BigTV English

Zelenskyy – Trump : జెలెన్స్కీని బయటకు గెంటేయండి – ట్రంప్ తీవ్ర ఆగ్రహం

Zelenskyy – Trump : జెలెన్స్కీని బయటకు గెంటేయండి – ట్రంప్ తీవ్ర ఆగ్రహం

Zelenskyy – Trump : అగ్రరాజ్యం అమెరికా పర్యాటనకు వెళ్లిన జెలెన్స్కీ మీడియా ఎదుటే.. అధ్యక్షుడు ట్రంప్ తో మాటల యుద్ధానికి దిగారు. ఈ విషయమై అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర అసహనానికి గురయ్యాయని తెలుస్తోంది. సాధారణంగానే దూకుడుగా ఉండే ట్రంప్.. అత్యున్నత ఓవల్ కార్యాలయంలో వ్యవహరించిన తీరుపై ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే.. ఉమ్మడి ప్రెస్ మీట్ తర్వాత ఇరు దేశాల కోసం ఏర్పాటు చేసిన భోజనం కూడా చేయకుండానే జెలెన్స్కీ అక్కడి నుంచి బయటకు వచ్చేసినట్లు మీడియా కథనాలు వెల్లడిస్తుండగా… ఆయనను ట్రంప్ గెంటేసినట్లుగా ఫాక్స్ న్యూస్ వెల్లడించింది. “కిక్ జెలెన్స్కీ” అని తన సిబ్బందితో ట్రంప్ గట్టిగా అన్నట్లుగా అక్కడి మీడియా వెళ్లడించింది.


ఖనిజ ఒప్పందం కుదుర్చుకుని.. యుద్ధానికి మద్ధతు అడిగేందుకు అమెరికా వెళ్లిన జెలెన్స్కీకి అనుకోని ఘటన ఎదురైంది. ఏకంగా బహిరంగంగానే ఇరు దేశాల అధినేతలు పరస్పరం మాటలు రువ్వుకోవడంతో.. వారి మధ్య ఏ స్థాయిలో అభిప్రాయ భేదాలు ఉన్నాయో అర్థం అయ్యింది. కాగా.. ఇన్నాళ్లు రష్యాపై యుద్ధానికి అమెరికా అందించిన సాయానికి జెలెన్స్కీ కనీసం రెండు పదాల కృతక్షతలు సైతం చెప్పలేదని.. ఉపాధ్యక్షుడు జేడీ వాన్సన్ విమర్శించారు. అలా.. ట్రంప్, జేడీ వాన్సన్ తో అనుకోని మాటల యుద్ధంలో చిక్కుకున్న జెలెన్స్కీ.. అక్కడి నుంచి అర్థాంతరంగా వెళ్లిపోయారు. ఆ ఘటనపై ప్రత్యేక విషయాల్ని పంచుకున్న ఫాక్స్ న్యూస్ సీనియర్ వైట్ హౌస్ కరస్పాండెంట్ జాక్వి హెన్రిచ్ అనూహ్య విషయాల్ని వెల్లడించారు.

ట్రంప్ తో జరిగిన వాదన తర్వాత వ్లాదిమిక్ జెలెన్స్కీ వైట్ హౌస్ నుంచి బయటకు వెళ్లగా.. ఆయనను అక్కడి నుంచి ట్రంప్ తరిమేశారనే కథనాలు వెలుగులోకి వచ్చాయి. దేశాధ్యక్షుల కోసం ఏర్పాటు చేసిన భోజనాన్ని ప్రెస్ సిబ్బందికి ఆఫర్ చేశారని వెల్లడించారు. ఈ విషయంపై స్పందించిన జెలెన్స్కీ ప్రతినిధి బృందం.. ఆయనకు అత్యవసర పనులున్నాయని, త్వరగా ఇంటికి వెళ్లాల్సి ఉందని తెలిపారు.


Also Read : Citibank : కస్టమర్ ఖాతాలో రూ.700 లక్షల కోట్లు జమ – ఆ ఆనందం రెండు నిముషాలే.

జెలెన్స్కీ విధానంతో అధ్యక్షుడు ఇబ్బందికి గురయ్యారని.. ఆయన వ్యవహరించిన తీరుపై మీటింగ్ తర్వాత అసంతృప్తి వ్యక్తం చేశారు. జెలెన్స్కీ బాడీ లాంగ్వేజ్ కూడా సరిగా లేదని.. ఆ విషయమై వైట్ హౌస్లో నేతల మధ్య చర్చకు వచ్చిందని రిపోర్టర్లు తెలిపారు. ఆయన భుజాలు తడుముకోవడం, కళ్ళు తిప్పుకోవడం వంటి చర్యల ద్వారా కృతజ్ఞత కాస్త కూడా కనిపించలేదని, ఆ చర్యలన్నీ అగౌరవంగా ఉన్నాయని ట్రంప్, జేడీ వాన్సన్ సహా ఇతరులు చర్చించుకున్నట్లు రిపోర్టు చేశారు. అక్కడి మొత్తం చర్చల్లో జెలెన్స్కీ శాంతికి సిద్ధంగా లేడని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్థారణకు వచ్చారని చెబుతున్నారు. అయితే.. ఆయన శాంతి కావాలని కోరుకున్నప్పుడు తిరిగి రావచ్చని చెప్పారని తెలిపారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×