Big Stories

RR vs LSG: పూరన్ పోరాటం వృథా.. రాజస్థాన్ రాయల్స్ విజయం..

RR vs LSG
RR vs LSG

Rajasthan Royals vs Lucknow Super Giants: జైపూర్ సవాయ్ మాన్‌సింగ్ వేదికగా రాజస్థాన్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఓటమి పాలయ్యింది. నికోలస్ పూరన్(64*, 41 బంతుల్లో; 4X4, 4X6) పోరాడినా ఫలితం దక్కలేదు. 20 పరుగుల తేడాతో రాజస్థాన్ విజయం సాధించింది.

- Advertisement -

194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నోకు తొలి ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ డి కాక్ 4 పరుగులు చేసి బౌల్ట్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. మూడో ఓవర్లో పడిక్కల్ డకౌట్ అవ్వగా.. నాలుగో ఓవర్లో బదోని ఒక్క పరుగు మాత్రమే చేసి బర్గర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. దీంతో 11 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

- Advertisement -

ఇంపాక్ట్ సబ్‌గా వచ్చిన దీపక్ హూడా 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 13 బంతుల్లోనే 26 పరుగులు చేసి చాహల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. దీంతో మరో ఓపెనర్ రాహుల్, నికోలస్ పూరన్‌తో ఇన్నింగ్స్‌ను నడిపించారు. 5వ వికెట్‌కు 85 పరుగులు జోడించాక హాఫ్ సెంచరీ చేసిన రాహుల్ సందీప్ శర్మ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.

18 బంతుల్లో 42 పరుగులు చేయాల్సిన తరుణంలో అశ్విన్ 18వ ఓవర్లో కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి స్టోయినిస్ వికెట్ పడగొట్టాడు. దీంతో విజయ సమీకరణం 12 బంతుల్లో 38 పరుగులుగా మారింది.

19వ ఓవర్లో సందీప్ శర్మ 11 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో చివరి ఓవర్లో 27 పరుగులు అవసరం పడ్డాయి. అద్భుతంగా బౌలింగ్ చేసిన అవేశ్ ఖాన్ కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో 20 పరుగుల తేడాతో లక్నో ఓటమి పాలయ్యింది.

అంతకుముందు కెప్టెన్ సంజూ శాంసన్(82, 52 బంతుల్లో;3X4, 6X6), రియాన్ పరాగ్(43, 29 బంతుల్లో;1X4, 3X6) రాణించడంతో రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్‌‌‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. రెండో ఓవర్లో ఓపెనర్ జాస్ బట్లర్ నవీన్ ఉల్ హక్ బౌలింగ్‌లో కీపర్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 12 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 24 పరుగులు చేసి మోసిన్ ఖాన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.

ఆ తర్వాత కెప్టెన్ శాంసన్, రియాన్ పరాగ్ నిలకడగా ఆడుతూ స్కోర్ బోర్డును పరిగెత్తించారు. ఈ తరుణంలో శాంసన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 43 పరుగులు చేసిన రియాన్ పరాగ్ నవీన్ ఉల్ హక్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ వెంటనే వచ్చిన హెట్‌మెయర్ 5 పరుగులు చేసి రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. చివర్లో ధృవ్ జురెల్(20, 12 బంతుల్లో;1X4, 1X6) , శాంసన్ చెలరేగడంతో రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోర్ చేసింది. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ 2, బిష్ణోయ్ 1, మోసిన్ ఖాన్ 1 వికెట్ తీసుకున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News