Viral Video: రక్షించాల్సిన పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారు. ఫలితంగా ఆ వ్యవస్థకు మచ్చ తెస్తున్నారు కొందరు పోలీసులు. తాజాగా రాజస్థాన్ లోని కోటా ప్రాంతానికి వచ్చారు పోలీసులు. జీపు దిగగానే నేరుగా ఓ షాపులోని వ్యక్తిని పైకి లాగి కొట్టుకుంటూ వాహనం వద్దకు తీసుకెళ్లారు. పోలీసుల దెబ్బకు ఆ వ్యక్తి స్పృహ కోల్పోయి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. అసలేం జరిగింది?
పైన కనిపిస్తున్న ఈ ఘటన మే 29న జరిగింది. ఆలస్యంగా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్‌లోని కోటా ప్రాంతం గురించి చెప్పనక్కర్లేదు. కోచింగ్ సెంటర్లకు కేరాఫ్ ఆ ఏరియా. నీట్, ఐఐటీ, యూపీఎస్సీ పరీక్షలకు ప్రధాన ప్రాంతంగా వీరాజిల్లుతోంది. ఓ షాపులో రిజ్వాన్ పని చేస్తున్నాడు.
తాను పని చేసే దుకాణం ముందు నిలిపిన బైక్‌ను తీయమని సంబంధిత అధికారి ఎస్‌హెచ్‌ఓ పుష్పేంద్రను కోరాడు. బైక్‌కి హ్యాండిల్ లాక్ వేయడంతో దాన్ని కదల్చలేకపోయాడు. ఈలోగా పోలీసులు అక్కడికి వచ్చారు. సహనం కోల్పోయిన ఆ పోలీసు అధికారి.. ప్రజలు సమక్షంలో రిజ్వాన్‌ను చెంప దెబ్బ కొట్టాడు. వెంటనే రిజ్వాన్ కుప్పకూలిపోయి స్పృహ కోల్పోయాడు.
ఇటీవల రిజ్వాన్ తన చెవి ఆపరేషన్ చేయించు కున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కానీ పోలీసులు అతడి వైద్య పరిస్థితిని పట్టించుకోకుండా చేయి చేసుకున్నారని అంటున్నారు. ఇది బాదితుడి వైపు వినిపిస్తున్న వెర్షన్. మరోవైపు పోలీసు అధికారి వెర్షన్ ఇంకోలా ఉంది. ఎస్‌హెచ్‌ఓ పుష్పేంద్ర బన్సివాల్ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు.
ALSO READ: మద్యం తాగిన కోతి, ఏకంగా రెండు క్వార్టర్లను ఎత్తేసింది
మహారాణా ప్రతాప్ జయంతి ర్యాలీకి సన్నాహకంగా పోలీసులు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయడానికి ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. బైక్ విషయంలో రిజ్వాన్ పోలీసులతో దురుసుగా ప్రవర్తించాడని, అందుకే అతడ్ని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లమని చెప్పినట్టు తెలిపారు. తాను దాడి చేసినట్టు వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.
దుకాణదారుడిపై పోలీసులు చేసిన దౌర్జన్యం దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెట్ యూజర్స్ పోలీసు అధికారిని తీవ్రంగా విమర్శిస్తున్నారు. గౌరవనీయులైన సీఎం భజన్‌లాల్ అంటూనే తప్పుడు పార్కింగ్ చేసి ఆ వ్యక్తిని చెంప దెబ్బ కొట్టడానికి ఏ చట్టం అనుమతిస్తుందో మాకు తెలియజేయగలరు? అంటూ ప్రశ్నించాడు. పోలీసులకు శిక్షణ ఇచ్చింది నిజమేనా?
ఆ వ్యక్తి స్పృహ కోల్పోయేలా గట్టి చెంప దెబ్బ కొట్టడం భావ్యమా? అని మరో యూజర్ ప్రశ్నించాడు. అమాయక వ్యక్తికి వీలైనంత త్వరగా పరిహారం ఇవ్వాలని మరికొందరు డిమాండ్ చేశారు. CCTV వెలుగులోకి వచ్చిన తర్వాత జిల్లా ఎస్పీ అమృత దుహాన్ విచారణకు ఆదేశించారు. ఆధారాలు ఉన్నప్పటికీ కొట్టిన పోలీసు అధికారిపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఉన్నతాధికారులు.
Meet SHO Pushpendra Bansiwal of @KotaPolice who slapped a shopkeeper so hard that he instantly fainted and became unconscious.
It was alleged that the SHO asked the shopkeeper to remove a bike parked in front of his shop in the Kaithunipol area of Kota in Rajasthan. The… pic.twitter.com/WHC4mWeXev— NCMIndia Council For Men Affairs (@NCMIndiaa) June 29, 2025