BigTV English

Defence Minister Rajnath Singh: భారత్‌లో విలీనం కానున్న పీవోకే.. రాజ్ నాథ్ సింగ్

Defence Minister Rajnath Singh: భారత్‌లో విలీనం కానున్న పీవోకే.. రాజ్ నాథ్ సింగ్

Holi 2024 Defence Minister Rajnath Singh: భారత్‌లో పాక్ ఆక్రమిత కశ్మీర్ త్వరలోనే వీలీనం కాబోతోందని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. పీవోకే ఎప్పటికైనా భారత్ లోనే విలీనం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. అక్కడి ప్రజలు కూడా భారత్ లోనే తాము విలీనం కావాలనుకుంటున్నట్లు తెలిపారని ఆయన అన్నారు.


భారత్ లో విలీనం కావాలని పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు స్వయంగా డిమాండ్ చేస్తున్నారని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. త్వరలోనే అది సాధ్యం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అక్కడి ప్రజల నుంచి భారత్ లో కలవాలని డిమాండ్లు వస్తునందున దాన్ని బలవంతంగా ఆక్రమించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఈ విషయాన్ని తాను గతంలో కూడా చెప్పినట్లు గుర్తిచేశారు. ఇటీవలే పాక్ ప్రధాని షేబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలకు గాను రాజ్ నాథ్ సింగ్ బదులిచ్చారు.

సైనికులతో పాటుగా హోలీ వేడుకలు జరుపుకుంటున్న రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పీవోకేపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన్ను కాశ్మీర్ పై పాక్ ప్రధాని చేసిన వ్యాఖ్యలకు గాను మీడియా అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. కశ్మీర్ ను పాక్ వాళ్లు ఎప్పుడైనా స్వాధీనం చేసుకోగలరా అని ప్రశ్నించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించి వారు ఆందోళన చెందాల్సి అవసరం ఉందన్నారు. అక్కడ దాడి చేసి ఆక్రమించుకోవాల్సిన అవసరం ఉండదని ఏడాదిన్నర కిందటే తాను చెప్పానన్నారు. అక్కడి ప్రజలే స్వయంగా భారత్ లో విలీనం కావాలని డిమాండ్లు చేస్తున్నారని అన్నారు.


పీవోకేపై భారత్ ప్రభుత్వం ఏమైన ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోందా అని ప్రశ్నకు కూడా ఆయనకు ఎదురైంది. ఈ విషయంలో ఇంతకంటే ఎక్కువ చెప్పలేనని అన్నారు. భారత్ ఏ దేశంపైనా దాడి చేయదని.. అలా దాడికి పాల్పడి ఇతర దేశాలకు చెందిన భూమిని ఆక్రమించుకోదని తేల్చి చెప్పారు. ఎవరైనా భారత్ పై దాడిచేస్తే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. పీవోకే విషయం గతంలోనూ, ప్రస్తుతం అదే జరుగుతోందన్నారు. లద్దాఖ్ లోని లేహ్ సైనిక స్థావరం వద్ద రాజ్ నాథ్ సింగ్ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు.

Tags

Related News

Bihar: బీహార్ యాత్రలో సీఎం రేవంత్.. రాహుల్ గాంధీ ప్లాన్ అదేనా!

Jammu Kashmir: ఘోర ప్రమాదం.. కొండచరియలు విరిగిపడి 30 మంది మృతి..

Trump-Modi: 4సార్లు ట్రంప్ ఫోన్ కాల్ కట్ చేసిన మోదీ.. జర్మనీ పత్రిక సంచలన కథనం

Cloudburst: దోడాలో క్లౌడ్ బరస్ట్.. జమ్మూ ప్రాంతంలో వరదల విజృంభణ.. మళ్లీ ప్రాణనష్టం!

Discount Scheme: వాహనదారులకు ప్రభుత్వం కొత్త స్కీమ్.. ఏ మాత్రం ఆలస్యం వద్దు

PM Modi: రంగంలోకి సుదర్శన చక్ర.. ఇక శత్రువులకు చుక్కలే!

Big Stories

×