BigTV English

Annamaya District: అభయాంజనేయ స్వామి ఆలయం కూల్చివేత.. గుప్త నిధుల కోసమేనా?

Annamaya District: అభయాంజనేయ స్వామి ఆలయం కూల్చివేత.. గుప్త నిధుల కోసమేనా?

Abhayanjaneya Swamy temple in Annamaya: గుప్త నిధుల కోసం కొంతబంది దుండగులు ఓ పురాతన ఆలయాన్ని ధ్వంసం చేశారు. ఏకంగా అభయాంజనేయ స్వామి ఆలయాన్ని కూల్చి వేశారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది.


వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లాలో గుప్త నిధుల కలకలం రేగింది. గుర్తు తెలియని దుండగులు గుప్త నిధుల కోసం 16వ శతాబ్ధంలో నిర్మించిన కనుగొండ రాయస్వామి ఆలయానికి సమీపంలో ఇటీవల ఓ బండపై అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని చెక్కి ఆలయం నిర్మించారు. అయితే ఈ ఆలయాన్ని కొంతమంది ధ్వంసం చేశారు.

ములకలచెరువులో గ్రామానికి కాస్త దూరంగా శ్రీఅభయాంజనేయ స్వామి ఆలయం ఉంది. దీనిని కొంతమంది గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. అయితే పునాదులతో సహా ఆలయాన్ని పెకిలించడంతోపాటు గేట్లు ధ్వంసం చేశారు. ఈ మేరకు ఆర్ఎస్ఎస్, బీజేపీ, వీహెచ్పీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


అయితే, గుప్త నిధుల కోసం ఇలా చేసి ఉంటారేమోనని సీఐ రాజా రమేశ్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ ఆలయాన్ని కూలగొట్టిన దుండగులను వెంటనే చట్ట ప్రకారం శిక్షించేందుకు చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖకు ఆదేశించాడు.

ఇదిలా ఉండగా, గతంలోనూ ఇలాగే ఓ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఆలయం సమీపంలో బండ్లపై చెక్కిన అభయాంజనేయ స్వామి కళ్లకు గంతలు కట్టి గుప్తనిధులు కోసం తవ్వకాలు జరిపిన ఘటన కలకలం రేగింది. అయితే ఏడాది కిందట ఓ బండపై అభయాంజనేయ స్వామి ఆలయాన్ని నిర్మించడంతోపాటు విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు స్థానికులు చెబుతున్నారు.

కొంతమంది దుండగులు కావాలనే దాడి చేశారని, సుత్తి, గడ్డపార సహాయంతో గోడను కిందిభాగంలో ధ్వంసం చేశారు. ఈ ప్రాంతం పూర్తిగా కొండలో ఉండడంతో ఎవరూ దాడి చేశారనే విషయం ఇంకా కొలిక్కి రాలేదు. కావాలనే ధ్వంసం చేశారని స్థానికులు చెబుతున్నారు.

Also Read: అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు మొలకలచెరువు ఎస్‌ఐ గాయత్రి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం వివరాలు తెలుసుకున్నారు. మరోవైపు ఈ ఘటనపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. కూల్చివేతలకు కారణమైన దుండగులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

Tags

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×