BigTV English
Advertisement

Vettaiyan OTT : అప్పుడే ఓటీటీ లోకి వచ్చేస్తున్నరజినీకాంత్ మూవీ..స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

Vettaiyan OTT : అప్పుడే ఓటీటీ లోకి వచ్చేస్తున్నరజినీకాంత్ మూవీ..స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

Vettaiyan OTT : తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ గత ఏడాది జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే .. ఆ సినిమాతో కమ్ బ్యాక్ ఇచ్చిన రజిని తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వేట్టయాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు . ఆ మూవీ కథ కొత్తగా చూపించిన జనాలకు పెద్దగా అర్థం కాలేదు దాంతో సినిమా యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. కానీ కలెక్షన్స్ పరంగా ఈ మూవీ దూసుకుపోతుంది. మొదటి రోజునే ఈ మూవీ మంచి కలెక్షన్స్ ను అందుకుంది. ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతుంది . అదేంటంటే ఈ సినిమా అప్పుడే ఓటిటిలోకి రాబోతుందని ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. అస్సలు విషయమేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..


రజినీ నటించిన హిట్ సినిమా జైలర్ తర్వాత ఈ మూవీ రాబోతుందని ఫ్యాన్స్ భారీ అంచనాల ను పెట్టుకున్నారు . భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ అక్టోబర్ 10 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జ్ఞానవేల్ దర్శకత్వం వహించగా, ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా నిర్మించింది. ఈ సినిమాలో అమితాబ్ , ఫాహద్ ఫాజిల్ వంటి స్టార్ హీరోలు నటించారు. దసరా సెలవులు ముగియడం తో అందరికీ అందుబాటులో ఉండే విధంగా తెలంగాణ లో ఈ మూవీ టికెట్ రేట్లను తగ్గించారు. మల్టీ ప్లెక్సుల్లో రూ.200, సిటీ సింగిల్ స్క్రీన్‌లలో రూ.150, డిస్ట్రిక్ట్ సింగిల్ థియేటర్లలో రూ.110గా టికెట్ రేట్లను ఫిక్స్ చేశారు. త్వరలోనే ఈ రేట్లు అందుబాటు లోకి రానున్నాయి . కాగా , ప్రస్తుతం చెన్నైలో కురుస్తున్న వర్షాల కారణంగా థియేటర్లలో విడుదలైన ఈ కలెక్షన్లు భారీగా దెబ్బతిన్నాయి. దీంతో ఓటీటీ లోకి ఈ మూవీ ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. వెట్టయన్ తమిళ్ తో పాటు తెలుగు లోనూ రిలీజ్ అయ్యింది. ఒకవైపు పాజిటివ్ టాక్ ను అందుకుంది . మరోవైపు మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే తాజాగా ఈ మూవీ ఓటిటి లోకి రాబోతుందని వార్తలు ఊపందుకున్నాయి.

ఇప్పటిలో వరదలు తగ్గే అవకాశాలు కనిపించలేదు దాంతో ఈ మూవీని ఓటిటిలో కి తీసుకొచ్చేందుకు మేకర్స్ ఆలోచిస్తున్నారట . ఇందులో నిజమెంత ఉందో తెలియదు కానీ ఫ్యాన్స్ మాత్రం సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 240 కోట్ల కు పైగా బాక్సాఫీస్ రికార్డ్ క్రియేట్ చేస్తుంది. రజనీ కాంత్ వెట్టయన్ ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది.. దాదాపు 90 కోట్ల భారీ ధరకు హక్కులను సొంతం చేసుకుంది. మాములుగా అయితే ఈ మూవీ వచ్చే నెల ఓటిటిలోకి రానుంది. మరి దీనిపై త్వరలోనే వివరాలను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఈ మూవీ ప్రమోషన్స్ టైం లో రజినీకాంత్ అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు ..


Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×