BigTV English

Road Accidents in AP : ఏపీలో నెత్తురోడిన రహదారులు.. ఆరుగురు మృతి

Road Accidents in AP : ఏపీలో నెత్తురోడిన రహదారులు.. ఆరుగురు మృతి

6 Dead in Various Road Accidents(Local news andhra Pradesh) : ఏపీలో రహదారులు నెత్తురోడాయి. వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జిల్లాలో.. మద్యం మత్తు నలుగురు యువకుల జీవితాలను చిదిమేసింది. వివరాల్లోకి వెళ్తే.. మామిడికుదురు మండలం నగరం గ్రామానికి చెందిన కొమ్మాబత్తుల జతిన్ పుట్టినరోజు సందర్భంగా 8 మంది యువకులు ఆదివారం రాత్రి యానాంలో సెలబ్రేషన్స్ చేసుకున్నారు.


వేడుకల తర్వాత.. స్వగ్రామానికి ఆటోలో బయల్దేరారు. గత అర్థరాత్రి 12.30 గంటల తర్వాత అమలాపురం మండలం భట్నవిల్లి గ్రామంలో శ్రీ వనువులమ్మ టెంపుల్ ఎదురుగా.. NH216 రోడ్డుపై అమలాపురం నుంచి ముమ్మిడివరం వైపుగా వెళ్తున్న AP39UM 7757 చేపల లారీ ని ఢీ కొట్టింది.

ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 8 మందిలో నలుగురు మృతి చెందారు. ప్రమాద ప్రాంతానికి వెళ్లిన పోలీసులు గాయపడిన నలుగురు క్షతగాత్రులను కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను మార్చురీకి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.


ఏలూరు జిల్లాలో జరిగిన మరో ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. సోమవరప్పాడు వద్ద రెండు బైకులు ఢీ కొనగా ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు గాయపడగా.. వారిని ఆస్పత్రికి తరలించారు.

 

Tags

Related News

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Big Stories

×