Big Tv Exclusive: బయోపిక్స్‌కు సెపరేట్ క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా పొలిటికల్ బయోపిక్స్‌కు ప్రేక్షకుల్లో మరింత క్రేజ్ ఎక్కువ. రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ లేనివారు, అసలు దాని గురించి ఐడియా లేనివారు కూడా ఇలాంటి పొలిటికల్ బయోపిక్స్‌ను చూడడానికి ఇష్టపడతారు. అందుకే రాజకీయ నాయకుల జీవితాలపై కేవలం సినిమాలు మాత్రమే కాదు.. వెబ్ సిరీస్‌లు కూడా తెరకెక్కడానికి సిద్ధమవుతున్నాయి. తాజాగా ఒక ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ కూడా చంద్రబాబు, వైఎస్ఆర్ జీవితాలపై వెబ్ సిరీస్ తెరకెక్కించాలని నిర్ణయించుకుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కే ఈ వెబ్ సిరీస్‌లో ఎవరెవరు ఏయే పాత్రలు చేస్తున్నారనే విషయం తాజాగా బయటపడింది.
భారీ బడ్జెట్‌తో
టాలీవుడ్‌లో పొలిటికల్ థ్రిల్లర్స్‌ను తెరకెక్కించే దర్శకుల్లో దేవకట్ట (Deva Katta) ఒకరు. ఆయన సినిమా మేకింగ్ స్టైల్‌కు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన తెరకెక్కించిన సినిమాలు కమర్షియల్ వర్కవుట్ అయినా అవ్వకపోయినా పొలిటికల్ థ్రిల్లర్స్‌ను ఆయనకంటే బాగా ఎవరూ తెరకెక్కించలేరని ఫ్యాన్స్ అంటుంటారు. అలాంటి దేవకట్ట చేతికి ఇప్పుడు ఒక భారీ బడ్జెట్ పొలిటికల్ వెబ్ సిరీస్ వచ్చింది. చంద్రబాబుతో పాటు వైఎస్ఆర్ లాంటి సీనియర్ రాజకీయ నాయకుల జీవిత కథల ఆధారంగా తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ ఇది. సోనీ లివ్ సంస్థ ఈ వెబ్ సిరీస్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా నిర్మించడానికి ముందుకొచ్చింది. దీనికోసం ఎంత బడ్జెట్ అయినా కేటాయించడానికి సిద్ధమయ్యింది.
యంగ్ హీరోలతో
సోనీ లివ్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ పొలిటికల్ వెబ్ సిరీస్‌లో చంద్రబాబు పాత్రలో ఆది పినిశెట్టి, వైఎస్ఆర్ పాత్రలో చైతన్య రావు నటించనున్నట్టు సమాచారం. ఇలాంటి ఒక పొలిటికల్ బయోపిక్ వెబ్ సిరీస్ కోసం ఆది, చైతన్య లాంటి యంగ్ హీరోలను ఎంచుకోవడం ఆశ్చర్యంగా ఉన్నా దేవకట్ట వీరితో ఏదో ఒక మ్యాజిక్ చేస్తాడని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. అంతే కాకుండా కాస్త లుక్స్ మారిస్తే వారే చంద్రబాబు, వైఎస్ఆర్ పాత్రల్లో ఆశ్చర్యపరిచేలా ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక పొలిటికల్ వెబ్ సిరీస్‌ను దాదాపు రూ.60 నుండి 70 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారని సమాచారం. చంద్రబాబు, వైఎస్ఆర్ మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ ఉన్నప్పుడు జరిగిన సంఘటనల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కనుందట.
Also Read: పోసానికి ఏం అవ్వలేదు.. అంత డ్రామాలే.. డాక్టర్లు ఏం అన్నారంటే.?
ఇద్దరికీ మంచి అవకాశం
ఆది పినిశెట్టి (Aadhi Pinisetty), చైతన్య రావు (Chaitanya Rao).. ఈ ఇద్దరూ ఇప్పటివరకు ఒక్క బయోపిక్‌లో కూడా కనిపించలేదు. ముఖ్యంగా ఆది పినిశెట్టి ప్రస్తుతం వెరైటీ జోనర్‌లో సినిమాలు ట్రై చేస్తూ ప్రేక్షకులను ఇంప్రెస్ చేసే పనిలో పడ్డాడు. ఇక చైతన్య రావుకు అయితే తన కెరీర్‌లో వేగం పెంచుకోవడానికి ఇది బెస్ట్ ప్రాజెక్ట్ అవుతుందని ఇండస్ట్రీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ‘30 వెడ్స్ 21’ అనే వెబ్ సిరీస్‌తో నటుడిగా లైమ్‌లైట్‌లోకి వచ్చాడు చైతన్య. ఆ తర్వాత పలు సినిమాల్లో యాక్టర్‌గా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. మామూలుగా చైతన్యకు ఆ వింటేజ్ లుక్ ఉంది కాబట్టి వైఎస్ఆర్ పాత్రలో తను సరిగ్గా సరిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది.
#Devakatta #Chiatanyarao #AadhiPinisetty #ChandrababuNaidu #YSR #YSJagan #YSJaganMohanReddy @devakatta @SonyLIV @IamChaitanyarao @AadhiOfficial @ncbn @ysjagan pic.twitter.com/HRBLN683yJ
— BIG TV Cinema (@BigtvCinema) March 1, 2025