Arjun Reddy: మామూలుగా ఒక హీరో అవకాశం మరొక హీరో చేతికి వెళ్లడం చాలా కామన్. హీరోల ఛాన్సులు మాత్రమే కాదు.. కమెడియన్ ఛాన్సులు కూడా ఒక్కొక్కసారి ఒకరి చేతి నుండి మరొకరి చేతికి వెళ్లడం కూడా కామనే. కొన్నిసార్లు అలాంటి సైడ్ క్యారెక్టర్సే నటీనటుల కెరీర్‌ను మార్చేస్తాయి. అలా ఒక్క సినిమాతో హైలెట్ అయ్యి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అయిపోయిన వారు ఎందరో. అలాంటి వారిలో రాహుల్ రామకృష్ణ కూడా ఒకడు. రాహుల్ రామకృష్ణ కెరీర్‌ను మార్చేసి, తనను నటుడిగా ప్రేక్షకులకు పరిచయం చేసిన సినిమా ‘అర్జున్ రెడ్డి’. ఈ మూవీలో తను చేసిన శివ పాత్ర అసలైతే వేరే కమెడియన్ చేయాల్సింది అనే విషయం తాజాగా బయటపడింది.
ఛాన్స్ మిస్
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా ఏ రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగాకు ఇది మొదటి సినిమానే అయినా ఈ మూవీ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. అందులో ప్రతీ ఒక డైలాగ్, ప్రతీ ఒక పాత్ర అందరికీ గుర్తుండిపోయేలా చేశాడు సందీప్. అలా అందరికీ గుర్తుండిపోయిన పాత్రల్లో ఒకటి శివ. హీరో విజయ్ దేవరకొండ ఫ్రెండ్‌గా రాహుల్ రామకృష్ణ చేసిన పాత్రే శివ. హీరోగా విజయ్‌కు ఈ సినిమా వల్ల ఎంత గుర్తింపు లభించిందో ఫ్రెండ్‌గా నటించిన రాహుల్ రామకృష్ణకు కూడా అంతే గుర్తింపు వచ్చింది. కానీ మరొక కమెడియన్ ఈ ఛాన్స్ వదులుకోవడం వల్ల రాహుల్ చేతికి వచ్చిందని తెలుస్తోంది.
అప్పుడే ఫిక్స్
‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) కంటే ముందు ‘పెళ్లిచూపులు’తో మంచి ఫామ్‌లో ఉన్నాడు విజయ్ దేవరకొండ. అందులో కూడా విజయ్ ఫ్రెండ్ పాత్రలో నటించిన ప్రియదర్శికి మంచి గుర్తింపు లభించింది. అయితే ‘అర్జున్ రెడ్డి’లో కూడా అదే కాంబినేషన్ రిపీట్ చేయాలని అనుకున్నాడు. కానీ హీరోకంటే తక్కువ హైట్‌లో ఉండే ఫ్రెండ్ పాత్ర కావాలని సందీప్ ముందే అనుకున్నాడట. అదే సమయంలో ప్రియదర్శి పని మీద బెంగుళూరు వెళ్తున్నానని వెళ్లగానే తన స్థానంలో రాహుల్ రామకృష్ణ అయితే బాగుంటుందని ఫిక్స్ చేశాడట ఈ దర్శకుడు. ఆ తర్వాత ప్రియదర్శి రాగానే సినిమాలో ఒక చిన్న లాయర్ పాత్ర ఉందని చెప్పి తనను ఒప్పించాడట సందీప్ రెడ్డి వంగా.
Also Read: చెప్పులతో గిరి ప్రదక్షణ.. హీరోయిన్‌పై మండిపడుతున్న భక్తులు
కెరీర్లు మార్చేసింది
మొత్తానికి ప్రియదర్శి చేయాల్సిన పాత్ర రాహుల్ రామకృష్ణ చేతికి రావడం వల్ల తన కెరీరే మారిపోయింది. అప్పటివరకు రాహుల్ రామకృష్ణ ఆఫ్ స్క్రీన్ మాత్రమే ఉండేవాడు. ఆ తర్వాతే ఆన్ స్క్రీన్ అడుగుపెట్టి కమెడియన్ నుండి హీరోగా కూడా మారాడు. ఒక ప్రామిసింగ్ యాక్టర్‌గా ప్రేక్షకుల దృష్టిలో నిలిచాడు. తను ఎన్ని పాత్రలు చేసినా ‘అర్జున్ రెడ్డి’లో తను చేసిన శివ పాత్ర మాత్రం ఎవ్వరూ మర్చిపోలేరు. అందులో తన బాడీ లాంగ్వేజ్, భాష, యాక్టింగ్.. ఇలా అన్నీ ప్రేక్షకులను ఇంప్రెస్ చేశాయి. ఇప్పుడు తను కూడా టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోయాడు. అలా ‘అర్జున్ రెడ్డి’ ఎంతోమంది కెరీర్లను మార్చేసింది.