Aadhaar Card: ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు అవసరం. మన ఆధార్ కార్డు ప్రతి పథకం వర్తించేందుకు మనకు ఆధారమే. మన గుర్తింపును తెలియజేసే కార్డుగా ఆధార్ ప్రాచుర్యంలో ఉంది. ఇంతటి ప్రాముఖ్యత సంతరించుకున్న ఆధార్ గురించి కీలక ప్రకటన వెలువడింది. మీ ఇంట్లో చిన్నారులు ఉన్నారా? వారికి ఆధార్ కార్డు ఉందా? అయితే తప్పనిసరిగా ఈ నిబంధన పాటించాలని ఆధార్ ప్రధాన కేంద్రం కోరింది. ఆ ప్రకటన ఏమిటో తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వం ప్రతి భారతీయుడికి ఆధార్ కార్డును జారీ చేసింది. ఈ కార్డు మన గుర్తింపును తెలియజేస్తుంది. ఆధార్ కార్డును మన గుర్తింపు కార్డుగా ఎక్కడైనా వినియోగించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసే పథకాలకు దరఖాస్తు చేసే సమయంలో ఆధార్ కార్డును కూడా పరిగణలోకి తీసుకుంటారు. అందుకే మనదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఆధార్ ఆధారంగా మారింది. ఆధార్ లో ఏ వివరాలు తప్పుగా నమోదైనా, మనకు కొన్ని సమస్యలు స్వాగతం పలకడం ఖాయం. అందుకే ఆధార్ వివరాలను సరిచేసుకొనే అవకాశాన్ని కూడా ఆధార్ ప్రధాన కేంద్రం కల్పించింది.
5 సంవత్సరాల వయస్సు నుండి ఆధార్ కార్డును పొందే సౌకర్యం అమల్లో ఉంది. ప్రస్తుతం బ్యాంక్, వ్యవసాయ భూములు, ఇలా ఎన్నో వివరాలు ఆధార్ తో అనుసంధానమయ్యాయి. అంతేకాదు పాఠశాలల్లో విద్యార్థుల వివరాలు కూడా ఆధార్ అనుసంధానం చేశారు. నేరస్థుల చరిత్ర తెలుసుకొనేందుకు ఆధార్ ఆధారంగా పోలీసులు ఇట్టే నేరస్థుల వివరాలను కనిపెట్టేస్తున్నారు. ఆధార్ ఇలా మన జీవిత చక్రంలో ప్రధాన భూమిక పోషిస్తుంది. అందుకే ఆధార్ కార్డును ప్రతి ఒక్కరూ కలిగి ఉండాల్సిన పరిస్థితి. మన మొబైల్ నెంబర్ కు ఆధార్ కార్డు లింక్ చేయడం ద్వారా, ప్రతి సందేశం మనకు క్షణాల్లో చేరిపోతోంది. ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డును కలిగి ఉండడమే కాదు.. కొన్ని విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
ఇటీవల ఆధార్ ప్రధాన కేంద్రం ఓ విషయంపై ప్రజలను అప్రమత్తం చేస్తోంది. 5 నుండి 7 సంవత్సరాల వయస్సు గల చిన్నారులు, 15 నుండి 17 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులు తప్పనిసరిగా బయోమెట్రిక్ చేయించుకోవాలని ప్రకటన విడుదల చేశారు. మీ దగ్గరలోని ఆధార్ సెంటర్ కు వెళ్లి బయోమెట్రిక్ చేయించడం ద్వారా, ఆధార్ కార్డు వివరాలు పూర్తి స్థాయిలో నమోదై ఉంటాయని తెలిపారు. పిల్లల వేలిముద్రలు, కనుపాపలు, ముఖం తప్పనిసరిగా ఈ వయస్సులో వారికి అప్ డేట్ చేయించాల్సిన అవసరం ఉందట.
Also Read: Ramzan 2025: కనిపించిన నెలవంక.. రంజాన్ మాసం ఉపవాసాలు ప్రారంభం..
5 నుండి 7, 15 నుండి 17 వయస్సు గల వారి శరీరంలో మార్పు వస్తుందని, ఆ సమయంలో తప్పక బయోమెట్రిక్ చేయించుకోవాలని ప్రకటన విడుదలైంది. ఇలా చేయించడం ద్వారా రేషన్ తీసుకొనే సమయంలో కానీ, ఎక్కడైనా వేలిముద్రలు వేసిన సమయంలో వివరాలు పూర్తి స్థాయిలో సరిపోల్చడం జరుగుతుందట. అందుకే మీ ఇంట్లో ఈ వయస్సు గల చిన్నారులు ఉంటే తప్పనిసరిగా బయోమెట్రిక్ చేయించండి!