Srikakulam: శ్రీకాకుళం జిల్లా బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఓ టీచర్ అరాచకం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు విద్యార్థులు ఆమెకు కాలు పడుతున్నట్టు ఒక వీడియో వైరల్‌గా మారింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.. ఉపాధ్యాయురాలిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కాళ్ళు బెనికి కింద పడిపోయిందని..దాంతో పిల్లలు వచ్చి సహాయం చేశారంటూ టీచర్ తెలిపింది. ఘటనపై స్పందించిన విద్యాశాఖ అధికారులు టీచర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.