసర్ వచ్చి ఆ యువకుడని పట్టుకున్నారు. పోలీస్ అధికారి అయితే ఆ యువకుడికి రెండు చెంపదెబ్బలు కూడా కొట్టాడు. తోడుగా వచ్చిన రైల్వే అధికారి ఆ యువకుడిని పట్టుకొని అక్కడి నుంచి తీసుకెళ్లాడు. ఈ వీడియోని చూసిన నెటిజెన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
ఒక యూజర్ అయితే ట్విట్టర్ రియాక్ట్ అవుతూ… “ఆ ట్రైన్ డోర్ గ్లాస్ పగల్లేదు కానీ ఈ రోజు రాత్రి పోలీస్ కస్టడీ మాత్రం ఇతని బాడీ పార్ట్స్ తప్పకుండా పగుల్తాయి” అని కామెంట్ చేశాడు. ఇంకొక నెటిజెన్ కామెంట్ చేస్తూ.. “లోపల ఉన్న ప్యాసింజర్ డోర్ లాక్ చేస్తే దాన్ని తెరవడానికి బద్దలు కొట్టాల్సిన అవసరం లేదు. పోలీసులకు సమాచారం అందిస్తే సరిపోతుంది. అంతే గానీ అది పబ్లిక్ ప్రపార్టీని ధ్వంసం చేస్తే ఎలా? చాలా స్టుపిడ్ గా ఉన్నాడు బ్రో. ఇలాంటి సైకోలే దేశాన్ని నాశనం చేస్తున్నారు.” అని రాశాడు.
We Need To Learn Civic Sense 🇮🇳 pic.twitter.com/bZ1jikdMAL
— Desidudewithsign (@Nikhilsingh21_) February 18, 2025