White Hair Tips: వైట్ హెయిర్ సమస్యలతో సతమతమవుతున్నారా..? ఎన్ని రకాల హెన్నాలు పెడుతున్నా.. ఎన్ని చిట్కాలు పాటించినా ఫలితం రావడం లేదా..? అయితే వీటిన్నింటికి చెక్ పెట్టాలంటే.. ఒక్కసారి ఈ హెయిర్ మాస్క్ ట్రై చేసి చూడండి. జీవితంలో తెల్ల జుట్టు రాదు. దీని వల్ల తెల్ల జుట్టు శాశ్వతంగా తొలగిపోవడంతో పాటు జుట్టు మందంగా, పొడవుగా పెరుగుతుంది. చుండ్రు సమస్యలను తొలగించడంలో కూడా అద్భుతంగా పనిచేస్తుంది.
సాధారణంగా తెల్లజుట్టు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. వంశపార్యపరంగా కొంత మందికి చిన్న వయసులోనే వస్తుంది. మరికొంత మందికి సరైన పోషకాహారం తినకపోవడం, జుట్టుకు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం, పొల్యూషన్, ఇతర కారణాల వల్ల కూడా తెల్ల జుట్టు వచ్చే ప్రమాదం ఉంది. ఇందుకోసం బయట మార్కెట్లో దొరికే రకరకాల హెన్నాలు, హెయిర్ డై వంటివి ఉపయోగిస్తారు. వీటివల్ల అనేక అనారోగ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. జుట్టు కూడా డామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మన ఇంట్లోనే నేచురల్ హెయిర్ మాస్క్‌లు ట్రై చేశారంటే.. మంచి ఫలితం ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
☀ కావాల్సిన పదార్దాలు
⦿ మెంతులు టీస్పూన్
⦿ ఆనియన్ సీడ్స్ టేబుల్ స్పూన్
⦿ మస్టర్డ్ ఆయిల్
⦿ నల్ల నువ్వులు
⦿ లవంగాలు 3
⦿ ఆవాలు
⦿ గులాబీ రెబ్బలు
⦿ పసుపు
⦿ కొబ్బరి నూనె
☀ తయారు చేసుకునే విధానం..
ముందుగా స్టవ్ వెలిగించి మందపాటి పాన్ పెట్టుకుని.. అందులో మెంతులు, ఆనియన్ సీడ్స్, నల్ల నువ్వులు, లవంగాలు, గులాబీ రెబ్బలు, ఆవాలు, పసుపు వేసి బాగా నల్లగా వచ్చేంతవరకు వేయించాలి. ఆ తర్వాత స్టవ్ కట్టేసి.. వీటన్నిటిని మిక్సీజార్‌లోకి తీసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో తీసుకొని అందులో.. కొబ్బరి నూనె కలిపి బాగా మిక్స్ చేసి, రాత్రంతా మూత పెట్టి అలానే ఉంచండి. మరుసటి రోజు తలకు అప్లై చేసి.. గంట తర్వాత సాధారణ షాంపూతో తలస్నానం చెయ్యండి. ఇలా రెగ్యులర్‌గా క్రమం తప్పకుండా నెలకు రెండు సార్లు చేస్తే.. మంచి ఫలితం ఉంటుంది. జుట్టు కూడా పొడవుగా పెరుగుతుంది కూడా.
తెల్లజుట్టును శాశ్వతంగా నల్లగా మార్చేందుకు ఈ చిట్కా కూడా అద్భుతంగా పని చేస్తుంది. ఓ సారి ట్రై చేసి చూడండి.
☀ కావాల్సిన పదార్ధాలు
⦿ బీట్ రూట్
⦿ గుంటగలగర ఆకు(భృంగరాజ్)
⦿ కరివేపాకు
⦿ ఉసిరిపొడి
☀ తయారు చేసుకునే విధానం
ముందుగా బీట్ రూట్ ముక్కలను, కరివేపాకు, గుంటగలగర ఆకు మెత్తగా మిక్సీ పట్టి, వడకట్టుకొని, రసాన్ని వేరే గిన్నెలోకి తీసుకోవాలి. అందులో ఉసిరి పొడిని కలపి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ మిశ్రమాన్ని కొద్ది సేపు ఉడకబెట్టండి. ఆ తర్వాత స్టవ్ కట్టేసి చల్లారనివ్వండి. బాగా నల్లగా అవుతుంది. దీన్ని జుట్టు కుదుళ్లకు అప్లై చేసి అరగంట తర్వాత తలస్నానం చెయ్యండి. ఇలా నెలకు ఒకసారి చేస్తే చాలు.. శాశ్వతంగా తెల్లజుట్టు రావడం ఆగిపోతుంది. జుట్టు పొడవుగా పెరుగుతుంది కూడా.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.