Big Stories

Prathipati Sarath Arrest : ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు అరెస్ట్.. 14 రోజులు రిమాండ్

judicial remand for prathipati sarath
judicial remand for prathipati sarath

Prathipati Sarath Arrest (political news in ap ) : ఏపీ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ లీడర్ ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు ప్రత్తిపాటి శరత్ ను మాచవరం పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. పన్ను చెల్లించకుండా.. ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (ఎస్డీఆర్ఐ) డిప్యూటీ డైరెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. గురువారం తెల్లవారుజామున ప్రత్తిపాటి శరత్ ను అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు.

- Advertisement -

అక్కడ వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం.. క్రీస్తు రాజపురంలోని 1వ అడిషినల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి కరీముల్లా నివాసంలో.. ఆయన ఎదుట అర్థరాత్రి హాజరు పరచగా.. 14 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. ఈ కేసులో ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి.. 409 సెక్షన్ చెల్లదని చెప్పారు. 469 సెక్షన్ ను పరిగణలోకి తీసుకుని జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో.. శరత్ ను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.

- Advertisement -

Read More : గుంటూరులో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

ప్రత్తిపాటి శరత్ పై ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ లో అవెక్సా కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు కుర్రా జోగేశ్వరరావు, బొగ్గవరపు నాగమణి, మాజీ డైరెక్టర్లు పుల్లారావు కుమారుడు శరత్, బొగ్గవరపు అంకమ్మరావు, బొగ్గవరపు మార్కండేయులు, పత్సమట్ల భీమరాజు, ప్రత్తిపాటి టీనె వెంకాయమ్మలను నిందితులుగా పేర్కొన్నారు. వీరిపై ఐపీసీ సెక్షన్లు 420,409, 453, 411(ఎ), 120(బీ) రెడ్ విత్34 కింద కేసులు నమోదు చేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News