BigTV English

Adimulapu Suresh | వైసీపీ కోసం ఆదిమూలపు సురేష్ సాహసం.. ఆ స్థానం నుంచి పోటీ

Adimulapu Suresh | ఏ ఎమ్మెల్యే అయినా ఒకసారి గెలవగానే నియోజకవర్గ ప్రజలు, కేడర్‌తో మమేకమవ్వాలని చూస్తారు .. అదే సెగ్మెంట్ నుంచి తర్వాత ఓటమిపాలైనా అదే నియోజకవర్గాన్నే అంటిపెట్టుకుని ఉంటారు … అంతగా ఆ ప్రాంతంతో బంధం పెంచుకుంటారు … అయితే కొందరు నేతలకు మాత్రం ఒకసారి గెలిచిన నియోజకవర్గం మరొకసారి అచ్చిరాదు … గెలిపించిన ప్రజలు, క్యాడర్‌తో సత్సంబంధాలు ఉండవు

Adimulapu Suresh | వైసీపీ కోసం ఆదిమూలపు సురేష్ సాహసం.. ఆ స్థానం నుంచి పోటీ

Adimulapu Suresh | ఏ ఎమ్మెల్యే అయినా ఒకసారి గెలవగానే నియోజకవర్గ ప్రజలు, కేడర్‌తో మమేకమవ్వాలని చూస్తారు .. అదే సెగ్మెంట్ నుంచి తర్వాత ఓటమిపాలైనా అదే నియోజకవర్గాన్నే అంటిపెట్టుకుని ఉంటారు … అంతగా ఆ ప్రాంతంతో బంధం పెంచుకుంటారు … అయితే కొందరు నేతలకు మాత్రం ఒకసారి గెలిచిన నియోజకవర్గం మరొకసారి అచ్చిరాదు … గెలిపించిన ప్రజలు, క్యాడర్‌తో సత్సంబంధాలు ఉండవు …. దాంతో ఎప్పటికప్పుడు అలాంటి వారు పోటీ చేసే ప్రాంతాలు మారిపోతుంటాయి .. ఆ మంత్రి పరిస్థితి సేమ్ అలానే ఉంది.. ఇంతకు ఆమంత్రి ఎవరంటారా?


మంత్రి ఆదిమూలపు సురేష్ .. ప్రస్తుత ఏపి మున్సిపాల్ శాఖమంత్రి .. దక్షిణ మధ్య రైల్వేలో ఐఆర్ఎస్ అధికారిగా పనిచేశారు … తర్వాత వీఆర్ఎస్ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చారు … 2009 లో కాంగ్రెస్ తరుపున ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నుంచి పోటీ చేసి విజయం సాధించారు … ఆ తర్వాత జగన్ వెంట నడిచారు …2014 ఎన్నికల్లో ఆదిమూలపు సురేష్‌ని సంతనూతలపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేయించారు. అప్పడు వైసీపీ అధికారంలోకి రాలేదు … 23 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడి వెళ్లినప్పటికీ ఆదిమూలపు సురేష్ వైసీపీనే అంటిపెట్టుకుని ఉన్నారు ..

అయితే 2019 ఎన్నికలకు వచ్చేసరికి సంతనూతలపాడు నుంచి ఆదిమూలపు సురేష్‌ను మళ్లీ యర్రగొండపాలెంకు షిఫ్ట్ చేశారు… సంతనూతలపాడులో గెలిచే అవకాశాలు లేవని సర్వే నివేదికలు రావడంతో ఆదిమూలపు సురేష్ ను తిరిగి యర్రగొండపాలెం పంపారు … అక్కడి నుంచి ఆయన విజయం సాధించారు… జగన్ తొలి కేబినెట్ లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు … రెండున్నరేళ్ల తర్వాత జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆదిమూలపు సురేష్ ను జగన్ కేబినెట్ లో కొనసాగించారు. అయితే ఈసారి విద్యాశాఖ కాకుండా మున్సిపల్ శాఖకు మార్చారు … తన సొంత జిల్లా అయిన కడపకు ఆయనను ఇన్‌ఛార్జి మంత్రిగానూ జగన్ నియమించారు.


అలా ఆదిమూలపు సురేష్ కు జగన్ అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు …. నియోజకవర్గాలను మారుస్తున్నా ఆయనకు అదృష్టం కలిసివస్తూనే ఉంది.. ఇప్పుడు నాలుగోసారి జరగనున్న ఎన్నికల్లో కొండపి నియోజకవర్గానికి జగన్ మార్చారు … కొండపి నియోజకవర్గం కూడా ఎస్.సి నియోజకవర్గమే .. అక్కడ వైసీపీ ఇంత వరకూ గెలవలేక పోయింది… యర్రగొండపాలెంలో ఆదిమూలపు సురేష్‌పై కొంత వ్యతిరేకత రావడం, అక్కడ నేతలు వచ్చే ఎన్నికల్లో సురేష్ కు మద్దతుగా పనిచేయబోమని చెప్పడం వంటి కారణాలతో ఈసారి కొండపి నియోజకవర్గానికి మార్చారంటున్నారు …

సురేష్ పోటీ చేసినవన్నీ ఎస్సీ నియోజకవర్గాలు కావడం… అక్కడి నేతలతో సఖ్యత లేకపోవడం … ఇతర వర్గాల నేతలతో సర్దుకు పోలేకపోవడం… స్థానికంగా ఉండకపొవటం… అనుచరులు భూ కబ్జా అరోపణులు… వంటి కారణాలతో ఆయన నియోజకవర్గాలు మార్చాల్సి వస్తుందన్న వాదన ఉంది…. అయితే ఈ సారి ఆయన పోటీ చేయనున్న కొండపి వైసీపీలో గ్రూప్ తగాదాలు ఎక్కువంటున్నారు .. మంత్రి సురేష్ కు సానుకుల పరిస్థితులు లేవంటున్నారు .. గతం లో ఇన్‌చార్జిలుగా పనిచెసిన వరికూటి అశోక్ బాబు వర్గం, మాధసి వెంకయ్య వర్గాలకు అసలు సరిపడదంట .. వారిలో ఒక వర్గం మంత్రి సురేష్‌కు పనిచేస్తే … మరో వర్గం వ్యతిరేకంగా పనిచేస్తుందంట… తాజా గా న్యూయార్ వేడుకలలో వరికూటి అశోక్ వర్గం తమకు ప్రాధన్యత ఇవ్వటం లేదని మంత్రి సురేష్ ముందే గొడవకు దిగారు.. మంత్రి సురేష్ రెండు వర్గాలను సముదించలేక పోయారు.. ఆ క్రమంలో కొండపిలో ఆదిమూలపు సురేష్ అద‌ృష్టం ఎలా ఉంటుందో చూడాలి.

Related News

AP News: ధర్మవరంలో పాక్ టెర్రరిస్టులు? డైలీ ఆ దేశానికి కాల్స్.. NIA కస్టడీలోకి ఇద్దరు తీవ్రవాదులు

JanaSena Party: జనసేనలోకి రీఎంట్రీ.. జేడీ లక్ష్మీనారాయణకు కీలక బాధ్యతలు?

AP Rains: ఏపీలో 3 రోజులు దంచుడే.. ఈ 10 జిల్లాల్లో భారీ వర్షాలు

Prakasam district: దారుణం.. తండ్రి అప్పు తీర్చలేదని తన కుమార్తెను కిడ్నాప్ చేసిన వ్యాపారి

Babu Pawan Lokesh: శౌర్యం, శాంతం, సమరం.. RRR లాగా.. SSS

Jagan: పులివెందుల రిజల్ట్.. జగన్ కామెంట్స్ వెనుక

Big Stories

×