BigTV English

CM Jagan Remove Bandage: ముగిసిన గులకరాయి కట్టు‘కథ’..!

CM Jagan Remove Bandage: ముగిసిన గులకరాయి కట్టు‘కథ’..!

CM Jagan Removes Bandage YSRCP Manifesto: ఏపీలో గులకరాయి కట్టు‘కథ’ ఎపిసోడ్ ముగిసింది. సీఎం జగన్‌ నుదిటిపై వేసుకున్న ప్లాస్టర్‌ను తీసేశారు. దాదాపు మూడు వారాలకు పైగా ప్లాస్టర్‌తో కనిపించిన ఆయన మ్యానిఫెస్ట్ రిలీజ్ సందర్భంగా దాన్ని తీశేసారు. మరోవైపు విజయవాడ సెంట్రల్ సెగ్మెంట్ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్‌ కట్టు తీసేశారు. సీఎంతో పాటు తనకూ దెబ్బ తగిలింని స్వల్పంగా కంటికి గాయమైనట్టు మాజీమంత్రి ప్రకటించారు. అయితే ఆయన కంటికి వేసిన కట్టు సైజ్ చూసి దొబ్బలోతుగా తగిలిందని అందరూ భావించారు .. ఆయన కూడా ఇప్పుడు ప్రచారంలో మామూలుగానే కనిపిస్తున్నారు.


ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఎట్టకేలకు నుదుటిపై ఉన్న బ్యాండేజ్‌ను తీసేశారు. ఈ నెల 13న రాత్రిపూట చీకట్లో గులకరాయి విసిరిన ఘటనలో సీఎం జగన్‌ నుదుటికి గాయమైంది. దానిపై తెగ హడావుడి జరిగింది. అప్పటి నుంచి కంటి పైభాగంలో బ్యాండేజ్‌ రోజుకో సైజ్‌లో కనిపించడంపై ట్రోలింగ్ మొదలైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న సిద్ధం సభలకు సైతం పెద్ద సైజు బ్యాండేజ్‌తో రావడంతో సోషల్ మీడియాలో రకరకాల సెటైర్లు మొదలయ్యాయి. దివంగత వైఎస్‌ వివేకానంద కుమార్తె డాక్టర్ వైఎస్ సునీత సైతం గాయంపై అన్ని రోజులు బ్యాండేజ్‌ ఉంటే సెప్టిక్‌ అవుతుందని సూచనలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు సోషల్ మీడియాలో ట్రోలింగ్‌ మొదలవడంతో బ్యాండేజీ తొలగించి మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి హాజరయ్యారు. ‘ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం. జూమ్ చేసి చూస్తే దెబ్బ మటుమాయం’ అంటూ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేసిన ట్వీట్‌ ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.


Also Read: భారతి Vs షర్మిళ.. అందరిచూపు కడపపై.. అంతఃపురం లోగుట్టు..

సీఎం జగన్‌ నుదిటిపై విజయవాడలో గులకరాయి తగిలిన రోజు నుంచి 25 వరకూ ప్లాస్టర్‌తోనే కనిపించారు. మరోవైపు విజయవాడ మధ్య నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్‌ కూడా కట్టు తీసేశారు. అదే రోజు సీఎంతో పాటు తనకూ దెబ్బ తగిలిందంటూ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. స్వల్పంగా కంటికి గాయమైనట్టు తెలిపారు. ఆ కట్టును అలాగే ఉంచి పది రోజులు ప్రచారం చేశారు. తాజాగా ప్లాస్టర్ తీసేసి 15 రోజుల ‘కట్టు’ కథ పూర్తి చేశారన్న సెటైర్లు మొదలయ్యాయి. అంత కట్టు కట్టించుకున్న వెల్లంపల్లి ముఖంపై గాయం ఆనవాళ్లు కూడా కనిపించకపోతుండటంతో ఆయన నెటిజన్లను టార్గెట్ అవుతున్నారు.

గులకరాయి ఘటనలో సీఎం జగన్‌కు ఆస్కార్‌కు బదులు భాస్కర్‌ అవార్డు ఇవ్వాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎద్దేవా చేశారు. ఇక వెల్లంపల్లిపై ఒక రేంజ్లో సెటైర్లు విసిరారు.

Also Read: NDA Alliance Joint Manifesto: ఎన్డీఏ కూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదలు..

ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి మండలం నీరుకొండలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న లోకేష్.. వైసీపీ నేతల తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని ఓటర్లను కోరారు. మొత్తానికి అలా ఎండ్ కార్డ్ పడింది బ్యాండ్‌ఎయిడ్ల ఎపిసోడ్‌కి.

Tags

Related News

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Big Stories

×