BigTV English

Crime News : చంపేస్తా.. డ్రమ్ములో పూడ్చేస్తా.. భర్తను కొట్టి భార్య బెదిరింపులు

Crime News : చంపేస్తా.. డ్రమ్ములో పూడ్చేస్తా.. భర్తను కొట్టి భార్య బెదిరింపులు

Crime News : ఇటీవలి మీరట్ మర్డర్ కేసు యావత్ దేశాన్ని షాక్‌కు గురిచేసింది. అక్రమ సంబంధం మోజులో.. భర్తను దారుణంగా చంపేసిన ఘటన అది. లవర్స్ ఇద్దరూ కలిసి.. ఆ నేవీ అధికారిని చంపేసి.. డెడ్‌బాడీని ముక్కలు ముక్కలు చేసి.. డ్రమ్ములో వేసి.. సిమెంట్ కాంక్రీట్‌తో సీల్ చేశారు. ఆ తర్వాత తమకేం తెలీనట్టు ఎంచక్కా.. సిమ్లాకు వెకేషన్ ట్రిప్ వెళ్లారు. గంజాయి మత్తులో, బెడ్‌రూమ్‌లో మునిగితేలారు. కట్ చేస్తే.. ఇప్పుడు జైల్లో చిప్పకూడు తింటోంది ఆ జంట.


మీరట్ ఘటనలానే భర్తను చంపేస్తానంటూ..

ఈ ఉదంతం విన్న వారంతా ఉలిక్కిపడ్డారు. మరీ, ఇంత దారుణమా అని అవాక్కయ్యారు. కానీ, ఓ మహిళ మాత్రం అలా కాదు. తాను కూడా అలాగే నరికి చంపేసి.. డ్రమ్ముల్లో పాతేస్తానంటూ తన భర్తను చితక్కొట్టి మరీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. తన అక్రమ సంబంధానికి అడ్డు చెబుతున్నందుకు భర్తను అలా బెదిరించింది ఆ భార్య. ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో జరిగిందీ ఘటన.


సీసీఫుటేజ్‌లో భర్తను కొట్టే దృశ్యాలు

ఆ వీడియోలో ఓ మహిళ ఇంట్లోంచి కోపంగా భయటకు వచ్చింది. చేతిలో ఇల్లు తుడిచే వైపర్ ఉంది. దాంతో ఇంటి వరండాలో నిలుచున్న వ్యక్తిని కొడుతోంది. అతను మాత్రం పాపం అలానే మౌనంగా నిలబడి దెబ్బలు తింటున్నాడు. కనీసం అడ్డుకునే, తప్పించుకునే ప్రయత్నం కూడా చేయలేదు.

బంధువే కదాని పనిస్తే.. భార్యతో అక్రమ సంబంధం

ఆ దెబ్బలు తిన్న వ్యక్త పేరు ధర్మేంద్ర కుష్వాహా. స్థానిక జల్ నిగమ్‌లో పని చేస్తున్నాడు. గవర్నమెంట్ జాబ్ అన్నమాట. అతన్ని వైపర్‌తో కొడుతున్నది మరెవరో కాదు అతని భార్య మాయా మౌర్య. వాళ్లిద్దరిదీ లవ్ మ్యారేజ్. పెళ్లై తొమ్మిదేళ్లు అవుతోంది. కూతురు కూడా ఉంది. భార్యను బాగా చూసుకుంటాడు. ఆమె పేరు మీద మూడు కార్లు కూడా కొన్నాడు. రెండేళ్ల క్రితం కొంత భూమి కొని అందులో సొంతిల్లు కడుతున్నాడు. ఆ ఇంటిని కట్టే కాంట్రాక్టును భార్య సమీప బంధువైన నీరజ్ మౌర్య తీసుకున్నాడు. ఇంటి నిర్మాణ పనుల నిమిత్తం నీరజ్ తరుచూ ధర్మేంద్ర ఇంటికి వస్తుండటంతో.. ధర్మేంద్ర భార్య మాయా అతనికి బాగా క్లోజ్ అయింది. ఆ బంధం.. అక్రమ సంబంధంగా మారింది. నీరజ్ భార్య చనిపోవడంతో.. ఇక అతను మాయ మాయలో పూర్తిగా మునిగిపోయాడు. అయితే, గతేడాది వాళ్లిద్దరూ ఏకాంతంగా ఉండగా.. ధర్మేంధ్ర కుష్వాహాకు దొరికిపోయారు. వాళ్లను అలా చూసి అతను తట్టుకోలేక పోయాడు. ఇదేం పనంటూ ప్రశ్నిస్తే.. ఆ నీరజ్, మాయలు కలిసి ధర్మేంధ్రను చితక్కొట్టారు. అప్పటినుంచి ఆ జంట మరింత రెచ్చిపోయింది.

అడ్డంగా దొరికిపోయి.. మరింత బరితెగించి..

ఎలాగూ భర్తకు తన అక్రమ సంబంధం మేటర్ మొత్తం తెలిసిపోయిందని ఆ భార్య మరింత తెగించడం మొదలుపెట్టింది. ఇంట్లోని నగలు, డబ్బులతో కొన్నాళ్లు పారిపోయింది. ఆ తర్వాత తిరిగొచ్చి భర్త మీదే కేసు పెట్టింది. మౌనంగా ఉండకపోతే.. ధర్మేంద్ర తల్లిని చంపేస్తానంటూ నీరజ్ సైతం బెదిరించేవాడు. తరుచూ కొట్టేవాడు. గతేడాది పోలీసులకు ధర్మేంద్ర ఫిర్యాదు చేసినా.. వాళ్లు మాత్రం ఏం భయపడలేదు. ఇటీవల మరోసారి మొగుడిని కొట్టింది. ఈసారి ఇటీవల మీరట్‌లో జరిగినట్టు.. తనను కూడా చంపి, డెడ్‌బాడీని ముక్కలు చేసి.. సిమెంట్ డ్రమ్ములో పూడ్చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చిందంటూ ధర్మేంద్ర మరోసారి పోలీసులకు కంప్లైంట్ చేశాడు.

ఒకరిపై ఒకరు కేసులు.. ఎవరు కరెక్ట్?

భర్తపైనా రివర్స్ కేసు పెట్టింది మాయా. ధర్మేంద్రనే తనను వేధిస్తున్నాడని.. ఇప్పటికే నాలుగుసార్లు తనకు అబార్షన్ కూడా చేయించాడని ఫిర్యాదు చేసింది. తనను ఇంటి నుంచి గెంటేసేడని చెప్పింది. ఇప్పటికే తాను కోర్టులో విడాకుల కేసు కూడా వేశానని మాయా తెలిపింది. పరస్పర ఫిర్యాదులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు్న్నారు. ఇంటి సీసీఫుటేజ్ పరిశీలిస్తే ఆ భార్య.. భర్తను కొడుతున్న వీడియో బయటపడింది.

Related News

Python Video: అమ్మ బాబోయ్..! భారీ కడుపుతో కొండచిలువ.. కాసేపటికే కక్కేసింది.. వీడియో చూస్తే..?

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Big Stories

×